రింకు ఘోష్
రింకూ ఘోష్ | |
---|---|
జననం | కేరళ, భారతదేశం | 1981 ఆగస్టు 30
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2000–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | దుర్గేష్ నందిని, పమ్మి ప్యారేలాల్,[1] దరోగా బాబూ ఐ లవ్ యూ,[2] బిదాయి, బలిదాన్, సాత్ సహేలియా, గంగా జమున సరస్వతి.[3] |
జీవిత భాగస్వామి | అభిజిత్ దత్తా రాయ్ |
రింకు ఘోష్ (జననం 1981 ఆగస్టు 30) భారతీయ టెలివిజన్, సినిమా నటి. ఆమె టెలివిజన్ ధారావాహిక దుర్గేష్ నందిని (2007)తో గుర్తింపు తెచ్చుకుంది. దరోగ బాబు ఐ లవ్ యు (2004), బిదాయి (2008), బలిదాన్ (2009) వంటి చిత్రాలలో తన నటనకు ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె భోజ్‌పురితో పాటు హిందీ, తెలుగు, బెంగాలీ భాషా చిత్రాలలో కూడా నటించింది.[4] ఆమె 2008, 2009లలో భోజ్‌పురి ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి పురస్కారంతో పాటు పలు అవార్డులను గెలుచుకుంది.
2022లో, ఆమె హిందీ వెబ్ సిరీస్ పత్రా పేటికాలో కూడా నటించింది.
కెరీర్
[మార్చు]టెలివిజన్ సీరియల్స్
[మార్చు]ఆమె మొదటి టెలివిజన్ పాత్ర 2007లో సోనీ టీవీలో ప్రసారమైన దుర్గేష్ నందిని అనే సీరియల్‌లో ప్రధాన నటిగా నటించింది. ఆ తర్వాత ఆమె మోహె రంగ్ దేలో ప్రధాన విరోధిగా కనిపించింది.[5] ఆమె 2009లో ఏక్ సఫర్ ఐసా కభీ సోచా నా థాలో తన నటనకు కూడా ప్రసిద్ధి చెందింది. 2012లో, ఆమె అంజన్ టీవీలో ప్రసారమైన ధనియా క థానాలో చేసింది. 2013లో, ఆమె కలర్స్ టీవీలో మిసెస్ పమ్మీ ప్యారేలాల్ అనే సిట్‌కామ్‌లో మోహిని ఫౌజ్‌దార్ పాత్రను, 2010లో ఇంతిహాన్‌లోనూ నటించింది. తర్వాత 2018లో బిగ్ గంగా ఛానెల్‌లో బిగ్ మెంసాబ్ షోకి సెలబ్రిటీ జడ్జిగా వ్యవమరించింది. 2021లో ఆమె జీ గంగాలో ప్రసారమైన మెమ్‌సాబ్ నంబర్ 1 షోకి కూడా ప్రముఖ న్యాయమూర్తి.
సినిమాలు
[మార్చు]ఆమె 2000 బెంగాలీ చిత్రం జై మా దుర్గాలో తన సినీ రంగ ప్రవేశం చేసింది, ఇందులో ఆమె దేబోశ్రీ రాయ్, అరుణ్ గోవిల్, అభిషేక్ ఛటర్జీల సరసన నటించింది. ఆమె 2001లో సాయి కిరణ్‌తో కలిసి రావే నా చెలియాతో తెలుగులోకి అడుగుపెట్టింది.[6] 2002లో, ఆమె హిందీ చిత్రం భరత్ భాగ్య విధాతలో సప్న పాత్ర పోషించింది. 2003వ సంవత్సరంలో ఆమె హిందీ చిత్రం తుమ్సే మిల్కే రాంగ్ నంబర్, కోయి హై వంటి బహుళ చలనచిత్రాలు విడుదలయ్యాయి. ఆమె 2004లో సుహాగన్ బనా సజ్నా హమార్ చిత్రంలో తన మొదటి భోజ్‌పురి మోషన్ పిక్చర్ చేసింది. 2005లో, ఆమె ముంబై గాడ్‌ఫాదర్ అనే హిందీ చిత్రంలో పనిచేసింది. ఆ తర్వాత ఆమె దరోగ బాబు ఐ లవ్ యు, బలిదాన్, సాత్ సహేలియన్, రఖ్వాలా, నాగీనా చిత్రాలలో నటించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Rinku Ghosh in Mrs Pammi Pyarelal". The Times of India. Times News Network. 10 January 2017. Retrieved 19 November 2022.
- ↑ Roy, Sandip (5 March 2019). "BJP's Manoj Tiwari is a cardboard warrior trying hard to prove he too has a 56-inch chest". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 22 November 2022.
- ↑ "Ganga Jamuna Saraswati to make history". The Times of India. Times News Network. 10 January 2017. Retrieved 18 November 2022.
- ↑ "Bhojpuri film actress". Dainik Jagran. Retrieved 20 February 2014.
- ↑ "Time to say goodbye". Hindustan Times (in ఇంగ్లీష్). 5 February 2009. Retrieved 23 December 2022.
- ↑ https://movies.fullhyderabad.com/raave-naa-cheliya/telugu/raave-naa-cheliya-movie-reviews-173-2.html [bare URL]