Jump to content

రామభద్రాచార్య

వికీపీడియా నుండి
జగద్గురు రామభద్రాచార్య
జగద్గురు రామభద్రాచార్య 2009 అక్టోబరు 25న భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఉపన్యాసం ఇచ్చే సందర్భం
జననంగిరిధర్ మిశ్రా
(1950-01-14) 1950 జనవరి 14 (వయసు 74)
శండికుర్డ్, జాన్పూర్ జిల్లా,ఉత్తర ప్రదేశ్, భారతదేశం
స్థాపించిన సంస్థ
  • జగద్గురు రామభద్రాచార్య హేండీకేప్డ్ యూనివర్శిటీ
  • తులసి పీఠం
  • తులసి స్కూల్ ఆఫ్ బ్లైండ్
  • జగద్గురు రామభద్రాచార్య వికలాంగ సేవా సంఘం
  • కాంచ్ మందిర్
  • జగద్గురు రామభద్రాచార్య వికలాంగ శిక్షణా సంస్థాన్
Sect associatedరామనాండి సెక్ట్
గురువు
  • ఈశ్వరదాస్ (మంత్రం)
  • రామప్రసాద్ త్రిపాఠి (సంస్కృతం)
  • రామచరణదాస్ (సంప్రదాయం)
తత్వంవిశిష్టాద్వైత వేదాంతం
సాహిత్య రచనలుప్రస్థానత్రయి, శ్రీ భార్గవ రాఘవీయం, బృంగదూతం, గీతారామాయణం, శ్రీసీతారామ సుప్రభాతం, శ్రీ సీతారామ కేళీకౌముది, అష్టా వక్రుడు మొదలైన వాటిపై శ్రీ రాఘవ కృపా భాష్యం ,
ప్రముఖ శిష్యు(లు)డుఅభిరాజ్ రాజేంద్ర మిశ్రా, ప్రేమ్‌భూషణ్ [1] Nityanand Misra[2]
సంతకంThumb impression of Rambhadracharya

జగద్గురు రామానందచార్య స్వామి రామభద్రాచార్య[3] (జననం: గిరిధర్ మిశ్రాగా 1950 జనవరి14) భారతీయ హిందూ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త, సంస్కృత పండితుడు, బహుభాషావేత్త, కవి, రచయిత, వచన వ్యాఖ్యాత, తత్వవేత్త, స్వరకర్త, గాయకుడు, నాటక రచయిత, కథా కళాకారుడు. ప్రస్తుత నలుగురు జగద్గురు రామానందచార్యలలో[α] అతను ఒకడు. 1988 నుండి ఈ పదవిని పొందాడు.[4][5]

జగద్గురు రామ్‌భద్రాచార్యకు సంస్కృత సాహిత్యానికి చేసిన కృషికిగాను 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.[6]

రామభద్రాచార్య తులసీదాసు పేరు మీద చిత్రకూట్ లో ఉన్న మత, సామాజిక సేవా సంస్థ తులసి పీఠ్ స్థాపకుడు, అధిపతి[7]. చిత్రకూట్‌లోని జగద్గురు రామభద్రాచార్య వికలాంగుల విశ్వవిద్యాలయ స్థాపకుడు, జీవితకాల ఛాన్సలర్.[8][9] ఇది నాలుగు రకాల వికలాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది. రామభద్రాచార్య రెండు నెలల వయస్సు నుండి అంధుడు, పదిహేడేళ్ల వయస్సు వరకు పాఠశాల విద్య నేర్చుకోలేదు. అతను విద్య నేర్చుకోవడానికి లేదా సంగీతం స్వరపరచడానికి బ్రెయిలీని కానీ, మరే ఇతర సహాయాన్ని కానీ ఎప్పుడూ ఉపయోగించలేదు.[10]

