Jump to content

యెల్లారం పోచమ్మ దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 19°30′53″N 79°51′43″E / 19.514772°N 79.861809°E / 19.514772; 79.861809
వికీపీడియా నుండి

యెల్లారం పోచమ్మ ‌ దేవాలయం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో యెల్లారం గ్రామంలో శివారులోని అటవీ ప్రాంతంలో కొలువుదీరిన ఎల్లారం పోచమ్మగా ప్రసిద్ధి. కరుణామయి గా కల్పవల్లిగా భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పూజిస్తుంటారు[1][2][3].

పోచమ్మ దేవాలయం యెల్లారం
పోచమ్మ ఆలయం యెల్లారం
పోచమ్మ ఆలయం యెల్లారం
పోచమ్మ దేవాలయం యెల్లారం is located in Telangana
పోచమ్మ దేవాలయం యెల్లారం
పోచమ్మ దేవాలయం యెల్లారం
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు :19°30′53″N 79°51′43″E / 19.514772°N 79.861809°E / 19.514772; 79.861809
పేరు
ఇతర పేర్లు:పోచమ్మ తల్లి
పోచమ్మ క్షేత్రం
పోచమ్మ క్షేత్రంగా
ప్రధాన పేరు :యెల్లారం పోచమ్మ ఆలయం
దేవనాగరి :पोचम्म देवी मंदिर एल्लाराम देवस्थान
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మంచిర్యాల జిల్లా, కన్నేపల్లి మండలం బెల్లంపల్లి పట్టణానికి సమీపంలో
ప్రదేశం:యెల్లారం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పోచమ్మ
ఉత్సవ దేవత:పోచమ్మ
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ దేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:200 సంవత్సరాల క్రితం
సృష్టికర్త:రైతు

చరిత్ర

[మార్చు]

ఈ పోచమ్మ ఆలయానికి సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉందని భక్తులు అంటారు. పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రదేశమంతటా ఒక రైతు పొలం ఉండేదట, ఒక రోజు ఆ రైతు పొలంలో విత్తనాలు వేయడానికి పొలాన్ని దున్నుతున్న సమయంలో ‌ఆ రైతు నాగలి కర్ర పోచమ్మ తల్లి తలలో తాకి రక్తం ఏరులై పారిందట. అప్పుడు ఆ రైతు నాగలి ఆపి ఎవ్వరమ్మ నీవు అని ప్రశ్నించడంతో పోచమ్మ తల్లి రైతుకు ఇలా సమాధానం చెప్పిందట‌ నేను పోచమ్మ తల్లిని నా ఆలయం కట్టవద్దు. ఒక పురి గుడిసె కట్టి నన్ను తిష్టించి పూజలు ప్రారంభించండి అని చెప్పడంతో ఆ రైతు గ్రామస్థులతో సమాచారం తెల్పి అదే ప్రదేశంలో ఆ రైతు పోచమ్మ తల్లి గుడిసె కట్టి అందులో అమ్మను ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారట అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా పోచమ్మకు గుడి కట్ట లేదు. ఈ తల్లి కోరిక కోర్కెలు తీర్చడం తో భక్తులు ఇదే ప్రాంతంలో గుడి కట్టడానికి ప్రయత్నించగా ఎన్నో అడ్డంకులు రావడంతో గుడి కట్టలేక పోతున్నారు.

గుడిసెలో పోచమ్మ

[మార్చు]

యెల్లారం పోచమ్మ తల్లికి ఆలయంలో బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని అడవి ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఉంది.ఈ గుడిని భక్తులు రెకులు, వాసాలు దూలాలతో నిర్మించి పైన పెంకులు కప్పబడి ఉంటుంది ‌. గుడిలో భక్తులు టెర్రాకోట మట్టి తో చేసిన గుర్రాలు, ఇనుముతో చేయించిన త్రీసూలాలు, కట్టెలతో తయారు చేసిన విగ్రహాలు ఉయ్యాలాలు మనకు దర్శనమిస్తాయి.ఇవి భక్తులు కానుకగా సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇచ్చట అమ్మవారి ఆలయం కట్టలేక పోతున్నారు. ఎందుకంటే సాక్షాత్తు పోచమ్మ తల్లిలే గుడి కట్టకుండా ఆపుతుందని భక్తులు అంటారు. అందువల్ల ఇక్కడి దేవాలయం గుడిసెలో ఉంది.

పూజలు

[మార్చు]

పోచమ్మ తల్లికి భక్తులు పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. పోచమ్మ తల్లికి పెరుగన్నం అంటే ఎంతో ఇష్టం.పోచమ్మను పసుపుతో పూజించడం పూర్వం నుంచి ఉన్న‌ ఆచారం. ఆదివారం నాడు తల్లికి పసుపుతో అలంకరించి కుంకుమ తిలకం దిద్ది పూల దండలు మెడ వేస్తారు.అమ్మవారి గర్భగుడిలో పసుపు రాశులు దర్శనం ఇస్తాయి.శక్తి స్వరూపిణి అమ్మ ఆరుగురు అక్కాచెల్లెళ్ళుతో కలిసి పూజలు అందుకోవడం విశేషం.

భక్తుల తాకిడి

[మార్చు]

ఎల్లరాం పోచమ్మ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవాలయం ఇక్కడ ప్రతి ఆదివారం గురు వారం భక్తులు అధిక సంఖ్యలో హాజరై పోచమ్మను దర్శించుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా పొరుగు ఉన్న జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ కన్నేపల్లి మండలంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల ప్రజలు వచ్చి పోచమ్మ తల్లిని దర్శించుకొని మొక్కు×లు తీర్చుకుంటారు. చల్లంగ చూసే తల్లిగా మహాశక్తి గా ఇక్కడ పూజలందుకుంటుంది. కరుణామయిగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మను భక్తులు డప్పు చప్పుళ్ళతో పోచమ్మ గుడి మారుమోగుతుంది. పోచమ్మ తల్లికి భక్తులు ఆదివారం నాడు పెద్ద ఎత్తున మేకలు, కోళ్ళు, బెల్లం ఇలా వివిధ రకాల నైవేద్యాలతో అమ్మ వారికి సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సహా పంక్తి భోజనాలు చేసి ముగించి ఇంటికి ‌వేళ్ళుతారు.

జాతర

[మార్చు]

ఇచట ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది.

మూలాలు

[మార్చు]
  1. sudharani (2022-12-18). "ఎల్లారం పోచమ్మ ఆలయయంలో భక్తుల సందడి". www.dishadaily.com. Retrieved 2024-11-07.
  2. "Sri Sri Yellaram Pochamma Temple". templesofindia.org (in ఇంగ్లీష్). Retrieved 2024-11-07.
  3. telugu, NT News (2022-12-19). "పోషించే తల్లి పోచమ్మ". www.ntnews.com. Retrieved 2024-11-07.