నవరంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవరంగ్
Navrang-1959.jpg
నవరంగ్
దర్శకత్వంవి. శాంతారాం
స్క్రీన్ ప్లేవి.శాంతారాం
కథజి.డి.మాడ్గుల్కర్
నటులుమహీపాల్
సంధ్య
సంగీతంసి.రామచంద్ర
భరత్ వ్యాస్ (పాటలు)
ఛాయాగ్రహణంత్యాగరాజ్ పెండార్కర్
కూర్పుచింతామణి బోర్కర్
విడుదల
సెప్టెంబరు 18, 1959
దేశంభారతదేశం
భాషహిందీ

నవరంగ్ 1959లో విడుదలైన హిందీ సినిమా. వి. శాంతారాం దర్శకత్వంలో ఈ సినిమా తీయబడింది[1]. ఈ సినిమాలో నటీమణి సంధ్య చేసిన నృత్యాలు[2] సి.రామచంద్ర సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ ఈ సినిమాలోని "ఆధా హై చంద్రమా రాత్ ఆధీ" అనే పాట ద్వారా సినిమా రంగంలోనికి ప్రవేశించాడు.[3]

కథ[మార్చు]

దివాకర్ (మహీపాల్) ఒక కవి. అతి సాదాగా కనిపించే భార్య జమున(సంధ్య)ను చూసి ప్రేరణ పొంది మోహిని అనే ఒక కాల్పనిక సుందరిని ఊహించుకుని, కవిత్వం వ్రాస్తూ ఉంటాడు. దివాకర్ తండ్రి ఒక చిన్న సంస్థానంలో రాజోద్యోగి. ఇంగ్లీషు వాళ్లు వచ్చి యువరాజును వ్యసనాల పాలు చేసి రాజ్యాన్ని కబళిస్తారు. రాజు కవి బంధించి పాడమని నిర్బంధించి భంగపడతాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పాడటం మూలాన కవి ఉద్యోగం ఊడుతుంది. ఫలితంగా అతడు తన రోగిష్టి తండ్రిని, తన కుమారుణ్ని పొషించలేక పోతాడు. ఇవన్నీ చూసి జమునలో కోపం పెరుగుతుంది. పైపెచ్చు తన ఊహాసుందరి మోహినపై కవిత్వం చెప్పడం చూసి ఆమె అతనితో జగడం చేసుకుని కొన్నాళ్లకు పుట్టింటికి వెళ్లిపోతుంది. అతడు కవిత్వం రాయడానికి ముడిసరకు దొరక్క వ్యర్థుడౌతాడు. చివరకు భార్య అర్థం చేసుకుని చేరువవుతుంది[4].

నటీనటులు[మార్చు]

 • సంధ్య - జమున/మోహిని
 • మహీపాల్ - దివాకర్
 • కేశవరావ్ డాటే
 • చంద్రకాంత్ గౌర్
 • వందన
 • ఉల్లాస్
 • వత్సల దేశ్‌ముఖ
 • ఆఘా
 • బాబూరావ్ పెండార్కర్
 • జితేంద్ర

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకుడు : వి. శాంతారాం
 • కూర్పు: చింతామణి బోర్కర్
 • బ్యానర్ : రాజ్‌కమల్ కళామందిర్
 • ఛాయాగ్రహణం: త్యాగరాజ్ పెండార్కర్
 • నృత్యం: శ్యాం కుమార్
 • సంగీతం : సి.రామచంద్ర
 • పాటలు: భరత్ వ్యాస్
 • శబ్ద గ్రహణం: ఎ.కె.పర్మార్కర్

పాటలు[మార్చు]

అన్ని పాటలు రచించినవారు భరత్ వ్యాస్, చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: సి.రామచంద్ర.

సంఖ్య. పాటగాయకుడు(లు) నిడివి
1. "ఆ దిల్ సే దిల్ మిలా లే"  ఆశా భోస్లే  
2. "ఆధా హై చంద్రమా"  ఆశా భోస్లే, మహేంద్ర కపూర్  
3. "అరే జా రే హట్ నట్‌కట్"  ఆశా భోస్లే, మహేంద్ర కపూర్  
4. "కరి కరి కరి అంధియారి"  ఆశా భోస్లే, సి.రామచంద్ర  
5. "కవిరాజ కవితా కే మత్ అబ్ కాన్ మరోదే"  భరత్ వ్యాస్  
6. "రానే దే రే"  ఆశా భోస్లే, మన్నా డే, సి.రామచంద్ర  
7. "శ్యామల్ శ్యామల్ బరణ్"  మహేంద్ర కపూర్  
8. "తుం మేరే మై తేరీ"  ఆశా భోస్లే  
9. "తుమ్‌ పశ్చిమ్‌ హో హమ్"  సి.రామచంద్ర  
10. "తుం సైయా గులాబ్ కె"  ఆశా భోస్లే  
11. "తూ ఛుపీ హై కహా"  ఆశా భోస్లే, మన్నా డే  
12. "యే మాతీ సభీ కే కహానీ"  మహేంద్ర కపూర్  

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం విభాగం పేరు ఫలితం
1959 ఉత్తమ ఎడిటింగ్ చింతామణి బోర్కర్ విజేత
1960 ఉత్తమ శబ్దగ్రాహకుడు ఎ.కె.పర్మార్ విజేత
ఉత్తమ దర్శకుడు వి. శాంతారాం నామినేట్

మూలాలు[మార్చు]

 1. Nilu N. Gavankar (July 2011). The Desai Trio and The Movie Industry of India. AuthorHouse. p. 72. ISBN 978-1-4634-1941-7. Retrieved 21 June 2012.
 2. "A navrang of Shantaram's films". The Hindu. 2 May 2002.
 3. Mere desh ki dharti' will always be with us Times of India, 28 September 2008.
 4. సంపాదకుడు (1 January 2002). "అర్థం చేసుకుందాం ఆస్వాదిద్దాం - ఆధాహై చంద్రమా". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (7): 54–55. Retrieved 20 April 2018.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నవరంగ్&oldid=2338847" నుండి వెలికితీశారు