రాజరాజేశ్వరాలయం బూర్గుపల్లి
బూర్గుపల్లి రాజరాజేశ్వరాలయం తెలంగాణ రాష్ట్రంనిర్మల్ జిల్లా మామడ మండలం బూర్గుపల్లి శివారులో గుట్టల మధ్య ప్రకృతి ఒడిలో రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది.అతి పురాతన ఆలయం నిర్మల్ నుండి 8 కి.మీ.దూరంలో జాతీయ రహదారి ప్రక్కన ఉంది[1][2].
బూర్గుపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం | |
---|---|
పేరు | |
ఇతర పేర్లు: | బూర్గుపల్లి రాజరాజేశ్వర స్వామి |
ప్రధాన పేరు : | రాజరాజేశ్వర స్వామి ఆలయం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నిర్మల్,మామిడి మండలం |
ప్రదేశం: | బూర్గుపల్లి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివాలయం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 01 |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | ప్రాచీన శివా లయం |
సృష్టికర్త: | మధ్యయుగంలో నిర్మాణం |
ఆలయ నిర్మాణం
[మార్చు]బూర్గుపల్లి రాజ రాజేశ్వరాలయం అతి ప్రాచిన ఆలయం. అటవీ ప్రాంతంలో గుట్టల మధ్య ప్రకృతి ఒడిలో స్వామి వారి పురాతన గుడి ఉంది. గుడి నిర్మాణం, శిల్ప శైలులను, శాసనాలను బట్టి ఈ గుడిని మధ్యయుగంలో నిర్మించి నట్లు గ్రంథాల వల్ల తెలుస్తుంది.
మహా శివరాత్రి
[మార్చు]బూర్గుపల్లి శివాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు[3]. ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంది. భక్తులు ఆలయం సమీపంలో ఉన్న కోనేరు లో కాళ్ళు, చేతులు కడిగి స్వామి వారిని దర్శించు కుంటారు.ఈ కోనేరు కు గొప్ప చరిత్ర ఉంది. ఆలయ పూజారి సంతశర్మ పంతులచే పూజలు,అభిషేకాలు జరుగుతాయి.భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ రాత్రి జాగరణ లో పాల్గోని ఆధ్యాత్మిక భక్తి గీతాలు ఆలపిస్తూ భగవన్నామస్మరణ చేస్తారు. సుదుర ప్రాంతం నుండి వచ్చే భక్తుల సౌకర్యానిమితం ఆలయ ఆవరణంలో ధర్మశాలలు వంట రుములు, స్నానపు గదులు,సౌఛాలయాలు ఉన్నాయి.
పండుగ సందర్భంగా ఆలయ ఆవరణంలో జాతర ఘనంగా జరుగుతుంది. నిర్మల్ ,ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి భక్తులు వచ్చి స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోని మొక్కులు తీర్చుకుంటారు. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతారు. అటవీ ప్రాంతం కావడంతో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది.ఆర్టిసి డిపో నిర్మల్ వారిచే పండుగ సందర్భంగా బస్సులు నడుపుతారు.
ఎలా చేరుకోవచ్చు
[మార్చు]ఈ ఆలయాన్ని మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి వచ్చే భక్తులునిర్మల్ చేరుకోవాలి. మామడ నుండి బైక్ లో గాని, ప్రైయివేటు వాహనంలో గాని లేదా ఆటోలలో కూడా చేరుకో వచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ "చరిత్రాత్మకం.. నిర్మల్ | basara saraswathi temple in nirmal district | Sakshi". cms.sakshi.com. Retrieved 2024-10-11.
- ↑ telugu, NT News (2022-12-17). "ఆలయాలకు పునర్వైభవం". www.ntnews.com. Retrieved 2024-10-12.
- ↑ ABN (2023-02-19). "భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి". Andhrajyothy Telugu News. Retrieved 2024-10-12.