రానా నాయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రానా నాయర్ (జననం 1957) పంజాబీ కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తాడు.[1] అతను నలభైకి పైగా కవితా సంపుటాలు, అనువాద రచనలు చేసాడు. అతను థియేటర్ ఆర్టిస్ట్ కూడా. అనేక ప్రధాన పూర్తి-నిడివి నిర్మాణాలలో పాల్గొన్నాడు.[2] అతను సెయింట్ బాబా ఫరీద్ యొక్క పంజాబీ భక్తి కవిత్వానికి చేసిన ఆంగ్ల అనువాదానికి గాను సాహిత్య అకాడమీ గోల్డెన్ జూబ్లీ బహుమతిని అందుకున్నాడు.

జీవితం, సాహిత్య కృషి[మార్చు]

రాణా నాయర్ 1980 నుండి 1990 వరకు సిమ్లాలోని సెయింట్ బేడే కళాశాలలో ఆంగ్ల సాహిత్యాన్ని బోధించారు. 1990లో అతను పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్లో చేరారు, అక్కడ అతను ఇంగ్లీష్, కల్చరల్ స్టడీస్ విభాగంలో ప్రొఫెసర్, హెడ్ అయ్యాడు.[3] అతను పీటర్ వాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశాడు.[4]

రాణా నాయర్ పంజాబీ సాహిత్యం నుండి అనేక క్లాసిక్‌ల ఆంగ్ల అనువాదంలో మార్గదర్శకుడు. అతను అనువదించిన ప్రముఖ పంజాబీ రచయితలలో గుర్డియాల్ సింగ్ వంటి సాహిత్య దిగ్గజాలు ఉన్నారు,[5] రఘుబీర్ దండ్, మోహన్ భండారి, బీబా బల్వంత్ ఇతర వ్యక్తులు. అతను గుర్డియాల్ యొక్క రెండు నవలలు, "నైట్ ఆఫ్ ది హాఫ్-మూన్", "పర్సా" లను అనువదించాడు. అతను గుర్డియల్ ద్వారా 14 చిన్న కథలను Ëarthy Tones" పేరుతో అనువదించాడు.[6]

అతను పంజాబ్ నుండి అమృతా ప్రీతమ్, అజిత్ కౌర్, దలీప్ కౌర్ తివానా వంటి మహిళా రచయితల రచనలను, గుర్దియల్ సింగ్ రాసిన నవలలు, చిన్న కథలనూ అనువదించాడు. అతని మొదటి కవితా సంకలనానికి (తానే స్వరపరచినది) బ్రీతింగ్ స్పేసెస్ అనే పేరు పెట్టాడు. ఇది భారతీయ సాహిత్య సర్కిల్‌లో విమర్శనాత్మక సమీక్షలను, ప్రశంసలనూ పొందింది.

పురస్కారాలు, గుర్తింపు[మార్చు]

రానా నాయర్ చార్లెస్ వాలెస్ (ఇండియా) ట్రస్ట్ అవార్డు గ్రహీత. బ్రిటిష్ కౌన్సిల్ నుండి అనువాదానికి ప్రశంసా పురస్కారాలను గెలుచుకున్నారు. 2007లో అతను సాహిత్య అకాడమీ వారి భారతీయ సాహిత్య స్వర్ణోత్సవ సాహిత్య అనువాద బహుమతిని గెలుచుకున్నాడు. రానా నాయర్ ప్రతిష్టాత్మకమైన లేక్‌వ్యూ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ & ఆర్ట్స్ ఎడిటోరియల్ బోర్డులో కూడా ఉన్నారు.[7]

గ్రంథ పట్టిక[మార్చు]

  • నైట్ ఆఫ్ ది హాఫ్ మూన్, (1996), మాక్‌మిలన్ పబ్లిషర్స్
  • పర్సా (2000), నేషనల్ బుక్ ట్రస్ట్
  • అర్త్లీ టోన్స్ (2002), ఫిక్షన్ హౌస్
  • ది ఐ ఆఫ్ ఎ డో అండ్ అదర్ స్టోరీస్ (2003), సాహిత్య అకాడమీ
  • మెల్టింగ్ మూమెంట్స్ (2004), యూనిస్టార్
  • టేల్ ఆఫ్ ఎ కర్స్డ్ ట్రీ (2004), రవి సాహిత్య ప్రకాశన్
  • ది సర్వైవర్స్ (2005), కథ
  • స్లైస్ ఆఫ్ లైఫ్ (2005), యూనిస్టార్
  • శివోహం (2007), రూపా పబ్లికేషన్స్, ISBN 978-81-207241-4-3
  • గుర్దియల్ సింగ్ - ఎ రీడర్ (2012), సాహిత్య అకాడమీ, ISBN 978-81-260339-7-3
  • ఆల్మ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఎ బ్లైండ్ హార్స్, రూపా పబ్లికేషన్స్, ISBN 978-81-291373-1-9

ఇవి కూడా చూడండి[మార్చు]

ప్రస్తావనలు[మార్చు]