రామభద్రాచార్య 22 భాషలను మాట్లాడగలడు. అతను సంస్కృత, హిందీ, అవధి, మైథిలి భాషలతో పాటు అనేక ఇతర భాషలలో ఆశు కవి, రచయిత.[β][11] అతను నాలుగు పురాణ కవితలు[γ], తులసీదాసు రామచరితమానస్, హనుమాన్ చాలీసా గ్రంథాలపై హిందీ వ్యాఖ్యానాలు, అష్టాధ్యాయ పద్యాలకు సంస్కృత వ్యాఖ్యానం, ప్రస్థానత్రయం గ్రంథాలపై[12][13] సంస్కృత వ్యాఖ్యానాలతో సహా 100 కు పైగా పుస్తకాలు, 50 పత్రాలను రచించాడు[14]. సంస్కృత వ్యాకరణం, న్యాయ, వేదాంతాలతో సహా విభిన్న రంగాలలో అతనికున్న అపార జ్ఞానం వల్ల అతను గుర్తింపు పొందాడు. అతను భారతదేశంలో తులసీదాసు సాషిత్యంపై గొప్ప అధికారం కలిగిన వారిలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను రామచరిత మానస విమర్శనా గ్రంథానికి సంపాదకుడు.[15] అతను రామాయణం, భాగవత కథా కళాకారుడు. అతని కథా కార్యక్రమాలు భారతదేశం, ఇతర దేశాలలో వివిధ నగరాల్లో క్రమం తప్పకుండా జరుగుతాయి. శుబ్ టివి, సంస్కార్ టివి, సనాతన్ టివి వంటి టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారం చేయబడతాయి. అతను విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకుడు కూడా.[16]

జననం, ప్రారంభ జీవితం

[మార్చు]

జగద్గురు రామభద్రాచార్య భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలోని షండిఖుర్డ్ గ్రామంలోని వసిష్ఠ గోత్రానికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పండిట్ రాజ్‌దేవ్ మిశ్రా, శచీదేవి మిశ్రా దంపతులకు జన్మించాడు[17]. అతను 1950 జనవరి 14 న మకర సంక్రాంతి రోజున జన్మించాడు[18][19]. తల్లి శచీచిదేవి, తండ్రి పండిట్ రాజ్‌దేవ్ మిశ్రా దంపతులకు జన్మించిన అతనికి తన మేనత్త, పితామహునికి దాయాది పండిట్ సూర్యబాలి మిశ్రా "గిరిధర్" అని పేర్ ఉపెట్టారు. అతని మేనత్త మీరాబాయి ఆరాధకురాలు. మీరాబాయి కృష్ణుని చేసే సంబోధనలలో ఎక్కువగా "గిరిధర్" అని ఉపయోగించడం వల్ల అతనికి "గిరిధర్" అని నామకరణం చేసింది.[20]

కంటి చూపు కోల్పోవడం

[మార్చు]

గిరిధర్ రెండు నెలల వయసులో ఉన్నప్పుడు కంటి చూపును కోల్పోయాడు. 1950 మార్చి 24 న అతని కళ్ళు ట్రాకోమా వ్యాధి బారిన పడ్డాయి. గ్రామంలో చికిత్స కోసం అధునాతన సౌకర్యాలు లేవు. అందువల్ల అతన్ని సమీప గ్రామంలోని ట్రాకోమా గడ్డలను నయం చేయడానికి గుర్తింపబడిన ఒక వృద్ధ మహిళ వద్దకు తీసుకెళ్లారు. ఆమె ఆ గడ్డలను పోగొట్టడానికి కళ్ళలో కరక్కాయల ముద్ద వేసింది. కానీ అతని కళ్ళకు తీవ్ర రక్త స్రావము ఏర్పడింది.[18][19] పర్యవసానంగా అతని చూపు పోయింది. అతని కుటుంబం అతన్ని లక్నోలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లింది, అక్కడ అతని కళ్ళకు 21 రోజులు చికిత్స చేసారు. కాని అతని దృష్టి పునరుద్ధరించబడలేదు[19]. సీతాపూర్, లక్నో, బొంబాయిలలో వివిధ ఆయుర్వేద, హోమియోపతి, అల్లోపతి, ఇతర వైద్యవిధానాలను అవలంబించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది[20]. రామభద్రాచార్య అప్పటినుండి అంధుడుగా మారిపోయాడు. అతను బ్రెయిలీని ఉపయోగించనందున అతను చదవలేడు, వ్రాయలేడు; అతను వినడం ద్వారా నేర్చుకుంన్నాడు.[10]

