రాజా వెంకటప్ప నాయక్
Jump to navigation
Jump to search
రాజా వెంకటప్ప నాయక్ | |||
| |||
కర్ణాటక స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
| |||
పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1 – 2024 ఫిబ్రవరి 25 | |||
పదవీ కాలం 2023 – 2024 ఫిబ్రవరి 25 | |||
ముందు | నరసింహ నాయక్ | ||
---|---|---|---|
తరువాత | రాజా వేణుగోపాల్ నాయక్ | ||
నియోజకవర్గం | షోరాపూర్ | ||
పదవీ కాలం 2013 – 2018 | |||
ముందు | నరసింహ నాయక్ | ||
తరువాత | నరసింహ నాయక్ | ||
పదవీ కాలం 1994 – 2004 | |||
ముందు | రాజా మదన్ గోపాల్ నాయక్ | ||
తరువాత | నరసింహ నాయక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రాజా కుమార్ నాయక్ | ||
జీవిత భాగస్వామి | రాణి లతా కుమారి నాయక్ | ||
సంతానం | ఇద్దరు కుమారులు (రాజా వేణుగోపాల్ నాయక్, రాజా సంతోష్ నాయక్) |
రాజా వెంకటప్ప నాయక్ (1960- 25 ఫిబ్రవరి 2024) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన షోరాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కర్ణాటక శాసనసభకు నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాజా వెంకటప్ప నాయక్ తన తండ్రి రాజా కుమార్ నాయక్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 1994 శాసనసభ ఎన్నికలలో షోరాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత 1999, 2013, 2023 శాసనసభ ఎన్నికలలో శాసనసభ సభ్యుడిగా ఎన్నికై, 2024 ఫిబ్రవరి 1న కర్ణాటక స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
మరణం
[మార్చు]రాజా వెంకటప్ప నాయక్ బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో 2024 ఫిబ్రవరి 25న గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య రాణి లతా కుమారి నాయక్, ఇద్దరు కుమారులు రాజా వేణుగోపాల్ నాయక్, రాజా సంతోష్ నాయక్ ఉన్నారు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (29 March 2023). "Raja Venkatappa Nayak, Sharanabasappa Darshanapur contesting Assembly elections for the seventh time" (in Indian English). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
- ↑ The Hindu (25 February 2024). "Surpur MLA Raja Venkatappa Naik passes away" (in Indian English). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
- ↑ Deccan Herald (26 February 2024). "Senior Cong MLA Raja Venkatappa Naik dies at 64" (in ఇంగ్లీష్). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.