రామకృష్ణ కుస్మారియా
రామకృష్ణ కుస్మారియా | |||
రైతుల సంక్షేమ, వ్యవసాయ అభివృద్ధి శాఖ మంత్రి
మధ్యప్రదేశ్ ప్రభుత్వం | |||
పదవీ కాలం 20 డిసెంబర్ 2008 – 9 డిసెంబర్ 2013 | |||
ముందు | గోపాల్ భార్గవ | ||
---|---|---|---|
తరువాత | గౌరీశంకర్ బిసెన్ | ||
నియోజకవర్గం | పఠారియా | ||
పదవీ కాలం 1991-2004 | |||
నియోజకవర్గం | దామోహ్ | ||
పదవీ కాలం 2004-2008 | |||
నియోజకవర్గం | ఖజురహో | ||
పదవీ కాలం 1977 – 1980 | |||
నియోజకవర్గం | హట్టా | ||
పదవీ కాలం 1985 – 1990 | |||
నియోజకవర్గం | హట్టా | ||
పదవీ కాలం 1990 – 1991 | |||
నియోజకవర్గం | హట్టా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సకోర్, సెంట్రల్ ప్రావిన్సులు & బెరార్ , బ్రిటిష్ ఇండియా | 1942 జూలై 30||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఐఎన్‌సీ | ||
తల్లిదండ్రులు | కన్హయ్యలాల్ కుస్మారియా | ||
నివాసం | దామోహ్ | ||
మూలం | [1] |
రామకృష్ణ కుస్మారియా (జననం 30 జూలై 1942) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు మధ్యప్రదేశ్ శాసనభకు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]రామకృష్ణ కుస్మారియా 1977లో జనతా పార్టీ అభ్యర్థిగా హట్టా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1985లో బీజేపీ అభ్యర్థిగా రెండోసారి ఎమ్మెల్యేగా ఆ తర్వాత 1990లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రామకృష్ణ కుస్మారియా 1991 నుండి 2008 వరకు దామోహ్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు, ఖజురహో నియోజకవర్గం నుండి ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 19 డిసెంబర్ 2008న లోక్‍సభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2008లో ఎమ్మెల్యేగా ఎన్నికై మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో రైతు సంక్షేమ, వ్యవసాయ అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2016 నుండి 2019 వరకు బుందేల్‌ఖండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. రామకృష్ణ కుస్మారియా 2018 శాసనసభ ఎన్నికలలో దామోహ్, పఠారియా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు.
రామకృష్ణ కుస్మారియా 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీని వీడి కమల్‌నాథ్, రాహుల్ గాంధీ సమక్షంలో భోపాల్‌లో కాంగ్రెస్‌లో చేరాడు. అయితే ఆయన ఎక్కువ కాలం కాంగ్రెస్‌లో ఉండలేకపోయాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నుండి బీజేపీ పార్టీకి అధికారంలోకి రావడంతో ఆయన తిరిగి బిజెపి పార్టీలో చేరగా ఆయనను 2023లో కేబినెట్ మంత్రి హోదాలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "BJP doesn't practise what it preaches: MP Minister Ramkrishna Kusmaria". 16 February 2019. Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ Zee News (16 October 2023). "MP Election: बुंदेलखंड में फिर न हो बाबा की बगावत, BJP का बड़ा दांव, 6 का आदेश 15 को वायरल". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ "One party wins eight consecutive elections | Central India's Premier English Daily". 17 March 2024. Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.