రాధా సలూజా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చదువుకుంది.[2] ఎంజి రామచంద్రన్ పక్కన ఇంద్రు పోల్ ఎండ్రుమ్ వాఙ్గా,ఇదయక్కని వంటి సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది. ఈ రెండు సినిమాలు తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. 1972లో హర్ జీత్, 1973లో ఏక్ ముత్తి ఆస్మాన్ (1973) వంటి హిందీ సినిమాలలోనూ, 1975లో మోర్ని వంటి పంజాబీ సినిమాలో నటించి గుర్తింపు పొందింది.[3]
రాధా సలూజా సుప్రసిద్ధ సినిమా ఎడిటర్ రేణు సలూజా అక్క.[4] రాధా సలూజా కొంతకాలం సినిమాల్లో పనిచేసిన తర్వాత లాస్ ఏంజిల్స్‌కు వెళ్ళింది, అక్కడ రేడియో ప్రోగ్రాం హోస్ట్ షమీమ్ జైదీని వివాహం చేసుకుంది. యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నప్పుడు, లాస్ ఏంజిల్స్ కోర్టులో ఆసియా భాషలకు ప్రత్యేక వ్యాఖ్యాతగా పనిచేస్తున్న ఫెడరల్ లా సర్వీసెస్‌లో ఉద్యోగంలో చేరింది.[5]