సిమ్లా సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిమ్లా సమావేశం 1945 లో బ్రిటిష్ వైస్రాయ్ కి, అప్పటి ప్రముఖ రాజకీయనాయకులకు మధ్య సిమ్లాలో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశం. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ వేవెల్ భారత దేశ స్వపరిపాలనకు రూపొందించిన ప్రణాళికను ఆమోదించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 21 మంది భారత రాజకీయ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, ముస్లిం లీగ్ అధ్యక్షుడు ముహమ్మద్ అలీ జిన్నా, అఖిల భారత అణగారిన తరగతుల సమాఖ్య వైస్ ప్రెసిడెంటుగా రామగులాం చౌదరి , సిమ్లా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సమావేశానికి హాజరైన వారిలో ముఖ్యులు.[1] ఈ సమావేశంలో కాంగ్రెస్ అవిభక్త భారతదేశం కోసం కోరగా, ముస్లిం లీగ్ దేశ విభజనకు పట్టు బట్టారు. భారతీయ ముస్లింలందరి తరపున ఒకే ప్రతినిధిగా లీగ్ నిర్ణయించిన వారిని మాత్రమే పరిగణించాలనీ, లీగ్ లో సభ్యులు కానివారిని రాజప్రతినిధులుగా అంగీకరించరాదని జిన్నా పట్టుబట్టాడు. కానీ కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ సమావేశం విఫలమైంది.

అమేరీ - వేవెల్ ప్రణాళిక

[మార్చు]

భారత వ్యవహారాల మంత్రి అమేరీ, వైస్రాయ్ గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ తో చర్చించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. అందులో ముఖ్యమైనవి భారతదేశంలోని ప్రధాన మతాలకు సమాన ప్రాతినిధ్యం ఉండేలా వైస్రాయ్ కార్యనిర్వహణ మండలిని విస్తరించడం. భారతదేశంలో నివసిస్తున్న ఆంగ్లేయుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఒక హైకమీషనర్ ని నియమించడం. కార్యనిర్వహణ మండలిలో విదేశీ వ్యవహారాలను, ముఖ్య సైనికాధికారి పదవిని భారతీయులకు అప్పగించడం.

14 మంది సభ్యులు గల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో వేవెల్ ముస్లింలకు 6 సీట్లు కేటాయించారు. కానీ అప్పటి భారత జనాభాలో ముస్లిం జనాభా కేవలం 25 శాతం మాత్రమే. ఇది న్యాయంగా తోచకపోవడంతో కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదు. అటు ముస్లిం లీగ్ కూడా వెనక్కి తగ్గలేదు. దాంతో వేవెల్ తన ప్రణాళికను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

మూలాలు

[మార్చు]
  1. "India: Simla Conference 1945". Time. 9 July 1945. Archived from the original on 26 ఆగస్టు 2013. Retrieved 18 ఆగస్టు 2018.