Jump to content

రాకేష్ శుక్లా

వికీపీడియా నుండి
Rakesh Shukla
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుLegbreak googly
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 121
చేసిన పరుగులు - 3798
బ్యాటింగు సగటు - 31.91
100లు/50లు -/- 6/17
అత్యధిక స్కోరు - 163*
వేసిన బంతులు 294 16846
వికెట్లు 2 295
బౌలింగు సగటు 76.00 24.53
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - 7
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - 1
అత్యుత్తమ బౌలింగు 2/82 7/83
క్యాచ్‌లు/స్టంపింగులు -/- 71/-
మూలం: [1]


1948, ఫిబ్రవరి 4న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో జన్మించిన రాకేష్ శుక్లా భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 121 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన ఇతను భారత క్రికెట్ జట్టు తరఫున 1982లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. హిట్టింగ్ బ్యాట్స్‌మెన్‌గానూ, లెగ్ బ్రేక్ గుగ్లీ బౌలర్‌గానూ ఇతను ప్రసిద్ధుడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

ఆడిన ఒకే ఒక టెస్టులో 76.00 సగటుతో 2 వికెట్లు పడగొట్టినాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 82 పరుగులకు 2 వికెట్లు. బ్యాటింగ్‌లో పరుగులేమీ చేయలేడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

శుక్లా 121 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటీలలో 24.53 సగటుతో 295 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 83 పరుగులకు 7 వికెట్లు. బ్యాటింగ్‌లో 31.91 సగటుతో 3788 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 163 నాటౌట్.[1]

మూలాలు

[మార్చు]