రజనీగంధ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రజనీగంధ
Rajnigandha
దర్శకత్వంబసు ఛటర్జీ
రచనబాసు ఛటర్జీ (సంభాషణలు)
స్క్రీన్ ప్లేబసు ఛటర్జీ
కథమనూ భండారీ
నిర్మాతసురేష్ జిందాల్,
కమల్ సైగల్
తారాగణంఅమోల్ పాలేకర్
విద్యా సిన్హా
దినేష్ ఠాకుర్
ఛాయాగ్రహణంకె. కె. మహాజన్
కూర్పుజి. జి. మాయేకర్
సంగీతంసలీల్ చౌదరీ
విడుదల తేదీ
1974
సినిమా నిడివి
110 నిమిషాలు.
దేశంభారత దేశం
భాషహిందీ

రజనీగంధ (ఆంగ్లం: Rajanigandha; హిందీ: रजनीगन्धा) బసు ఛటర్జీ దర్శకత్వం వహించిన 1974 నాటి హిందీ చలనచిత్రం. హిందీ కథారచయిత మను భండారి రాసిన యహీ సచ్ హై కథ ఆధారంగా చేసుకుని తీశారు.

ఇతివృత్తం

[మార్చు]

దీపా (విద్యా సిన్హా), సంజయ్ (అమోల్ పాలేకర్) ఢిల్లీలో చిరు ఉద్యోగులు. ఇద్దరూ ప్రేమించుకుంటూ, త్వరలో పెళ్ళి చేసుకుందామన్న ఆలోచనతో ఉంటారు. ఇంతలో దీపకు బొంబాయిలో ఉపన్యాసకురాలి ఉద్యోగానికి ఇంటర్వ్యూ వస్తుంది. ఆమెకు ఆ ఉద్యోగం వస్తే, తానూ బొంబాయి బదిలీ చేయించుకుని వివాహం చేసుకుని, అక్కడ స్థిరపడదామని సంజయ్ అంటాడు. దీపా బొంబాయి వెళ్ళినప్పుడు ఆమె డిగ్రీ చదివే రోజుల నాటి ప్రేమికుడు నవీన్ (దినేష్ ఠాకూర్) కలుస్తాడు. నవీన్ కళాశాల రాజకీయాల్లో దుందుడుకుగా తిరుగుతూండడంతో వారిద్దరూ అప్పట్లో విడిపోతారు. కానీ ఇన్నేళ్ళకు కనిపించడంతో దీపా ఆకర్షణలో పడి అతణ్ణే పెళ్ళి చేసుకుంటే ఎలావుంటుందని ఆలోచనలో పడుతుంది. ఢిల్లీకి తిరిగివచ్చాకా కూడా అదే ఆలోచనలో ఉండగా, సంజయ్ రజనీగంధ పూలు తీసుకుని, స్వచ్ఛమైన నవ్వుతో కలవగానే ఆకర్షణ, ఊగిసలాట వీగిపోతాయి. సంజయ్ సాదాసీదా రూపం, నిష్కపటమైన స్నేహం, నిర్మొహమాటం, అవ్యక్తమైన ప్రేమ వంటి గుణాలన్నీ తలచుకుని ఈ ప్రేమే వాస్తవం, మిగతాదంతా ఆకర్షణ అని అర్థమౌతుంది దీపకు.

సిబ్బంది

[మార్చు]

తారాగణం

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

పేరొందిన కథారచయిత మనూభండారి అనే రచయిత రాసిన యహీ సచ్ హై అన్న చిన్న కథ రజనీగంధ సినిమాకు ఆధారం. నిజానికి చిన్న కథే అయినా దాన్ని సినిమాకు తగ్గ విధంగా దృశ్యాలుగా విభజించి చిత్రానువాదం రాసి బాసూ చటర్జీ తెరకెక్కించారు.[1]

నటీనటుల ఎంపిక

[మార్చు]

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమోల్ పాలేకర్ తొలిచిత్రం ఇది. అప్పటికి బొంబాయి రంగస్థల నటుడు అమోల్ పాలేకర్ని బాసూ చటర్జీ తన తొలిచిత్రమైన పియా కా ఘర్లో నటించమని అడిగితే అంగీకరించలేదు. ఆపైన రజనీగంధలో నటించమని అడిగితే అంగీకరించారు. ఆపైన అమోల్ పాలేకర్ హిందీ సినిమాల్లో నటునిగా స్థిరపడ్డారు. విద్యా సిన్హా, దినేష్ ఠాకూర్ లకు కూడా ఇదే తొలి చిత్రం. ఐతే విద్యాసిన్హా ఒకట్రెండు సినిమాల్లో నటించి తెరమరుగు కాగా, దినేష్ ఠాకూర్ మరి ఏ ఇతర సినిమాల్లోనూ నటించలేకపోయాడు.[1]

చిత్రీకరణ

[మార్చు]

సినిమాకు సురేష్ జిందాల్ అన్న భారత జాతీయుడైన విదేశీ సంపన్నుడు నిర్మాత. ఐతే ఏవో అడ్డంకుల వల్ల సినిమా చాలా రోజుల పాటు పూర్తి కాలేదు. చిత్రీకరణలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కొనసాగింది. ఉదాహరణకు కహి బార్ యూ భి దేఖా హై పాట చిత్రీకరించే సమయానికి, ఆ పాట రికార్డింగ్ కాలేదు. వేరే దారి లేక పాట ఎలావుంటుందో, మీటర్ ఊహించుకుని దర్శకుడు చిత్రీకరింపజేసి ఎడిట్ చేసేశారు. ఆపైన చిత్రీకరించిన పాట చూపించగా దాన్ని బట్టి పాట తయారుచేశారు.[1]

ప్రాచుర్యం

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం విభాగం పురస్కార గ్రహీత Status
1974 ఉత్తమ నేపథ్య గాయకుడు ముకేష్ గెలుపు
1975 విమర్శకులు ఎంపిక చేసిన ఉత్తమ చిత్రం బాసు చటర్జీ గెలుపు
ఉత్తమచిత్రం సురేష్ జిందాల్ (దేవకీ చిత్ర పరంగా) గెలుపు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 మహమ్మద్, ఖదీర్ బాబు (2010). "పదహారేళ్ల ప్రాయపు అమాయక పరిమళం రజనీగంధ". బాలీవుడ్ క్లాసిక్స్ (1 ed.). హైదరాబాద్: కావలి ప్రచురణలు. pp. 62–64.
"https://te.wikipedia.org/w/index.php?title=రజనీగంధ&oldid=4203687" నుండి వెలికితీశారు