రాజా దాహిర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజా దాహిర్ సేన్ (సా.శ. 663 - 712) సింధు ప్రాంతాన్ని పరిపాలించిన చిట్టచివరి హిందూ రాజు.ఈ ప్రాంతం ప్రస్తుత పాకిస్థాన్ లో ఉంది. సా.శ. 711 లో, అతని రాజ్యాన్ని అరబ్ జనరల్ ముహమ్మద్ బిన్ ఖాసిమ్ నేతృత్వంలోని ఉమయ్యద్ కాలిఫేట్ స్వాధీనం చేసుకుంది. ఆధునిక నవాబ్‌షా సమీపంలో సింధు నది ఒడ్డున జరిగిన అరోర్ యుద్ధంలో అతను మరణించాడు. అతని వంశీకులు ఇప్పుడు దహ్రీ పేరుతో కరాచీలో నివసిస్తున్నారు.

చాచ్‌నామాలో పాలన గురించి

[మార్చు]

చాచ్‌నామా సింధ్ ప్రాంతాన్ని అరబ్బులు ఆక్రమించిన వృత్తాంతాన్ని వివరించే అత్యంత పురాతన కథనాలు. దీనిని అరబ్ ముహమ్మద్ అలీ బిన్ హమీద్ బిన్ అబూబకర్ కుఫీ సా.శ. 1216 లో పర్షియన్ భాషలోకి అనువదించాడు [1] దీని ఒరిజినల్ అరబిక్ గ్రంథాన్ని తకాఫీ కుటుంబం (ముఖ్తార్ అల్-తకాఫీ బంధువులు) రాసినట్లు భావిస్తున్నారు.

దాహిర్ రాజ్యాన్ని కన్నౌజ్ రాజు రామాల్ ఆక్రమించుకున్నాడు [2]

ఉమయ్యద్‌లతో యుద్ధం

[మార్చు]

"నేను అరబ్బులను యుద్ధ క్షేత్రం లోనే కలుస్తాను. నా శాయశక్తుల వారితో యుద్ధం చేస్తాను. నేను వాళ్ళను ఓడిస్తే నా రాజ్యం బలోపేత మౌతుంది. నేను వీరస్వరగం పొందితే, నా చరిత్ర అరేబియా, భారతదేశ పుస్తకాల్లో లిఖిస్తారు. గొప్పవాళ్ళు నా గురించి మాట్లాడుతారు. అది ప్రపంచం లోని ఇతర రాజులు వింటారు. రాజా దాహిర్ తన రాజ్యం కోసం శత్రువుతో పోరులో తన విలువైన ప్రణాలను పణంగా ఒడ్డాడు అని చెప్పుకుంటారు"

బస్రా గవర్నరు అల్ హజ్జజ్ ఇబ్న్ యూసుఫ్, రాజా దాహిర్‌పై దండెత్తడానికి ప్రాథమిక కారణం, సేరేండిబ్ (ఆధునిక శ్రీ లంక) రాజు, ఖలీఫాకు పంపిస్తున్న బహుమతులను దేబల్ తీరం వద్ద సముద్రపు దొంగలు కొల్లగొట్టడమని చాచ్‌నామాలో రాసారు.[3] బవారిజ్ అని కూడా పిలువబడే మేడ్‌లు (సింధ్‌లో నివసిస్తున్న సిథియన్ల తెగ) గతంలో సస్సానిడ్ షిప్పింగ్‌పై, టైగ్రిస్ నది ముఖద్వారం నుండి శ్రీలంక తీరం వరకు, దోపిడీలు చేసేవారు. ఇప్పుడు అరబ్ నౌకలను కూడా వారి స్థావరాలైన కచ్, దేబల్, కథియవార్ ల వద్ద దోచుకోగలుగుతున్నారు.

సా.శ.[permanent dead link] 700 లో రాజా అధీనంలో ఉన్న సింధ్. ఉమయ్యద్ కాలిఫేట్ భారత ఉపఖండంలోని పశ్చిమ సరిహద్దులో అభివృద్ధి చెందుతున్నట్లు చూడవచ్చు.

హజాజ్ తదుపరి దండయాత్ర ముహమ్మద్ బిన్ ఖాసిం ఆధ్వర్యంలో ప్రారంభించారు. 711 లో బిన్ ఖాసిమ్ డెబల్ వద్ద దాడి చేశాడు. అల్-హజ్జ్ ఆదేశాల మేరకు మునుపటి విఫలమైన దాడిలో పట్టుబడ్డ బందీలను, ఖైదీలను విడిపించాడు. ఇది కాకుండా, సాధారణంగా ఫిరాయింపుదారుల నుండి, ఓడిపోయిన ప్రభువుల నుండి మద్దతు పొందడం, సహకరించడం వారి విధానంగా ఉంది. డెబల్ నుండి బిన్ ఖాసిమ్ సరఫరాల కోసం నెరున్‌కు వెళ్ళాడు. ఆ నగరపు బౌద్ధ గవర్నరు దీనిని మొదటి దండయాత్ర లోనే తాము కాలిఫేట్‌కు సామంతులుగా ఒప్పుకుని ఉన్నాడు. ఈ రెండవదాడికి లొంగిపోయాడు. ఖాసిం సైన్యాలు సివిస్తాన్ (సెహ్వాన్) ను పట్టుకుని, అనేక మంది గిరిజన ముఖ్యుల విధేయత పొందాడు. పరిసర ప్రాంతాలను స్వాధీనపరచుకున్నాడు. అతని సంయుక్త దళాలు సిసాం వద్ద ఉన్న కోటను స్వాధీనం చేసుకుని సింధు నదికి పశ్చిమాన ఉన్న ప్రాంతాన్ని దక్కించుకున్నాయి.

