బైరెడ్డి రాజశేఖరరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బైరెడ్డి రాజశేఖరరెడ్డి
జననం1957
కర్నూలు జిల్లా కి చెందిన ముచ్చుమర్రి, పగిడ్యాల మండలం
ప్రసిద్ధిరాజకీయ నాయకుడు
తండ్రిబైరెడ్డి శేషశయనారెడ్డి [1]

బైరెడ్డి రాజశేఖర రెడ్డి భారతదేశానికి చెందిన ఒక రాజకీయవేత్త, రాయలసీమ ప్రాంత శ్రేయోభిలాషి. తెలంగాణ విభజనవాదం సమయంలో రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న వాదనని తీసుకువచ్చిన వ్యక్తి. రాయలసీమతో కలిపిన తెలంగాణకి గానీ, కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన తెలంగాణకి గానీ (రెండింటినీ రాయల తెలంగాణ గానే వ్యవహరించాడు) ఇతను వ్యతిరేకించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కర్నూలు జిల్లాకి చెందిన పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రిలో 1957 లో మూడు పర్యాయములు ఎం ఎల్ ఏ అయిన బైరెడ్డి శేషశయన రెడ్డికి ఇచను జన్మించాడు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి విద్యను పూర్తి చేశారు.

వృత్తి[మార్చు]

నందికొట్కూరు నియోజక వర్గానికి 1994 నుండి 1999 వరకు తెలుగు దేశం పార్టీ తరపున ఎం ఎల్ ఏ గా ఉన్నారు. 2004, 2009 లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటమి చెందాడు.

రాయలసీమ పరిరక్షణ సమితి[మార్చు]

సెప్టెంబరు 2012 లో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్ పీ ఎస్) స్థాపించారు. రాయలసీమ వాసుల సమస్యలని జనం దృష్టికి తీసుకురావటానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. 3000 కి.మీ రాయలసీమ ప్రాంతంలో ట్రాక్టరు యాత్రని నాలుగు నెలల వరకు చేశారు.2013 ఆగస్టు 5 న రాయలసీమ పరిరక్షణ సమితి నే తన పార్టీ పేరుగా ప్రకటించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 July 2016). "మాజీ మంత్రికి కన్నీటి వీడ్కోలు". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.