రామనారాయణ తర్కరత్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామనారాయణ్ తర్కరత్న
(1822-12-26)డిసెంబరు
26, 1822 – 1886 [[జనవరి
19]]
Bust of Ramnarayan Tarkaratna at Harinavi.jpg
బెంగాలీ భాషలో తొలి స్వతంత్ర నాటక రచయిత
ఇతర పేర్లు: నాటుకె రామనారాయణ్
పుట్టిన తేదీ: (1822-12-26)డిసెంబరు
26, 1822
జన్మస్థలం: హరినావి, పశ్చిమ బెంగాల్
మరణించిన తేదీ: జనవరి 19, 1886(1886-01-19) (వయస్సు 63)
నిర్యాణ స్థలం: హరినావి, పశ్చిమ బెంగాల్

రామనారాయణ్ తర్కరత్న (1822-1886) ప్రముఖ బెంగాలీ నాటకకర్త, రచయిత. 'నాటుకె రామనారాయణ్' గా ప్రసిద్ధుడైన ఇతను తన నాటక కృతులతో బెంగాలీ నాటకరంగ అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడ్డాడు. ఇతని మొదటి నాటక రచన 'కులీనకుల సర్వస్వ' (1854) బెంగాలీ భాషలో తొలి స్వతంత్ర నాటకంగా గుర్తించబడింది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

రామనారాయణ్ తర్కరత్న విగ్రహం, హరినావి

రామనారాయణ్ తర్కరత్న పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలజిల్లాలో హరినావి గ్రామంలో 1822 డిశంబర్ 26 న ఒక పండిత కుటుంబంలో జన్మించాడు.[2] తండ్రి రామధన శిరోమణి. తండ్రి, తాత లిరువురూ సంస్కృత కళాశాలలో అధ్యాపకులు. రామనారాయణ్ తర్కరత్న ప్రాధమిక విధ్యాభ్యాసానంతరం కలకత్తాలోని సంస్కృత కళాశాలలో 1843 నుండి 1853 వరకు ఉన్నతవిద్యను అభ్యసించాడు. హిందూ మెట్రోపాలిటిన్ కళాశాలలో ప్రధాన పండితుడుగా 2 సంవత్సరాలు పనిచేసాడు.[2] ఇక్కడ పనిచేస్తున్నప్పుడే అతనిలో నాటక రచనావ్యాసంగం ప్రారంభమైంది. అనంతరం 27 ఏళ్ళుపాటు సంస్కృత కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేసాడు.[2] 1882 లో పదవీ విరమణఅనంతరం తన స్వస్థలం హరినావిలో ఒక సంస్కృత పాఠశాలను ప్రారంభించాడు.[2] 1886 జనవరి 19న స్వస్థలంలో మరణించాడు. ఇతని సోదరుడు ప్రాణకృష్ణ విద్యాసాగర్ కూడా సంస్కృత కళాశాల అధ్యాపకుడు.[2]

రచనలు[మార్చు]

రామనారాయణ్ తర్కరత్న మొత్తం 9 నాటకాలను రాసాడు. ఇతని మొట్టమొదటి నాటకం కులీనకుల సర్వస్వ సాంఘిక సంస్కరణ అంశంతో ముడిపడిన ఒక సాంఘిక నాటకం. ఐదు సంస్కృత నాటకాలను బెంగాలీ భాషలోకి అనువదించాడు. మూడు పౌరాణిక నాటకాలను బెంగాలిలో రచించాడు.

బెంగాలీ అనువాద నాటకాలు[మార్చు]

సుప్రసిద్ధ సంస్కృత నాటకాలను బెంగాలీ భాషలో అనువదించాడు.[1]

 • వేణీ సంహారం (1856)
 • రత్నావళి (1858)
 • అభిజ్ఞాన శాకుంతలం (1860)
 • నవ నాటకం (1866)
 • మాలతీ మాధవం (1867)

సంస్కృత గ్రంధాలు[మార్చు]

ఆర్యా శతకం, దక్షయజ్ఞం [3]

పౌరాణిక నాటకాలు[మార్చు]

రుక్మిణీ హరణ (1871), కంసవధ (1875), ధర్మవిజయ (1875) [3]

ప్రహసనాలు[మార్చు]

బూఝవేకినా, జెమన కర్మతెమని ఫల (Yeman Karma Teman phal) (1863), ఉభయసంకట (1869), చక్షుదాన (1869)[2][3]

కులీనకుల సర్వస్వ (1854)[మార్చు]

