రిజ్వాన్ అర్షద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిజ్వాన్ అర్షద్
రిజ్వాన్ అర్షద్


కర్ణాటక శాసన సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 డిసెంబర్ 2019
ముందు ఆర్. రోషన్ బేగ్
నియోజకవర్గం శివాజీనగర్

కర్ణాటక శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
10 జూన్ 2016 – 17 ఫిబ్రవరి 2020
తరువాత లక్ష్మణ్ సవాడి
నియోజకవర్గం కర్ణాటక

వ్యక్తిగత వివరాలు

జననం (1979-09-24) 1979 సెప్టెంబరు 24 (వయసు 44)
కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు అర్షద్, షెహనాజ్ అర్షద్
జీవిత భాగస్వామి నజీహా రిజ్వాన్
సంతానం 2
నివాసం [[ బెంగళూరు]]
పూర్వ విద్యార్థి సెయింట్ ఫిలోమినా కళాశాల, మైసూర్
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు http://rizwanarshad.in/

రిజ్వాన్‌ అర్షద్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 నుండి కర్ణాటక శాసనసభలో శివాజీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

రిజ్వాన్ అర్షద్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995 నుండి 96 వరకు సెయింట్ ఫిలోమినా కళాశాలలో క్లాస్ రిప్రజెంటేటివ్‌గా, 1997 నుండి 98 వరకు మైసూర్ విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యునిగా, కళాశాల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా (1996), ఎన్‌ఎస్‌యూఐ వైస్ ప్రెసిడెంట్ మైసూర్ డిస్ట్రిక్ట్ యూనిట్ (1997), ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (1998) & 1999లో ఎన్‌ఎస్‌యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[1]

రిజ్వాన్ అర్షద్ 2004 నుండి 2010 వరకు కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా,  2010 నుండి 2011 వరకు భారత యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా, 2011లో కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో రెండోసారి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాడు.[2] రిజ్వాన్ అర్షద్ 2014 లోక్ సభ ఎన్నికలలో బెంగుళూరు సెంట్రల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

రిజ్వాన్ అర్షద్ 2016 జూన్ 10న ఎమ్మెల్యే కోటా ద్వారా కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికలలో బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం కాంగ్రెస్- జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్‌ చేతిలో ఓడిపోయాడు. ఆర్. రోషన్ బేగ్ అనర్హత కారణంగా 2019 డిసెంబరు 5న జరిగిన ఉప ఎన్నికలలో శివాజీనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన ఆ తరువాత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "INC's Rizwan Arshad is 34, but no greenhorn". CitizenMatters. 3 April 2014.
  2. "Rizwan wins youth Congress polls in Karnataka by huge margin". Times of India. 12 January 2014.
  3. "Rizwan Arshad pulls off a victory in Shivajinagar". 10 December 2019. Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.
  4. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.