Jump to content

రాజ్ బహదూర్ సింగ్

వికీపీడియా నుండి
రాజ్ బహదూర్ సింగ్

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు లక్ష్మీ నారాయణ్ యాదవ్
తరువాత లతా వాంఖడే
నియోజకవర్గం సాగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-12-29) 1967 డిసెంబరు 29 (వయసు 56)
రిచావర్, మధ్యప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు అనురుధ్ ప్రతాప్ సింగ్, గీతా బాయి
జీవిత భాగస్వామి రోష్నీ సింగ్
సంతానం 2 కొడుకులు
నివాసం H.No. 46, బృందావన్ వార్డ్ నం.044, గోపాల్‌గంజ్, సాగర్ , మధ్యప్రదేశ్
పూర్వ విద్యార్థి B.Sc., MA (చరిత్ర)
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజ్ బహదూర్ సింగ్ (జననం 29 డిసెంబర్ 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సాగర్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజ్ బహదూర్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994 నుండి 1999 వరకు సాగర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2000 నుండి 2003 వరకు బీజేపీ యువజన విభాగం సాగర్ జిల్లా అధ్యక్షుడిగా, 2004లో సాగర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా తిరిగి ఎన్నికై 2019 వరకు కౌన్సిలర్‌గా పని చేయగా, ఈ కాలంలో ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో 2009 నుండి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా, 2014 నుండి 2019 వరకు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పని చేశాడు.

రాజ్ బహదూర్ సింగ్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సాగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రభు సింగ్ ఠాకూర్‌పై 3,05,542 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Sagar Lok Sabha Election Result 2019 LIVE updates: Rajbahadur Singh of BJP wins". 23 May 2019. Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.