ఇది రామనారాయణ్ తర్కరత్న తొలి నాటక రచన.[2] ఇతని నాటక కృతులలో ప్రసిద్ధమైనది. బెంగాలీ భాషలో తొలి స్వతంత్ర నాటకంగా గుర్తించబడింది. 1854 లో వెలువడిన 'కులీనకుల సర్వస్వ' బెంగాలీ నాటకం ఆనాటి హిందూ సమాజంలో పాతుకుపోయిన బహుభార్యాత్వ దురాచారాన్ని ఖండిస్తూ, సమాజంలో దాని విషప్రభావాన్ని ఎత్తిచూపుతూ రాయబడిన సాంఘిక నాటకం.[2] సాంఘిక సంస్కరణను ఆలంబనగా చేసుకొని వచ్చిన బెంగాలీ నాటకాలలో ఇది మొదటిది. ఉదాహరణకు చక్కని నిర్మాణకౌశలంతో రూపొందిన ఈ నాటకం 1858 లో జరిగిన నాటక ప్రదర్శనలో 50 రూపాయల బహుమతిని గెలుచుకొంది.[3]

రత్నావళి (1858)[మార్చు]

ఇది రామనారాయణ్ తర్కరత్న మరో ప్రసిద్ధ నాటక రచన. శ్రీహర్షుని సంస్కృత నాటకం రత్నావళి కి బెంగాలీ భాషానువాదం. కలకత్తా లోని పాయికపడా రాజమందిరంలో 1858 లో విజయవంతంగా ప్రదర్శింపబడటంతో బెంగాలీ నాటక రంగంలో నూతనశకం ప్రారంభమైంది. ఈ నాటక ప్రదర్శన చూసాకే మైఖేల్ మధుసూదన్ దత్ బెంగాలీ నాటక రచనకు పూనుకొన్నాడు.[3]

ప్రభావం[మార్చు]

రామనారాయణ్ తర్కరత్న బెంగాలీ నాటక అభివృధికి గణనీయమైన సేవ చేసాడు. అతని తొలి రచన 'కులీనకుల సర్వస్వ' (1854) సామాజిక రుగ్మతలను ఖండిస్తూ రాయబడిన తొలి బెంగాలీ స్వతంత్ర నాటకం. తదనంతర కాలంలో ఈ నాటకాన్ని అనుసరించి సామాజిక సంస్కరణ అంశంతో అనేక బెంగాలీ నాటకాలు వెలువడ్డాయి. వీటిలో ప్రాణకృష్ణ విద్యాసాగర్ రచించబడినదిగా భావించిన 'సంబంద సమాధి' నాటకం (దీని పూర్తి పేరు 'కులీనీ వైదికకుల కాలీన కాలాల కరవాల భూతసంబంది సమాధి' నాటకం), తారక చంద్ర చూడామణి రచించిన 'సపత్నీ నాటకం' లు ముఖ్యమైనవి.[4] ఇతని 'రత్నావళి' నాటక ప్రదర్శన మరో సంచలనం. ఇది అనేకమంది వంగ రచయితలకు తమ మాతృభాష బెంగాలీలో నాటకాలు రాయడానికి కావలిసినంత ప్రేరణ ఇచ్చింది.

పురస్కారాలు[మార్చు]

'నాటుకె రామనారాయణ్' గా పేరుపొందిన రామనారాయణ్ తర్కరత్న 'బెంగాల్ ఫిల్‌హర్మోనిక్ అకడమీ' (Bengal Philharmonic Academy) నుండి 'కావ్యోపాధ్యాయ' పురస్కారం పొందాడు.[2] ఇతని నాటకాలు ఎక్కువగా కలకత్తా లోని బెల్గాచియాలో గల ఖ్యాతిగాంచిన 'రంగ్‌మంచ్' లో అనేకసార్లు ప్రదర్శించబడటమే కాకుండా నాటక ప్రదర్శనలలో అనేక బహుమతులు గెలుచుకొన్నాయి.

రిఫరెన్సులు[మార్చు]

 • "Ramnarayan Tarkaratna". banglapedia. Retrieved 10 August 2017. CS1 maint: discouraged parameter (link)
 • Sen S., History of Bengali literature, New Delhi, 1960.
 • Sree Puripandaa Appalaswami. Uttara Bharata Sahityamulu (Telugu) (1979 ed.). Hyderabad: Andhra Pradesh Sahitya Acadamy. |access-date= requires |url= (help)CS1 maint: discouraged parameter (link)

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Uttara Bharata Sahityamulu, 1979 & p 95.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 banglapedia.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 Uttara Bharata Sahityamulu, 1979 & p 96.
 4. Uttara Bharata Sahityamulu, 1979 & 96.