Jump to content

రంజనా దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
రంజన
జననం
రంజనా దేశ్‌ముఖ్

1955
మరణం2000, మార్చి 3
విద్యాసంస్థపరెల్ ఇంగ్లీష్ హైస్కూల్
క్రియాశీల సంవత్సరాలు1975–1987
తల్లిదండ్రులువత్సల దేశముఖ్

రంజనా దేశ్‌ముఖ్ (1955 - 2000, మార్చి 3) మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. 1970, 80లలో మరాఠీ సినిమాలలో నటించింది.[1]

జననం

[మార్చు]

రంజన 1955లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. రంజన తల్లి వత్సల దేశముఖ్, పినతల్లి సంధ్య (వి. శాంతారామ్ భార్య) ఇద్దరూ హిందీ సినిమా నటీమణులే.[2]

సినిమారంగం

[మార్చు]

1975లో వి. శాంతారాం దర్శకత్వం వహించిన చందనాచి చోళి అంగ్ అంగ్ జాలి అనే సినిమా ద్వారా సినిమారంగానికి పరిచయమయింది. ఆ తర్వాత శాంతారాం తీసిన ఝంజ్‌ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. 1980లో వచ్చిన అరే సన్సార్ సన్సార్, 1983లో వచ్చిన గప్ చుప్ గప్ చుప్ సినిమాలలో నటనకు రెండుసార్లు ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది.[3] తరువాతికాలంలో సుశీల, గోంధలత్ గోంధాల్, ముంబయిచా ఫౌజ్దార్, బిన్ కమాచా నవ్రా, ఖిచ్డీ, చానీ, జఖ్మీ వాఘిన్, భుజంగ్, ఏక్ దావ్ భూతచా సినిమాలలో నటించింది.

అశోక్ సరాఫ్, అవినాష్ మసురేకర్, శ్రీరామ్ లాగూ, కుల్దీప్ పవార్, నిలు ఫూలే, రవీంద్ర మహాజని, రాజా గోసావి వంటి అనేకమంది ప్రముఖ మరాఠీ చలనచిత్ర నటులతో కలిసి నటించింది. 1987లో ఝంఝార్ షూటింగ్ కోసం బెంగుళూరుకు వెళుతున్నపుడు జరిగిన కారు ప్రమాదంలో రంజన కాళ్ళు చచ్చుబడిపోవడంతో సినిమారంగానికి దూరమయింది. ప్రమాదం తర్వాత ఆమె ఫక్త్ ఏక్దాచ్ అనే నాటకంలో నటించింది.[4]

మరణం

[మార్చు]

రంజన 45 ఏళ్ళ వయసులో 2000, మార్చి 3న సెంట్రల్ ముంబై, పరేల్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించింది.[1]

రంజనకు నివాళిగా జీ టాకీస్ 2011 మార్చి 3న రంజన సినిమాలను ప్రసారం చేసింది.[5] రంజన జ్ఞాపకార్థం మహారాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డును కూడా ఏర్పాటుచేసింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Marathi actress dead". The Tribune. 4 March 2000. Retrieved 2022-09-10.
  2. "V Shantaram: The man behind the legend". Moneylife NEWS & VIEWS (in ఇంగ్లీష్). Retrieved 2022-09-10.
  3. "18 वर्षांपूर्वी जगातून कायमची निघून गेली रंजना, एका अपघाताने संपुष्टात आले होते करिअर". divyamarathi. 4 April 2018. Retrieved 2022-09-10.
  4. "ऐंशीच्या दशकातील या प्रसिद्ध मराठी अभिनेत्रीने शेवटची काही वर्षं काढली व्हीलचेअरवर". Lokmat. 6 March 2018. Retrieved 2022-09-10. पण त्यांच्या मृत्यूच्या काही वर्षं आधी त्यांनी फक्त एकदाच या नाटकात काम केले होते. या नाटकातील त्यांची भूमिका ही त्यांची शेवटची भूमिका ठरली.
  5. "> News Releases > Zee Talkies pays tribute to veteran actress Ranjana". Indiantelevision.com. Retrieved 2022-09-10.

బయటి లింకులు

[మార్చు]