రామ్ తేరీ గంగా మైలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్ తేరీ గంగా మైలీ
దర్శకత్వంరాజ్ కపూర్
రచనరాజ్ కపూర్
వి. పి. సాఠే
కె. కె. సింగ్
జ్యోతి స్వరూప్
నిర్మాతరణధీర్ కపూర్
తారాగణంమందాకిని
రాజీవ్ కపూర్
ఛాయాగ్రహణంరాధూ కర్మాకర్
కూర్పురాజ్ కపూర్
సంగీతంరవీంద్ర జైన్
పంపిణీదార్లుఆర్. కె. ఫిల్మ్స్
విడుదల తేదీ
1985 ఆగస్టు 16 (1985-08-16)
సినిమా నిడివి
178 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్1.44 కోట్లు
బాక్సాఫీసుest. 19 crores (equivalent to ₹326 crore (US$46 million) in 2016)

రామ్ తేరి గంగా మైలీ (ఆంగ్లం: Ram Teri Ganga Maili) 1985లో విడుదలైన భారతీయ చలనచిత్రం. ఇది హిందీ భాషలో వచ్చిన రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో మందాకిని, రాజీవ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.

వివాదం[మార్చు]

రామ్ తేరీ గంగా మైలీ (హిందీ: राम तेरी गंगा मैली)కి తెలుగులో అర్థం 'రామ్, నీ గంగా కళంకితమైంది'. హీరోయిన్ మందాకిని పారదర్శకమైన చీరలో తల్లిపాలు పట్టడం, స్నానం చేయడం వంటి బోల్డ్ సన్నివేశాల కారణంగా ఈ చిత్రం వివాదాన్ని సృష్టించింది. దీనికి సంప్రదాయవాద భారతీయ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి బోర్డు అనుమతించలేదు. మొదటిలో U (యూనివర్సల్) వయస్సు రేటింగ్‌ను ఇచ్చినా తరువాత U/Aకి సవరించబడింది. కపూర్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఇది.

రామ్ తేరీ గంగా మైలీ భారతీయ సినిమా 'ఆల్-టైమ్ బ్లాక్ బస్టర్స్' జాబితాలో చేర్చబడింది. ఇది ముంబైలో డైమండ్ జూబ్లీ, ఇతర ప్రధాన నగరాల్లో గోల్డెన్ జూబ్లీగా ధృవీకరించబడింది. ఈ చిత్రం సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. క్రాంతి (1981), మైనే ప్యార్ కియా (1989)తో పాటు 1980లలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇది కూడా ఒకటి.[1]

అవార్డులు[మార్చు]

33వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

గెలిచినవి:

ఉత్తమ చిత్రం - రణధీర్ కపూర్

ఉత్తమ దర్శకుడు - రాజ్ కపూర్

ఉత్తమ సంగీత దర్శకుడు - రవీంద్ర జైన్

ఉత్తమ కళా దర్శకత్వం - సురేష్ జె. సావంత్

ఉత్తమ ఎడిటింగ్ - రాజ్ కపూర్

నామినేట్ చేయబడినవి:

ఉత్తమ నటి - మందాకిని[2]

ఉత్తమ సహాయ నటుడు - సయీద్ జాఫ్రీ

ఉత్తమ గీత రచయిత - హస్రత్ జైపురి

ఉత్తమ నేపథ్య గాయకుడు - సురేష్ వాడ్కర్

ఉత్తమ కథ - రాజ్ కపూర్

మూలాలు[మార్చు]

  1. "Boxofficeindia.com". 2013-10-14. Archived from the original on 2013-10-14. Retrieved 2020-08-07.
  2. "Filmfare Awards" (PDF). p. 71. Archived from the original (PDF) on 12 జూన్ 2009. Retrieved 14 September 2008.