సంధ్యా శాంతారామ్
సంధ్యా శాంతారామ్ | |
---|---|
జననం | విజయ దేశ్‌ముఖ్ |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | వి. శాంతారాం |
సంధ్యా శాంతారామ్ (విజయ దేశ్‌ముఖ్)[1] మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. 1950-1960లలో వి. శాంతారాం దర్శకత్వం వహించిన పలు హిందీ, మరాఠీ సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది. ఝనక్ ఝనక్ పాయల్ బాజే (1955), దో ఆంఖేన్ బరాహ్ హాత్ (1958), నవరంగ్ (1959), పింజర (1972), అమర్ భూపాలి (1951) సినిమాలలో నటించింది.
జననం
[మార్చు]సంధ్య 1938లో మహారాష్ట్రలో జన్మించింది. సంధ్య అక్క వత్సల దేశముఖ్, వత్సల కుమార్తె రంజనా దేశ్‌ముఖ్ ఇద్దరూ కూడా సినిమా నటిమణులే.
కెరీర్
[మార్చు]అమర్ భూపాలి (1951) సినిమా కోసం కొత్త నటులను వెతుకుతున్నప్పుడు వి. శాంతారాం[2] సంధ్యను చూశాడు. 1952లో అమర్ భూపాలి సినిమాలో గాయని పాత్రలో తొలిసారిగా నటించింది. ఆ తరువాత శాంతారాం తీసిన చాలా సినిమాలలో నటించింది.
ఝనక్ ఝనక్ పాయల్ బాజే సినిమా కోసం శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది. ఈ సినిమా విజయవంతమై, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతోపాటు హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.[3] దో ఆంఖేన్ బరాహ్ హాత్ సినిమాలో సంధ్య తన భర్త పక్కన నటించింది.[4] నవరంగ్ సినిమాలో నటించింది.
మహాభారతం నుండి శకుంతల కథను అనుసరించి తీసిన స్త్రీ (1961) సినిమాలో నటించింది.[5] పింజర సినిమాలో తమాషా నృత్య కళాకారిణిగా ప్రధాన పాత్రలో నటించింది.[6]
2009లో, నవరంగ్ 50వ వార్షికోత్సవం సందర్భంగా వి. శాంతారామ్ అవార్డుల వేడుకలో సంధ్య పాల్గొన్నది.[7]
వ్యక్తిగత జీవితం
[మార్చు]శాంతారాం రెండవ భార్య నటి జయశ్రీని పోలి ఉన్న సంధ్య,[8] జయశ్రీ నుండి విడిపోయిన తరువాత 1956లో శాంతారాంను వివాహం చేసుకుంది.
సినిమాలు
[మార్చు]- 1952: అమర్ భూపాలి
- 1952: పర్చైన్
- 1953: తీన్ బట్టి చార్ రాస్తా
- 1954: మలైక్కల్లన్
- 1955: ఝనక్ ఝనక్ పాయల్ బాజే
- 1958: దో ఆంఖేన్ బరాహ్ హాత్
- 1959: నవరంగ్
- 1961: స్ట్రీ
- 1963: సెహ్రా
- 1966: లడకీ సహ్యాద్రి కీ
- 1971: జల్ బిన్ మచ్లీ నృత్య బిన్ బిజిలీ
- 1972: పింజర
మూలాలు
[మార్చు]- ↑ Meera Kosambi (5 July 2017). Gender, Culture, and Performance: Marathi Theatre and Cinema before Independence. p. 341. ISBN 9781351565905.
- ↑ "Director Vankudre Shantaram". Chicago Tribune. 30 October 1990. p. 11.
- ↑ "State Awards for Films: Film in India, 1956" (PDF). Ministry of Information and Broadcasting, Government of India. 28 April 1957. Retrieved 2022-05-28.
- ↑ Krishnan, Raghu (25 May 2003). "The eyes have it". The Economic Times. Retrieved 2022-05-28.
- ↑ Heidi Rika Maria Pauwels (2007). Indian literature and popular cinema: recasting classics. Psychology Press. pp. 71–72. ISBN 978-0-415-44741-6.
- ↑ Ramachandran. "Newfangled Techniques".
- ↑ "Rani Mukherji, Prakash Raj win V Shantaram awards". The Indian Express. 22 December 2009. Retrieved 2022-05-28.
- ↑ Kahlon, Sukhpreet. "Dedicated to her art: The journey of Sandhya Shantaram". cinestaan.com. Cinestaan. Archived from the original on 2018-02-27. Retrieved 2022-05-28.