రామినేని అయ్యన్న చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామినేని అయ్యన్న చౌదరి.

రామినేని అయ్యన్న చౌదరి ఒక సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త. 1929 అక్టోబర్ 12న గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు గ్రామములో వీరయ్య చౌదరి, కన్యాకుమారి దంపతులకు జన్మించాడు. తండ్రి వీరయ్యకు నిజవృత్తి వ్యవసాయమందు, లలిత కళలయందు మక్కువ. అయ్యన్న దంపతులకు ఆరుగురు సంతానము. వీరి పేర్లు: ధర్మప్రచారక్, శారదాదేవి, సత్యవాది, బ్రహ్మానంద, వేదాచార్య, హరిశ్చంద్ర. అయ్యన్న ఏప్రిల్ 24, 2000 న మరణించాడు.

విద్య - వృత్తి

[మార్చు]

గుంటూరులో విద్యాభ్యాసము చేసి కాశీ హిందూ విశ్వ విద్యాలయములో గణితశాస్త్రములో పట్టా పొంది, గుంటూరు జిల్లా పాలపర్రు గ్రామములో, కృష్ణా జిల్లా మొవ్వ గ్రామములో అధ్యాపకునిగా పనిచేశాడు.

విద్యాపిపాసతో 1955 సంవత్సరములో అమెరికా వెళ్ళి విత్తశాస్త్రములో యం.యస్సీ, మిన్నసోటా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. 1963 - 1973 సంవత్సరముల మధ్య నార్త్ లాండ్ కళాశాలలో, పిమ్మట జేవియర్ విశ్వవిద్యాలయములో అచార్య పదవి నిర్వహించి మంచి అధ్యాపకునిగా పేరు తెచ్చుకున్నాడు. 1973లో పదవీ విరమణ చేసి సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో కాలము వెళ్ళ బుచ్చుటకు నిర్ణయించాడు. మిన్నసోటా హిందూ సంఘము స్థాపించి హిందూ సంస్కృతి, కళలు, పండుగలు, సాంఘిక సేవా కార్యక్రమాలు జరిపాడు.

వ్యాపార రంగం

[మార్చు]

అయ్యన్న రియల్ ఎస్టేట్ రంగములో కూడా ప్రవేశించి, ఒహయో (Ohio) రాష్ట్రములోని సిన్సినాటి నగరములో డౌన్‌టౌన్ ప్రాపర్టీ మానేజ్‌మెంట్ అనే సంస్థను నెలకొల్పాడు.

సాంఘిక సేవలు

[మార్చు]

జన్మభూమిపై మమకారముతో బ్రాహ్మణకోడూరు గ్రామములో "సంగీత సాహిత్య, సంస్కృతీ హిందూ ధర్మ నిలయము" స్థాపించాడు. గ్రామములోని వ్యవసాయదారులకు ఆధునిక పద్ధతుల గురించి అవగాహన, శిక్షణ మొదలగు సేవాకార్యక్రమాలు చేశాడు. హైదరాబాదులో హిందూస్తాన్ థెరప్యూటిక్స్ అను సంస్థను ప్రారంభించి రైతులకు పశువుల మందులు, మేత తయారు చేయించాడు

1999లో అయ్యన్న సంతానము ఆతని 70వ పుట్టినరోజున రామినేని ఫౌండేషన్ స్థాపించారు. దీని ముఖ్యోద్దేశములు అమెరికాలో, ఆంధ్ర రాష్ట్రములో సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి, పలు రంగములలో పేరొందిన వ్యక్తులను సన్మానించి తరువాయి తరముల వారికి ఉత్ప్రేరకముగా పనిచేయుట.[1]

మూలాలు

[మార్చు]
  1. రామినేని ఫౌండేషన్: http://www.ramineni.com/rac/racfound.html Archived 2009-01-06 at the Wayback Machine

వనరులు

[మార్చు]