బాల్యంలో ప్రమాదం

[మార్చు]

1953 జూన్లో గ్రామంలో గారడీవాడి కోతి నృత్యం చేస్తున్న ప్రదర్శనలో కోతి వారిని తాకే సమయంలో పిల్లలతొ సహా గిరిధర్ అకస్మాత్తుగా పారిపోయాడు. ఈ క్రమంలో గిరిధత్ ఒక ఎండిపోయి పాడుపడిపోయిన నూతిలో పడిపోయి ఒక యువతి రక్షించే వరకు కొంతకాలం అక్కడ చిక్కుకున్నాడు[19]. రామచరిత మానస్ గ్రంథంలోని శ్లోకం (1.192.4) లోని ఈ క్రింది పంక్తిని నేర్చుకున్నందున అతని జీవితం రక్షించబడినదని అతని తాత చెప్పాడు[19][21]

यह चरित जे गावहिं हरिपद पावहिं ते न परहिं भवकूपा ॥
యహ చరిత్ జె గావహి హరిపద్ పావై తే న పరహి బహ్వకృప ॥

దీనిని పాడే వారు హరి (విష్ణువు) పాదాలకు చేరుకుంటారు, జనన మరణాల ఊబిలో పడరు.

[19]

గిరిధర్ తాత ఎప్పుడూ ఈ పద్యం పఠించమని కోరాడు, అప్పటినుండి గిరిధర్ నీరు, ఆహారం తీసుకున్న ప్రతిసారీ దానిని పఠించే పద్ధతిని అనుసరించాడు.

మొదటి కవిత్వం

[మార్చు]

గిరిధర్ యొక్క ప్రారంభ విద్య అతని తండ్రి బొంబాయిలో పనిచేస్తున్నందున అతని పితామహుడి నుండి వచ్చింది. ప్రతీరోజూ మధ్యాహ్న సమయాలలో అతని తాత హిందూ పురాణాలైన రామాయణం, మహాభారతం యొక్క వివిధ కథలను, విశ్రామ్‌సాగర్, సుఖ్‌సాగర్, ప్రేమ్‌సాగర్, బ్రజ్విలాస్ వంటి భక్తి రచనలను అతనికి వివరించేవాడు. మూడేళ్ళ వయసులో గిరిధర్ తన మొదటి కవితా భాగాన్ని అవధి (హిందీ మాండలికం) లో కూర్పు చేసాడు. దానిని తన తాతకు వినిపించాడు. ఈ పద్యంలో, కృష్ణుడి పెంపుడు తల్లి యశోద కృష్ణుడిని బాధపెట్టినందుకు గోపిక తో పోరాడుతోంది.[19][20]

దేవనాగరి
मेरे गिरिधारी जी से काहे लरी।
तुम तरुणी मेरो गिरिधर बालक काहे भुजा पकरी॥
सुसुकि सुसुकि मेरो गिरिधर रोवत तू मुसुकात खरी॥
तू अहिरिन अतिसय झगराऊ बरबस आय खरी॥
गिरिधर कर गहि कहत जसोदा आँचर ओट करी॥

