Jump to content

రాయలసీమ పరిరక్షణ సమితి

వికీపీడియా నుండి

రాయలసీమ పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీ.

రాష్ట్ర విభజన ప్రకటనతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉదృత రూపం దాల్చిన తరుణంలో తిరుపతిలో కొత్తగా రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భవించింది. నందికొట్కూరు మాజీ శాసన సభ్యుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ కోసం ఈ పార్టీ ఏర్పడింది.[1] ఇది కదిరి తిమ్మమ్మమర్రిమాను జెండాతో, 20 మంది రాయలసీమ ప్రముఖుల చిత్రాలతో ఆవిర్భవించిన పార్టీ. మర్రిచెట్టు బొమ్మతో ఉన్న జెండాను అవిష్కరించారు. సీమలోని అధ్యాత్మిక గురువులు, చరిత్రలో నిలిచిన మహనుభావులు ఫోటొలను ఈ జెండాలో ముద్రించారు.[2] తిరుపతి ఇందిరా మైదానంలో జరిగిన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రసంగిస్తూ రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లా లను 10 జిల్లాలుగా రూపొందించి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు పోరాడతామని చెప్పారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kalavalapalli, Yogendra (5 March 2014). "Now, trouble brews over capital for Seemandhra". Live Mint. Retrieved 12 March 2014.
  2. "పతాకం గురించి". Archived from the original on 2016-03-04. Retrieved 2014-03-30.

ఇతర లింకులు

[మార్చు]