Jump to content

రామచంద్రపాలెం (గారపాడు)

వికీపీడియా నుండి
రామచంద్రపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదకాకాని
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

రామచంద్రపాలెం (గారపాడు) గుంటూరు జిల్లా పెదకాకాని మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. గుంటూరుకు 5 కి.మీ. దూరంలో 5వ నెంబరు జాతీయ రహదారి (NH-5)లో ఈ కుగ్రామం ఉంది.

  • అక్షాంశరేఖాంశాలు: 16°17'11.73"N, 80°29'41.55"E
  • టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామపు ప్రస్తుత జనాభా షుమారు 400. ఈ గ్రామములో అందరు వ్యవసాయము మీదె ఆధారపడి జీవించుచున్నారు. కాని ప్రసిద్ధి గాంచిన వైద్యులు కొంత మంది ఈ ఊరికి చెందిన వారె. కాని ఊరు అంతగా అభివృద్ధి చెందలేదని చెప్పవచ్చును. ఒకప్పుడు ఊరిలో అన్ని పండగలు ఎంతో ఘనంగా జరిగేవి. కాని నేటి తరంలో అందరు పిల్లల చదువుల గురించి, ఉద్యోగాల రీత్యా పట్టణాలకు వలస వెళ్ళుచున్నారు. అందువలన నేడు ఊరు ఎంత గానో బోసి పోయినట్లుగా కనపడు చున్నది.

దేవాలయములు

[మార్చు]

ఊరికి దక్షిణముగా వినాయకుని ఆలయం, పడమరగా రామాలయం కలవు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.