IAST
మేరె గిరిధర్ జీ సె కహె లారి।
తుం తరుణీ మేరో గిరిధర్ బాలక్ కాహె భుజా పకరీ॥
సుసుకి సుసుకి మెరొ గిరిధర్ రోవత్ తూ ముసుకాత్ ఖరీ ॥
తూ అహిరిణ్ అసిసయ్ ఝగరఊ బరబస్ ఆయ్ ఖరీ॥
గిరిధర్ కర్ గహి కరత్ జసోదా ఆంచర్ ఓట్ కరీ ॥

"'మీరు నా' 'గిరిధర' '(కృష్ణ) తో ఎందుకు పోరాడారు? నీవు యువ కన్యవు, నా గిరిధర (కృష్ణ) చిన్నపిల్లవాడు మాత్రమే, మీరు అతని చేతిని ఎందుకు పట్టుకున్నారు? నా గిరిధర (కృష్ణ) ఏడుస్తున్నాడు, పదేపదే దుఃఖిస్తాడు, మీరు నవ్వుతూ అక్కడ నిలబడతారు! ఓ గోపికా నీవు ఎక్కువగా గొడవకు మొగ్గు చూపుతున్నావు, ఇక్కడకు వచ్చి ఆహ్వానించకుండా నిలబడండి.కాబట్టి యశోద, గిరిధర (కృష్ణ) చేతిని పట్టుకుని, ఆమె చీర చివరతో ముఖాన్ని కప్పుకొని ఉంది." అని , గిరిధర (కవి) పాడాడు.

గీత, రామచరితమానస్ లో ప్రావీణ్యత

[మార్చు]

ఐదేళ్ల వయసులో గిరిధర్ 700 పద్యాలతో కూడిన మొత్తం భగవద్గీతను అధ్యాయాలలో, పద్య సంఖ్యలతో పాటు 15 రోజుల్లో తన పొరుగువాడైన పండిట్ మురళీధర్ మిశ్రా సహాయంతో కంఠస్థం చేశాడు. 1955 లో జన్మష్టమి రోజున భగవద్గీత మొత్తం పఠించారు.[19][20] గీతను జ్ఞప్తిలో ఉంచుకున్న 52 సంవత్సరాల తరువాత, 2007 నవంబరు 30 న న్యూ ఢిల్లీలో అసలు సంస్కృత వచనం, హిందీ వ్యాఖ్యానంతో గ్రంథం యొక్క మొదటి బ్రెయిలీ అనువాదాన్ని ఆయన విడుదల చేశాడు. గిరిధర్ ఏడేళ్ళ వయసులో తన తాత సహాయంతో అధ్యాయం, పద్య సంఖ్యలతో సుమారు 10,900 శ్లోకాలను కలిగి ఉన్న తులసీదాస్ రచించిన రామ్‌చరితమానస్ ను 60 రోజుల్లో కంఠస్థం చేశాడు. 1957 లో శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉన్నప్పుడు మొత్తం ఇతిహాసాన్ని పఠించాడు.[19][20] తరువాత గిరిధర్ వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృత వ్యాకరణ రచనలు, భాగవత పురాణం, తులసీదాస్ యొక్క అన్ని రచనలతో పాటు సంస్కృత, భారతీయ సాహిత్యంలో అనేక ఇతర రచనలను కూడా నేర్చుకున్నాడు.[20]

ఉపనయననం, కథా ప్రసంగాలు

[మార్చు]

గిరిధర్ యొక్క ఉపనయనం 1961 జూన్ 24 నాటి నిర్జల ఏకాదశి రోజున జరిగింది. ఈ రోజున అతనికి గాయత్రీ మంత్రంతో పాటు దీక్ష ఇవ్వబడింది (దీక్ష ఇవ్వబడింది). దీనికి అయోధ్యకు చెందిన పండిట్ ఈశ్వరదాస్ మహారాజ్ రామ మంత్రం ఉపదేశించాడు. చాలా చిన్న వయస్సులోనే భగవద్గీత, రామ్‌చారిత్‌మన్‌లలో ప్రావీణ్యం సంపాదించిన గిరిధర్ తన గ్రామానికి సమీపంలో జరిగిన కథా కార్యక్రమాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవాడు. అతను మూడవసారి హాజరైనప్పుడు రామ్‌చరిత్మణాలపై ఒక కథను సమర్పించాడు. ఇది కథ అనేక మంది గొప్పవారిచే ప్రశంసించబడింది.[20]

