Jump to content

రంజిత్ దత్తా

వికీపీడియా నుండి
రంజిత్ దత్తా
రంజిత్ దత్తా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు పల్లబ్ లోచన్ దాస్
నియోజకవర్గం సోనిత్‌పూర్

చేనేత, మైనారిటీల సంక్షేమం, జౌళి & సెరికల్చర్ మంత్రి
పదవీ కాలం
24 మే 2016 – 10 మే 2021
ముందు బిస్మితా గొగోయ్ (సెరికల్చర్, చేనేత & జౌళి)
చందన్ కుమార్ సర్కార్ (నీటిపారుదల)
సర్బానంద సోనోవాల్ (మైనారిటీల సంక్షేమం)
తరువాత ఉర్ఖావో గ్వ్రా బ్రహ్మ (సెరికల్చర్, హ్యాండ్లూమ్ & టెక్స్‌టైల్స్)
భబేష్ కలిత (నీటిపారుదల)
చంద్ర మోహన్ పటోవారీ (మైనారిటీల సంక్షేమం)

పదవీ కాలం
2010 – 2012
తరువాత సర్బానంద సోనోవాల్

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
19 మే 2016
ముందు పల్లబ్ లోచన్ దాస్
నియోజకవర్గం బెహాలీ
పదవీ కాలం
2001 – 2011
తరువాత పల్లబ్ లోచన్ దాస్
నియోజకవర్గం బెహాలీ

వ్యక్తిగత వివరాలు

జననం (1957-01-24) 1957 జనవరి 24 (వయసు 67)
హతిబోంధా, బిస్వనాథ్ జిల్లా, అస్సాం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు కులధర్ దత్తా
లాబణ్య దత్తా
జీవిత భాగస్వామి
గీతా దత్తా
(m. 1991)
పూర్వ విద్యార్థి దర్రాంగ్ కళాశాల

రంజిత్ దత్తా (జననం 24 జనవరి 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన నాలుగుసార్లు అస్సాం శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనిత్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

దత్తా 2001 అస్సాం శాసనసభ ఎన్నికలలో బెహాలీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బర్నాబాష్ తంతిపై 13529 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

2006 అస్సాం శాసనసభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై 8979 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]  

2011 అస్సాం శాసనసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పల్లబ్ లోచన్ దాస్ చేతిలో 18136 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

2016 అస్సాం శాసనసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రూపక్ శర్మపై 23601 ఓట్ల తేడాతో మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సర్బానంద సోనోవాల్ మంత్రివర్గంలో చేనేత, మైనారిటీల సంక్షేమం, జౌళి & సెరికల్చర్ మంత్రిగా 24 మే 2016న గౌహతిలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[5][6][7]

2021 అస్సాం శాసనసభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి జయంత బోరాపై 29839 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Ranjit Dutta from Behali: Early Life, Controversy & Political Career - Sentinelassam". www.sentinelassam.com (in ఇంగ్లీష్). 2021-03-18. Retrieved 2022-05-30.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sonitpur". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
  3. "Assam Legislative Assembly - Member". 2021-06-27. Archived from the original on 27 June 2021. Retrieved 2022-05-30.
  4. "Behali Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2022-05-30.
  5. "Sarbananda Sonowal takes oath as Assam's chief minister in presence of BJP bigwigs - Photos News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2016-05-24. Retrieved 2022-05-30.
  6. "Sarbananda Sonowal takes oath as first BJP CM of Assam, PM Modi attends ceremony". India Today (in ఇంగ్లీష్). May 24, 2016. Retrieved 2022-05-30.
  7. "As it happened: Sarbananda Sonowal takes oath as Assam CM". Hindustan Times (in ఇంగ్లీష్). 2016-05-24. Retrieved 2022-05-30.