రమాబాయి రనడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమాబాయి రనడే
జననం(1862-01-25)1862 జనవరి 25
మరణం1924 జనవరి 25(1924-01-25) (వయసు 61) సేవా సదన్, పూనే
జాతీయతఇండియన్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మహిళల విద్య - స్వయంసమృద్ధి
జీవిత భాగస్వామిమహాదేవ గోవింద రనడే

రమాబాయి రనడే (జనవరి 25, 1863 - 1924) - 19వ శతాబ్దపు మొదటి మహిళా హక్కుల కార్యకర్త. అది భారతదేశంలోని మహిళలకు స్వేచ్ఛ, హక్కులు లేని సమయం. వారు ప్రధాన స్రవంతి కోసం ఎదురుచూస్తున్న సమాజం. ఆ సందర్భంలో రమాబాయి రనడే మహిళలను వారి సంకెళ్ల నుండి విముక్తి చేయడానికి కృషి చేశారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా.

ప్రారంభ జీవితం

[మార్చు]

రమాబాయి రనడే సాంగ్లీ జిల్లా, మహారాష్ట్రలోని దేవరాష్ట్రే అనే చిన్న గ్రామంలో నివసిస్తున్న కుర్లేకర్ కుటుంబంలో 25 జనవరి 1862 న జన్మించారు. ఆమె జన్మనామం యమునా కుర్లేకర్‌. 11 సంవత్సరాల వయస్సులో, ఆమె ప్రముఖ భారతీయ పండితుడు, సామాజిక సంస్కర్త అయిన జస్టిస్ మహాదేవ గోవింద రనడేను వివాహం చేసుకున్నారు.[1] అప్పటికి రమాబాయి నిరక్షరాస్యురాలు. కానీ ఆమె భర్త "ప్రిన్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్". ఫస్ట్ క్లాస్ ఆనర్స్‌తో బొంబాయి యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్. అతను బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ఇంగ్లీష్, ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేయడమే కాకుండా, ఓరియంటల్ ట్రాన్స్‌లేటర్‌గా, సంఘ సంస్కర్తగా కూడా పనిచేసాడు. అతను సమాజంలో నెలకొనిఉన్న అంటరానితనం, బాల్య వివాహం, సతీసహగమనం.. లాంటి సాంఘీక దూరాచారాలకు వ్యతిరేకంగా పనిచేశాడు.  అతను సర్వజానిక్ సభను చేపట్టాడు. సామాజిక అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. అతను తన ముప్పై ఏళ్ళ వయసులో మొత్తం మహారాష్ట్ర ప్రజల ప్రశంసలను అందుకున్నాడు. అతని అత్యున్నత ఆలోచన, చైతన్యవంతమైన దృష్టి, ఉద్వేగభరితమైన, నిబద్ధత కలిగిన సామాజిక నిబద్ధత రమాబాయికి బలమైన స్ఫూర్తినిచ్చాయి.

సామాజిక అసమానత యుగంలో, మహిళలు పాఠశాలకు వెళ్లడానికి, అక్షరాస్యులుగా మారడానికి అనుమతించబడలేదు. కానీ రమాబాయి రనడే వివాహం అయిన కొంతకాలానికే మహాదేవ గోవింద రనడే ప్రోత్సాహంతో చదవడం, రాయడం నేర్చుకోవడం ప్రారంభించారు. తన మాతృభాష మరాఠీతో మొదలుపెట్టి, ఇంగ్లీష్, బెంగాలీలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. రమాబాయి వార్తాపత్రికలు చదివి అతనితో కరెంట్ అఫైర్స్ గురించి చర్చించే స్థాయికి ఎదిగింది.[2] ఆమె అతనికి అంకితభావంతో ఉన్న శిష్యురాలు అయింది. నెమ్మదిగా అతని కార్యదర్శిగా మారింది.

తన భర్త స్ఫూర్తితో మహిళల్లో బహిరంగంగా మాట్లాడేందుకు ముంబైలో హిందూ లేడీస్ సోషల్ క్లబ్ ను ప్రారంభించింది. రమాబాయి రనడే పూణేలో సేవా సదన్ సొసైటీ వ్యవస్థాపకురాలు. దానికి అధ్యక్షురాలుగా వ్యవహరించారు. రమాబాయి రనడే తన జీవితాన్ని మహిళల జీవితాలను మెరుగుపరచడానికి అంకితం చేసింది.[3] రమాబాయి రణడే తన భర్త, ఇతర సహచరులతో కలిసి 1886లో పుణెలో బాలికల కోసం మొదటి ఉన్నత పాఠశాలను స్థాపించారు.

1882లో వితంతువు అయిన తర్వాత పండిత రమాబాయి పూణేకు వచ్చినప్పుడు, ఆమెకు రనడే దంపతులు సహాయం చేసారు. రనడే నివాసంలో ఒక క్రైస్తవ మిషనరీ మహిళ వచ్చి పండిత రమాబాయి, రమాబాయి రనడేలకు ఆంగ్ల భాషా పాఠాలు బోధించేది.[4]

మూలాలు

[మార్చు]
  1. "International Girl Child Day: All about Ramabai Ranade, Indian social reformer who paved way for women's education". DNA India (in ఇంగ్లీష్). 2020-10-11. Retrieved 2021-01-05.
  2. Kosambi, Meera (2000). Intersections : socio-cultural trends in Maharashtra. New Delhi: Orient Longman. p. 101. ISBN 9788125018780. Retrieved 9 January 2017.
  3. Sarkar, Sumit; Sarkar, Tanika (2008). Women and Social Reform in Modern India: A Reader – Sumit Sarkar, Tanika Sarkar – Google Books. ISBN 9780253352699. Retrieved 13 August 2012.
  4. Kosambi, Meera. “Indian Response to Christianity, Church and Colonialism: Case of Pandita Ramabai.” Economic and Political Weekly, vol. 27, no. 43/44, 1992, pp. WS61–WS71. JSTOR, www.jstor.org/stable/4399059. Accessed 9 Oct. 2020.