Jump to content

రీసెర్చ్ ఫెలో

వికీపీడియా నుండి

రీసెర్చ్ ఫెలో అంటే యూనివర్సిటీ, పరిశోధనా సంస్థలలో ఒక పరిశోధన పదవి (అకాడెమిక్ రీసెర్చ్ పొజిషన్). సాధారణంగా అకడమిక్ స్టాఫ్, ఫ్యాకల్టీ ఈ పదవికి అర్హులు . రీసెర్చ్ ఫెలో స్వతంత్ర పరిశోధకుడిగా లేదా ఆ సంస్థలోనే ఇతర ప్రధాన పరిశోధకుడి పర్యవేక్షణలోనైన పనిచేయవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్‌కి భిన్నంగా, రీసెర్చ్ ఫెలో పదవికి సాధారణంగా డాక్టరల్ డిగ్రీ (PhD) లేదా పరిశ్రమ/పరిశోధన కేంద్రాలలో సమానమైన పని అనుభవం కలిగి ఉండడం అవసరం. కొంతమంది పరిశోధకులు పోస్ట్‌డాక్టోరల్ పరిశోధనను చేపట్టుతారు, ఇంకొందరు బోధనా బాధ్యతలను కలిగి ఉంటారు. వివిధ దేశాలలో, విద్యాసంస్థలలో రీసెర్చ్ ఫెలో స్థానాలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని చోట్ల అవి శాశ్వత ఉద్యోగంగా ఉంటే, ఇతర సంస్థలలో అవి తాత్కాలిక పదవిగా ఉంటాయి.

భారతదేశం

[మార్చు]

భారతదేశంలో సైన్స్, ఆర్ట్స్, లిటరేచర్, మేనేజ్‌మెంట్ వంటి ఇతర స్ట్రీమ్‌ల నుండి పండితులకు రీసెర్చ్ ఫెలోషిప్ స్థానం అందించబడుతుంది. రీసెర్చ్ ఫెలోషిప్ కి నిధులు ప్రభుత్వ విద్యాపరిశోధన సంస్థలు, ఇంకా ప్రైవేట్ కంపెనీల ద్వారా సమకూరుస్తుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రొఫెసర్, విభాగాధిపతి, డీన్ పర్యవేక్షణలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (SRF) అని పిలువబడే రెండు విభిన్న పరిశోధనకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ICAR, CSIR, UGC, ICMR, SERB వంటి పరిశోధనా సంస్థలు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ద్వారా రీసెర్చ్ ఫెలోస్ నియామకం చేస్తాయి. ముందుగా నిర్వచించిన పదవీకాలం పూర్తయిన తర్వాత JRF ని వారి పనితీరు ఇంకా ఇంటర్వ్యూ ఆధారంగా సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి (SRF) పరిగణించవచ్చు. భారతదేశంలో పరిశోధన ఆధారిత ఫెలో ప్రోగ్రామ్‌లను నిర్వహించే బహుళ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, ఘజియాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కలకత్తా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ షిల్లాంగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మొహాలీ, నేషనల్ స్కూల్ ఆఫ్ లీడర్‌షిప్ పూణే, XLRI - జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ జంషెడ్‌పూర్, కున్వర్ వియోగి మెమోరియల్ ట్రస్ట్ Archived 2021-09-15 at the Wayback Machine ఉత్తర ప్రదేశ్ వాటిలో కొన్ని.