రజితమూర్తి చెట్టెభక్తుల
స్వరూపం
(రజితమూర్తి. సిహెచ్ నుండి దారిమార్పు చెందింది)
రజితమూర్తి చెట్టెభక్తుల | |
---|---|
జననం | ఏప్రిల్ 17, 1950 రావిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల, టీవీ, సినీ నటుడు |
రజితమూర్తి చెట్టెభక్తుల (జ. ఏప్రిల్ 17, 1950) రంగస్థల, టీవీ, సినీ నటుడు. 2002, 2011 లలో జరిగిన నంది నాటక పరిషత్తులలో ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డులు అందుకున్నాడు.[1][2]
జననం
[మార్చు]రజితమూర్తి 1950, ఏప్రిల్ 17న పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో జన్మించాడు.
విద్యాభ్యాసం - ఉద్యోగం
[మార్చు]ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పూర్తిచేసిన రజితమూర్తి, ఎక్సైజ్ ఇన్సిపెక్టర్ గా పనిచేసి, పదవి విరమణ చేశాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]1966లో రావికొండలరావు పట్టాలు తప్పిన బండి నాటకంతో నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. స్పస్టమైన ఉచ్చారణతో సంభాషణలు పలికే రజితమూర్తి దాదాపు అన్ని పరిషత్తుల నాటక ప్రదర్శనల్లో నటించి, ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ క్యారెక్టర్ నటుడు అవార్డులను అందుకున్నాడు.[3]
నటించినవి
[మార్చు]- నిషిద్ధాక్షరి
- మానస సరోవరం
- నీతిచంద్రిక
- కాదు సుమా కల
- పడమటి గాలి
- అంబేద్కర్ రాజగృహ ప్రవేశం
- ఆకాశదేవర[4][5]
- వానప్రస్థం
- హింసధ్వని
- యద్భవిష్యం
- శ్రీచక్రం
- శ్రీముఖ వ్యాఘ్రం
- ఎడారి కోయిల
- మాస్క్[6]
బహుమతులు
[మార్చు]- ఉత్తమ ప్రతి నాయకుడు - ఏడుగుడిసెల పల్లె (నాటకం), నంది నాటక పరిషత్తు - 2002.[7]
- ఉత్తమ ప్రతినాయకుడు - నష్టసరిహారం (నాటిక), నంది నాటక పరిషత్తు - 2011.
- ఉత్తమ ప్రతినాయకుడు - నష్టసరిహారం (నాటిక), పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2012.[8]
పురస్కరాలు
[మార్చు]- ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[9]
- గుర్రం జాషువా పురస్కారం (విశ్వశాంతి కళానికేతన్ నాటక పరిషత్తు, వినుకొండ)
- విశిష్ట నటుడు పురస్కారం (కళావాణి, రాజమండ్రి)
- స్వర్ణకంకణం (కాకతీయ కళాపరిషత్తు, నాగభైరువారి పాలెం)
- నట పురస్కారం (సౌజన్య కళామండలి, కడప)
- నట పురస్కారం (తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల ఐక్యవేదిక)
టీవీ రంగం
[మార్చు]- కుంకుమ రేఖ (ధారావాహిక)
మూలాలు
[మార్చు]- ↑ రజితమూర్తి. సిహెచ్, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.483
- ↑ ప్రజాశక్తి, జిల్లాలు (6 January 2019). "కళలతోనే అభ్యుదయం". Retrieved 17 April 2020.[permanent dead link]
- ↑ రజితమూర్తి. సిహెచ్, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.483
- ↑ ఆంధ్రభూమి, విశాఖపట్టణం (7 August 2017). "ఆకాశదేవర నాటక సమీక్ష (నాటక సమీక్ష)". www.andhrabhoomi.net. శ్రీమతి కోవిల. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "ప్రతి జిల్లాకు ఆడిటోరియం: రిటైర్డ్ ఐఏఎస్ బలరామయ్య". lit.andhrajyothy.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.
- ↑ జీవన్నాటకంలో మనిషి పాత్రను ఆవిష్కరించిన 'మాస్క్', విశాలాంధ్ర, కృష్ణాజిల్లా, 29 నవంబరు 2014, పుట. 10
- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.702
- ↑ పరిచూరి ఫలితాలు, అభినయ (మే 2012), హైదరాబాదు, పుట.27
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.