కుటుంబం ద్వారా వివక్ష

[మార్చు]
Young Giridhar Mishra
గిరిధర్ మిశ్రా, యువకునిగా ఉన్నప్పటి చిత్రం

గిరిధర్ పదకొండు సంవత్సరాల వయసులో అతని కుటుంబం ఒక వివాహ ఉత్సవంలో పాల్గొనకుండా చేసారు. అతను ఆ వివాహానికి హాజరు కావడం చెడు శకునమని అతని కుటుంబం భావించింది. ఈ సంఘటన గిరిధర్‌పై బలమైన ముద్ర వేసింది:[22]

సాంప్రదాయక విద్య

[మార్చు]

విద్యాశాలలో చదువు

[మార్చు]

గిరిధర్‌కు పదిహేడేళ్ల వయస్సు వరకు అధికారిక పాఠశాల విద్య లేకపోయినప్పటికీ, అతను చిన్నతనంలో వినడం ద్వారా అనేక సాహిత్య రచనలను నేర్చుకున్నాడు. అతని కుటుంబం అతన్ని కథావాచక్ (కథా కళాకారుడు) కావాలని కోరుకుంది. కాని గిరిధర్ తన చదువును కొనసాగించాలని అనుకున్నాడు. అతని తండ్రి వారణాసిలో విద్యకు గల అవకాశాలను అన్వేషించాడు. అంధ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక పాఠశాలకు పంపాలని అనుకున్నాడు. గిరిధర్ తల్లి అతన్ని అక్కడికి పంపడానికి నిరాకరించింది. అంధ పిల్లలను పాఠశాలలో బాగా చూసుకోలేరని అభిప్రాయపడింది[18]. 1967 జూలై 7 న గిరీధర్ సమీపంలోని జౌన్‌పూర్‌లోని సుజన్‌గంజ్ గ్రామంలోని ఆదర్శ్ గౌరిశంకర్ సంస్కృత కళాశాలలో సంస్కృత వ్యాకరణం, హిందీ, ఇంగ్లీష్, గణితం, చరిత్ర, భూగోళశాస్త్రం అధ్యయనం చేశాడు.[23] తన ఆత్మకథలో అతను ఈ రోజును తన జీవిత ప్రయాణంలో ముఖ్యమైన దినంగా గుర్తుచేసుకున్నాడు[24]. విషయాన్ని ఒక్కసారి వినడం ద్వారా గుర్తుంచుకునే సామర్ధ్యంతో, గిరిధర్ బ్రెయిలీ లేదా అంధులకు అందించే ఇతర సహాయాల ద్వారా అధ్యయనం చేయలేదు[10]. మూడు నెలల్లో, అతను వరదరాజు రాసిన లఘుసిద్ధంతకౌముది గ్రంథాన్ని కంఠస్థం చేసి ప్రావీణ్యం పొందాడు. అతను నాలుగు సంవత్సరాలు తన తరగతిలో అగ్రస్థానంలో ఉన్నాడు[23]. సంస్కృతంలో ఉత్తర, మధ్యమ (హయ్యర్ సెకండరీ) పరీక్షలో మొదటి శ్రేణిలో, డిస్టింక్షన్ లో ఉత్తీర్ణుడయ్యాడు.

గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ

[మార్చు]

1971 లో గిరిధర్ వ్యాకరణంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వారణాసి లోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో చేరాడు.[23] అతను 1974 లో "శాస్త్రి" (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) డిగ్రీకి తుది పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు.[25] తరువాత అదే సంస్థలో "ఆచార్య" (మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్) [25] డిగ్రీకి చేరాడు[10]. తన మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు అతను అఖిల భారత సంస్కృత సదస్సులో వివిధ జాతీయ పోటీలలో పాల్గొనడానికి న్యూ ఢిల్లీని సందర్శించాడు. అక్కడ అతను ఎనిమిది బంగారు పతకాలలో ఐదింటిని గెలిచాడు. అతను వ్యాకరణం, సాంఖ్య, న్యాయ, వేదాంత, సంస్కృత అంతక్షారి విభాగాలలో ఈ పతకాలను సాధించాడు.[10] అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఐదు బంగారు పతకాలతో పాటు ఉత్తర ప్రదేశ్ తరఫున చల్వాయిజయంతి ట్రోఫీని గిరిధర్‌కు అందజేసింది. అతని సామర్ధ్యాలతో ఆకట్టుకున్న ఇందిరా గాంధీ తన కళ్ళకు చికిత్స కోసం తన సొంత ఖర్చుతో అమెరికాకు పంపమని ప్రతిపాదించింది. కాని గిరిధర్ ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఒక సంస్కృత పద్యంతో సమాధానమిచ్చాడు.[10][26]

దేవనాగరి
किं दृष्टव्यं पतितजगति व्याप्तदोषेऽप्यसत्ये
मायाचाराव्रततनुभृतां पापराजद्विचारे ।
दृष्टव्योऽसौ चिकुरनिकुरैः पूर्णवक्त्रारविन्दः
पूर्णानन्दो धृतशिशुतनुः रामचन्द्रो मुकुन्दः ॥

IAST
kiṃ dṛṣṭavyaṃ patitajagati vyāptadoṣe'pyasatye
māyācārāvratatanubhṛtāṃ pāparājadvicāre ।
dṛṣṭavyo'sau cikuranikuraiḥ pūrṇavaktrāravindaḥ
pūrṇānando dhṛtaśiśutanuḥ rāmacandro mukundaḥ ॥

తప్పుడు, దుర్గుణాలతో నిండిన, వివాదాలతో నిండిన, మోసపూరితమైన దుష్ట మానవుల పాపాలతో పరిపాలించబడుతున్న ఈ పడిపోయిన ప్రపంచంలో ఏమి చూడాలి? కమలంలాంటి ముఖాన్ని కప్పివేసే వెంట్రుకలు కలిగిన, పూర్తిగా ఆనందంగా ఉన్న, పిల్లల రూపాన్ని కలిగి ఉన్న రాముడు మాత్రమే విముక్తి ఇచ్చేవాడు.

1976 లో వ్యాకరణంలో జరిగిన ఆచార్య పరీక్షలలో గిరిధర్ అగ్రస్థానంలో నిలిచాడు, ఏడు బంగారు పతకాలు, ఛాన్సలర్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అరుదైన విజయంలో అతను వ్యాకరణంలో మాస్టర్స్ డిగ్రీకి మాత్రమే చేరినప్పటికీ, 1976 ఏప్రిల్ 30 న విశ్వవిద్యాలయంలో బోధించిన అన్ని సబ్జెక్టులకు ఆచార్యునిగా ప్రకటించారు.[10]

రచనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "राष्ट्रबोध का अभाव सबसे बड़ी चुनौती -प्रेमभूषण महाराज, रामकथा मर्मज्ञ" [The lack of national awareness is the biggest challenge: Prem Bhushan Maharaj, the exponent of Ram Katha]. పాంచజన్య (పత్రిక) (in Hindi). 16 August 2012. Archived from the original on 28 January 2016. Retrieved 24 August 2012.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. Sharma, Richa; Raj, Jyoti; Mishra, Narayan Dutt (hosts) (30 April 2016). "Vaartavali: Sanskrit News Magazine April 30" (in Sanskrit). Vaartavali. Doordarshan News. Archived from the original on 3 March 2018. https://web.archive.org/web/20180303194341/https://www.youtube.com/watch?v=cvC5Itp01UI. Retrieved 7 May 2016. "नित्यानन्दमिश्रः ... स्वामिरामभद्राचार्यस्य शिष्यो हि अयं ..." 
  3. "UP govt creating misconception about yatra: Rambhadracharya". Zee News. 27 ఆగస్టు 2013. Archived from the original on 5 అక్టోబరు 2013. Retrieved 30 ఆగస్టు 2013.
  4. Agarwal 2010, pp. 1108–1110.
  5. Dinkar 2008, p. 32.
  6. Andhrajyothy (17 February 2024). "58 Jnanpith Award: ఈసారి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఎవరెవరికంటే..?". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  7. Nagar 2002, p. 91.
  8. Dwivedi 2008, p. x.
  9. Aneja 2005, p. 68.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 Aneja 2005, p. 67.
  11. Dinkar 2008, p. 39.
  12. Prasad 1999, p. 849: श्रीहनुमानचालीसा की सर्वश्रेष्ठ व्याख्या के लिए देखें महावीरी व्याख्या, जिसके लेखक हैं प्रज्ञाचक्षु आचार्य श्रीरामभद्रदासजी। श्रीहनुमानचालीसा के प्रस्तुत भाष्य का आधार श्रीरामभद्रदासजी की ही वैदुष्यमंडित टीका है। इसके लिए मैं आचार्यप्रवर का ऋणी हूँ। [For the best explanation of Hanuman Chalisa, refer the Mahāvīrī commentary, whose author is the visually-disabled Acharya Rambhadradas. The base for the commentary being presented is the commentary by Rambhadradas, which is adorned with erudition. For this, I am grateful to the eminent Acharya.]
  13. Dinkar 2008, pp. 40–43.
  14. "మార్గదర్శి జగద్గురు రామభద్రాచార్య (Margadarsi Jagadguru Rambhadracharya)" (in Telugu). మార్గదర్శి (Margadarsi). Hyderabad. 21 October 2012. 1:24 minutes in. ETV Network. ETV2. Archived from the original on 25 July 2013. https://web.archive.org/web/20130725105242/http://www.youtube.com/watch?v=qg6Lu9bil6k. Retrieved 25 October 2012. "ఆయన శతాధిక గ్రంథకర్తా (He is the author of more than 100 books)." 
  15. Rambhadracharya (ed) 2006.
  16. Ashish Tripathi (26 August 2013). "VHP yatra: Allahabad HC orders release of Ashok Singhal, Praveen Togadia". Times of India. Lucknow. Archived from the original on 29 ఆగస్టు 2013. Retrieved 2 October 2013.
  17. Singh, Roopam (27 January 2015). "पढ़िए, पद्म पुरस्कार पाने वाली यूपी की इन छह हस्‍तियों के बारे में" [Read about the six Padma-awardees from Uttar Pradesh] (in Hindi). ETV Uttar Pradesh. Archived from the original on 12 September 2015. Retrieved 7 October 2015.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  18. 18.0 18.1 18.2 Aneja 2005, p. 66.
  19. 19.0 19.1 19.2 19.3 19.4 19.5 19.6 19.7 19.8 Nagar 2002, pp. 37–53.
  20. 20.0 20.1 20.2 20.3 20.4 20.5 20.6 Dinkar 2008, pp. 22–24.
  21. Prasad 1999, p. 133.
  22. Nagar 2002, p. 37.
  23. 23.0 23.1 23.2 Dinkar 2008, pp. 25–27.
  24. Nagar 2002, p. 55.
  25. 25.0 25.1 Gupta and Kumar 2006, p. 745.
  26. Nagar 2002, p. 72.


ఉల్లేఖన లోపం: "lower-greek" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-greek"/> ట్యాగు కనబడలేదు