రవీంద్ర గైక్వాడ్
రవీంద్ర విశ్వనాథ్ గైక్వాడ్ (జననం 27 ఏప్రిల్ 1960) మహారాష్ట్ర రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉస్మానాబాద్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
వివాదాలు
[మార్చు]రవీంద్ర గైక్వాడ్ పైన అనేక నేరాభియోగాలు ఉన్నాయి. వాటిలో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, నేరపూరిత బెదిరింపులు, అల్లర్లకు పాల్పడటం వంటివి ఉన్నాయి. [2] [3]
2017 మార్చి 23న పూణే నుండి ఢిల్లీకి ప్రయాణిస్తూండగా, ఎయిర్ ఇండియా సిబ్బందిని 25 సార్లు తన షూతో కొట్టాడని, వారిని విమానం నుండి బయటకు తోసేయ్యడానికి ప్రయత్నించాడని ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య వల్ల అన్ని ఇండియన్ ఎయిర్‌లైన్ కంపెనీలు గైక్వాడ్ పై ప్రయాణ నిషేధం విధించాయి. ఒకరు తిడితే సహించడానికి తాను బిజెపి సభ్యుడిని కాదని అతడు పేర్కొన్నాడు. ఢిల్లీ పోలీసులు అతనిపై రెండు క్రిమినల్ అభియోగాలు నమోదు చేశారు. ఒకటి విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిని కొట్టినందుకు, మరొకటి విమానం నుండి దిగిపోకుండా దాన్ని ఆపినందుకు.[4] భారతదేశంలో విమానాల్లో ప్రయాణ నిషేధ జాబితాలో మొదటి వ్యక్తి అతడు.[5][6] పూణే నుండి ఎయిర్ ఇండియా విమానం నెంబరు AI852, 2017 మార్చి 23న ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ చేరుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.[7]
అంతకు ముందు, 2014 లో రంజాన్ ఉపవాస మాసంలో, ఉపవాసం ఉన్న ఒక వ్యక్తికి బలవంతంగా ఆహారం పెట్టడానికి ప్రయత్నించినందుకు అతను వివాదంలో చిక్కుకున్నాడు.[8][9]
మూలాలు
[మార్చు]- ↑ "ELECTION COMMISSION OF INDIA, GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". Archived from the original on 19 May 2014.
- ↑ "सिर्फ चप्पल ही नहीं चलाते शिवसेना के ये सांसद, दर्ज हैं कई मुकदमे– News18 Hindi". News18 India. Archived from the original on 2017-03-24. Retrieved 2017-03-24.
- ↑ "Shiv Sena MP with 8 criminal cases barred from flying". www.specttrumnews.com. Archived from the original on 2017-04-09. Retrieved 2017-04-08.

- ↑ Haidar, Faizan (29 March 2017). "Sena MP Gaikwad books yet another ticket to Delhi, Air India cancels it too". Hindustan Times. Retrieved 23 February 2021.
- ↑ "'Forced to travel economy class', Shiv Sena MP assaults Air India staffer". The News Minute. Retrieved 19 August 2021.