రామగులాం చౌదరి
స్వరూపం
రామగులాంచౌదరి (1902 -1969) ఒక భారతీయ రాజకీయవేత్త. అతను బీహార్ రాష్ట్రంలో జన్మించాడు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. మహాత్మా గాంధీచే ప్రశంసలు అందుకున్నాడు.స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు అతను అనేక సార్లు కారాగారానికి వెళ్లాడు. అఖిల భారత అణగారిన తరగతుల సమాఖ్య వైస్ ప్రెసిడెంటుగా అతను చారిత్రాత్మక సిమ్లా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. అణగారిన తరగతుల కోసం మూడవ రాష్ట్రాన్నిసృష్టించే ఆలోచనను తిరస్కరించాడు. ఇది దేశాన్నిరెండు భాగాలుగా కాకుండా మూడు భాగాలుగా విభజించటానికి సహాయపడింది అని ఎలుగెత్తి చాటాడు. 1957లో అతను బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[1] అతను ముజఫర్‌పూర్‌లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Bihar Assembly Election results" (PDF). Election Commission of India.