Jump to content

రాజ్‌వీర్ సింగ్

వికీపీడియా నుండి
రాజ్‌వీర్ సింగ్

పదవీ కాలం
2014 మే 16 – 2024 జూన్ 4
ముందు కల్యాణ్ సింగ్
తరువాత దేవేష్ శక్య
నియోజకవర్గం ఎటాహ్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-03-15) 1959 మార్చి 15 (age 66)
అలీఘర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
ప్రేమలతా వర్మ
(m. 1988)
సంతానం సందీప్ సింగ్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజ్‌వీర్ సింగ్ (జననం 15 మార్చి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎటాహ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజ్‌వీర్ సింగ్ తన తండ్రి కల్యాణ్ సింగ్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2002 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో దేబాయి శాసనసభ నియోజకవర్గం నుండి రాష్ట్రీయ క్రాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎటాహ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజ్‌వీర్ సింగ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎటాహ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి దేవేష్ శక్య చేతిలో 28052 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (14 March 2024). "Will BJP's Rajveer Singh Secure A Hat-Trick From Etah Lok Sabha Seat?" (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
  2. Amar Ujala (24 May 2019). "कल्याण सिंह के पुत्र ने विधायक पत्नी के साथ लिया जीत का प्रमाण पत्र, दोहराया जीत का इतिहास". Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
  3. The Economic Times (20 April 2019). "Lok Sabha Polls 2019: Kalyan Singh's son Rajveer banks on Modi magic". Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
  4. "2024 Loksabha Elections Results - Etah" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
  5. "Etah Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 November 2024. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.