యోగేందర్ చందోలియా
యోగేందర్ చందోలియా | |
---|---|
లోక్‍సభ సభ్యుడు | |
Assumed office 4 జూన్ 2024 | |
అంతకు ముందు వారు | హన్స్ రాజ్ హన్స్ |
నియోజకవర్గం | నార్త్ వెస్ట్ ఢిల్లీ |
మున్సిపల్ కౌన్సిలర్ | |
In office 2007–2017 | |
అంతకు ముందు వారు | కొత్త వార్డు సృష్టించబడింది |
తరువాత వారు | సుశీల ఖోర్వాల్ |
వ్యక్తిగత వివరాలు | |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
నివాసం | కరోల్ బాగ్ , ఢిల్లీ |
వృత్తి | వ్యాపారవేత్త |
యోగేందర్ చందోలియా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]యోగేందర్ చందోలియా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి కరోల్ బాగ్ జోన్‌లోని దేవ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) మేయర్‌గా ఆ తరువాత మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) స్టాండింగ్ కమిటీకి అధ్యక్షుడిగా పని చేసి 2023లో బీజేపీ ఢిల్లీ యూనిట్ జనరల్ సెక్రటరీగా నియమితుడయ్యాడు. ఆయన 2015, 2020లో ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కరోల్ బాగ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్‌పై 290849 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (20 May 2024). "Party respects Babasaheb... I am here because of the Constitution: BJP's North West Delhi candidate" (in Indian English). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
- ↑ India Today (24 May 2024). "Meet Yogender Chandolia: North West Delhi candidate for Lok Sabha election 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - North-West Delhi". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.