రాజ్‌వీర్ దిలేర్
| రాజ్‌వీర్ దిలేర్ | |||
| పదవీ కాలం 2019 – 24 April 2024 | |||
| ముందు | రాజేష్ దివాకర్ | ||
|---|---|---|---|
| తరువాత | అనూప్ ప్రధాన్ | ||
| నియోజకవర్గం | హత్రాస్ | ||
జిల్లా పంచాయతీ సభ్యుడు
| |||
| పదవీ కాలం 2000 – 2005 | |||
| నియోజకవర్గం | అలీఘర్ | ||
| పదవీ కాలం 2017 – 2019 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1958 మే 1 దేవరౌ, అలీఘర్ , ఉత్తరప్రదేశ్ , భారతదేశం | ||
| మరణం | 2024 April 24 (వయసు: 65) హత్రాస్ , ఉత్తర ప్రదేశ్, | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | కిషన్ లాల్ దిలేర్, శాంతి దేవి | ||
| జీవిత భాగస్వామి | రజనీ దిలేర్ (m. 1975) | ||
| సంతానం | 4 (1 కొడుకులు & 3 కూతురు) | ||
రాజ్‌వీర్ దిలేర్ (1 మే 1958 - 24 ఏప్రిల్ 2024) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హత్రాస్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రాజ్‌వీర్ సింగ్ దిలేర్ తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2017లో ఇగ్లాస్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2019 లోక్‌సభ ఎన్నికలలో హత్రాస్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఆపాటి చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రామ్ జీ లాల్ సుమన్ పై 2,60,208 ఓట్ల మెజారితో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయనకు 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టిక్కెట్‌ను నిరాకరించింది.
మరణం
[మార్చు]రాజ్‌వీర్ సింగ్ దిలేర్ అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతకు గురై యూపీలోని అలీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ 2024 ఏప్రిల్ 24న మరణించాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (24 April 2024). "BJP's Hathras MP Rajveer Diler dies of heart attack" (in Indian English). Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ NDTV (24 April 2024). "BJP MP From Hathras Rajvir Diler, 65, Dies After Prolonged Illness". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ "BJP Hathras MP Rajvir Singh Diler Dies of Heart Attack at UP's Aligarh Hospital" (in Indian English). Republic World. 24 April 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
,