రాయచూరు అంతర్వేది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కృష్ణా, తుంగభద్ర నదులు మధ్యనున్న త్రిభుజాకారపు ప్రాంతాన్ని రాయచూరు అంతర్వేది లేదా రాయచూరు దోబ్ అంటారు. దోబ్ అన్న పదము దో+అబ్ అన్న రెండు పదాల కలయిక (అబ్ అంటే పర్షియన్ లో నీరు అని, దో అంటే రెండు). సారవంతమైన ఈ ప్రాంతము దక్షిణభారత దేశ చరిత్రలో మధ్యయుగాలలో ముఖ్య పాత్ర పోషించింది. కర్ణాటక లోని రాయచూరు, కొప్పల్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని గద్వాల జిల్లా, రాయచూరు అంతర్వేదిలో భాగం. ఈ ప్రాంతములో ముఖ్య పట్టణమైన రాయచూరు మీదుగా ఈ ప్రాంతానికి రాయచూరు అంతర్వేది అన్నపేరు వచ్చింది.

విజయనగర రాజులు, దక్కను సుల్తానుల మధ్య రాయచూరు అంతర్వేదిపై ఆధిపత్య విషయము అనేక యుద్ధాలకు దారి తీసినది. ఇక్కడ రాయచూరు, ముద్గల్లు కోటలు ఉన్నాయి

వ్యవసాయం

[మార్చు]

కృష్ణ, తుంగ భద్ర నదుల వలంబ ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. సింధనూరు, గంగావతి, సిరుగుప్పలు కర్ణాటకలో కెల్లా అత్యధిక ధాన్యాన్ని పండిస్తాయి. బత్తాయి తోటల పెంపకానికి రాయచూరు జిల్లాది రాష్ట్రం లోనే ప్రథమ స్థానం.[1]

సహజ వనరులు, పరిశ్రమలు

[మార్చు]

లింగసూగూరు తాలూకాలో ఉన్న హట్టి బంగవరు గనులకు ప్రాసిద్ధి. భారతదేశంలో ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న బంగారు గనులు ఇదొక్కటే. అశోకుడి కంటే ముందు నుండే ఇక్కడ బంగారు గనులుండేవి. 19 వ శతాబ్ది చివరిలో ఇక్కడ బంగారు గనులను తిరిగి కనుగొన్నారు.

దేవసూగూరు వద్ద ఉన్న రాయచూరు తాప విద్యుత్ కేంద్రం 1986 లో ఉత్పత్తి మొదలుపెట్టింది. కర్ణాటకలో తొట్టతొలి తాప విద్యుత్ కేంద్రం ఇది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-23. Retrieved 2020-06-12.