స్థానిక గిరిజనులైన మెడ్స్, నెరున్ యొక్క బౌద్ధ పాలకులు, బజ్రా, కాకా కోలాక్, సివిస్తాన్ ల కాల్బలాన్ని తన అశ్విక దళానికి మద్దతుగా తీసుకుని ముహమ్మద్ బిన్ ఖాసిమ్, దాహిర్‌ను ఓడించి, అతడి రాజ్యం లోని తూర్పు భూభాగాలను ఉమయ్యద్ కాలిఫేట్ లో కలిపేసుకున్నాడు.[4]

చివరి యుద్ధానికి కొంతకాలం ముందు, దాహిర్ యొక్క మంత్రి, భారతదేశపు మిత్ర రాజులలో ఎవరినైనా ఆశ్రయించాలని దాహిర్‌కు సూచించాడు. "మీరు వారితో, 'నేను మీకూ అరబ్ సైన్యానికీ మధ్య గోడ లంటి వాణ్ణి. నేను పడిపోతే, వారి చేతిలో మీ విధ్వంసాన్ని ఏదీ ఆపదు.' అని చెప్పండి" అన్నాడు. ఒకవేళ ఈ సూచన దాహిర్‌కు ఆమోదయోగ్యం కాకపోతే, అతను కనీసం తన కుటుంబాన్ని భారతదేశంలోని ఏదో ఒక సురక్షిత ప్రాంతానికి పంపించమని కూడా మంత్రి అతడికి చెప్పాడు. దాహిర్ ఆ రెండు సూచనలనూ తిరస్కరించాడు. "నా ఠాకూర్లు, అనుయాయుల కుటుంబాలు ఇక్కడే ఉండగా నేను నా కుటుంబ భద్రత కోసం ఇక్కడి నుంచి పంపించలేను." అని అన్నాడు [4]

దాహిర్ అప్పుడు కాసిమ్‌ను సింధు నదిని దాటకుండా నిరోధించడానికి ప్రయత్నించాడు. తన బలగాలను దాని తూర్పు ఒడ్డుకు తరలించాడు. అయితే, చివరికి కాసిమ్, జితోర్ వద్ద నదిని దాటి జైసియా (దాహిర్ కుమారుడు) నేతృత్వంలోని బలగాలను ఓడించాడు. ఖాసిమ్ 671 లో రౌర్ (ఆధునిక నవాబ్‌షా సమీపంలో) వద్ద దాహిర్‌తో పోరాడి అతడిని చంపాడు. సింధు నది ఒడ్డున జరిగిన అరోర్ యుద్ధంలో దాహిర్ మరణించాక, అతని తలను నరికి హజ్జాజ్ బిన్ యూసుఫ్‌కు పంపించాడు

చాచ్‌నామాకు చెందిన ముగ్గురు మహిళలు

[మార్చు]

చ్‌నామాకు చెందిన ముగ్గురు మహిళలు, దాహిర్ భార్య అయిన రాణి లాడీ కి, అతడి కుమార్తెలు సూరియా, ప్రీమాల్ లకు సింధీ సాంస్కృతిక జ్ఞాపకాల్లోను అలాగే విస్తృత భారతీయ చరిత్రలోనూ సమానమైన స్థానం ఉంది. సామ్రాజ్య దురాక్రమణదారులకు వ్యతిరేకంగా ఉత్తేజపరచేందుకూ, సింధ్ జాతీయతను వివరించడానికీ ఈ కథలను పారాయణం చేస్తారు. గర్వించదగిన, పురాతన సింధీ సంస్కృతి యొక్క సాహసోపేతమైన వ్యక్తిత్వంగా ఈ స్త్రీలను చూస్తారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Common Era year is an approximation of the Islamic calendar date 613 AH.
  2. Sajid Ali (September 23, 2015). "Who was Raja Dahir". Sindhi Dunya. Archived from the original on 2019-02-03. Retrieved November 19, 2017.
  3. Mirza Kalichbeg Fredunbeg: The Chachnamah, An Ancient History of Sind, Giving the Hindu period down to the Arab Conquest. Commissioners Press 1900, Section 18: "It is related that the king of Sarandeb* sent some curiosities and presents from the island of pearls, in a small fleet of boats by sea, for Hajjáj. He also sent some beautiful pearls and valuable jewels, as well as some Abyssinian male and female slaves, some pretty presents, and unparalleled rarities to the capital of the Khalífah. A number of Mussalman women also went with them with the object of visiting the Kaabah, and seeing the capital city of the Khalífahs. When they arrived in the province of Kázrún, the boat was overtaken by a storm, and drifting from the right way, floated to the coast of Debal. Here a band of robbers, of the tribe of Nagámrah, who were residents of Debal, seized all the eight boats, took possession of the rich silken clothes they contained, captured the men and women, and carried away all the valuable property and jewels."
  4. 4.0 4.1 4.2 Manan Ahmed Asif (19 September 2016). A Book of Conquest. Harvard University Press. pp. 8-. ISBN 978-0-674-66011-3.