రాయలసీమ హక్కుల ఐక్య వేదిక
Appearance
రాయలసీమ హక్కుల ఐక్య వేదిక (Rayalaseema Rights United Forum) కి అధ్యక్షుడు టీ జీ వీ సంస్థల సమూహమునకు అధినేత అయిన టీ. జీ. వెంకటేష్. రాష్ట్ర విభజన ఈ వేదిక యొక్క ధ్యేయం కాదు. ఈ ప్రదేశంలోని వెనుకబాటుతనాన్ని నిర్మూలించి అభివృద్ధి బాట వేయటమే ధ్యేయం.
అభిప్రాయాలు
[మార్చు]- సమైక్య రాష్ట్రంగా ఉండటం వలన రాయలసీమ కి అన్యాయం జరుగుతోంది.
- కృష్ణా నదీ జలాలలో సీమ కి రావలసిన అధిక వాటాకి జరిగిన ప్రయత్నం విఫలమైనది.
- బ్రిటీష్ పాలనలో నేత మిల్లులు, ద్రావకాల వెలికితీత యూనిట్లతో "రెండవ బొంబాయి" గా విలసిల్లిన ఆదోని ప్రాముఖ్యం కనుమరుగైనది.
- చక్కెర, కాగితం, గనుల కర్మాగారలని స్థాపించే అవకాశం సీమ లో ఉంది.
- సహజ వాయువుని సరఫరా చేస్తే ఈ ప్రదేశంలో ఒక లక్ష ఉద్యోగాలు దొరుకుతాయి
- బళ్ళారి కర్ణాటక రాష్ట్రం లోకి చేర్చటంతో, కాలువ రాయలసీమ లో ఉండిననూ, ప్రాజెక్టు కర్ణాటకలో ఉండటం వలన సమస్యలు వచ్చాయి.
- రాజధానిని కర్నూలు నుండి హైదరాబాదు కి తరలించినప్పుడు సీమ ప్రజలు ఎటువంటి అభ్యంతరాలని వ్యక్తం చేయలేదు, వారి త్యాగాలు వారిలోని సమైక్యాంధ్ర స్పూర్తికి నిదర్శనం
డిమాండ్లు
[మార్చు]- తెలంగాణాతో పోలిస్తే ఎక్కువ వెనుకబడి ఉన్నందున రాయలసీమ లో అభివృద్ధి ప్రణాళికలు చేపట్టాలి
- కమీటీల వలన ఉద్యమం నీరుగారి పోతుంది కాబట్టి కాలయాపన చేయకూడదు
- తెలంగాణని ప్రత్యేక రాష్ట్రం గా విభజిస్తే, నెల్లూరు, ప్రకాశం లని; కర్ణాటక లోని బళ్ళారి ని సీమలో కలిపి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం గా విభజించాలి
- రాయలసీమ లో గ్యాసు పైపులైనుని వేయించాలి.
- ఉద్యోగాలలో సమానత్వాన్ని పాటించాలి
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులను అందజేస్తున్న విద్యాసంస్థలకి ప్రత్యేక రాయితీలని ప్రకటించాలి
ఇవి కూడా చూడండి
[మార్చు]ములాలు
[మార్చు]- http://www.hindu.com/2004/08/16/stories/2004081603010500.htm Archived 2007-12-27 at the Wayback Machine
- http://www.hindu.com/2008/10/10/stories/2008101055950300.htm Archived 2009-01-24 at the Wayback Machine
- https://web.archive.org/web/20040812105802/http://www.hinduonnet.com/2004/07/12/stories/2004071207200300.htm
- https://web.archive.org/web/20070831152948/http://in.telugu.yahoo.com/News/Regional/0708/17/1070817008_1.htm