Jump to content

రుద్రసాగర్ సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 23°30′14″N 91°18′54″E / 23.504°N 91.315°E / 23.504; 91.315
వికీపీడియా నుండి
రుద్రసాగర్ సరస్సు
నీర్ మహల్ వాటర్ ప్యాలస్ వద్ద నుండి దృశ్యం
Location in India
Location in India
రుద్రసాగర్ సరస్సు
ప్రదేశంమేలఘర్, త్రిపుర, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు23°30′14″N 91°18′54″E / 23.504°N 91.315°E / 23.504; 91.315
రకంసరస్సు
స్థానిక పేరు[ట్విజిలిక్మా] Error: {{Native name}}: missing language tag (help)  (language?)

రుద్రసాగర్ సరస్సు భారతదేశంలోని త్రిపురలో గల మేళఘర్ లో ఉంది. దీనిని త్విజిలిక్మా అని కూడా అంటారు.[1][2]

భౌగోళికం

[మార్చు]

రుద్రసాగర్ సరస్సు సిపాహీజాల జిల్లాలోని సోనమురా సబ్ డివిజన్ లోని మేళఘర్ బ్లాక్ లో ఉంది. ఈ సరస్సు 2.4 చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతంగా ఏర్పడింది. రాష్ట్ర రాజధాని త్రిపుర నుండి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సు 23 ° 29 ’N, 90 ° 01’ E మధ్య ఉంది.[3] [4]


2 నుండి 9 మీటర్ల వరకు లోతులో కొంత కాలుష్యం ఉన్నా నీరు మాత్రం తాజాగా ఉంటాయి. నీటి మట్టంలో హెచ్చుతగ్గులు 9 నుండి 16 మీటర్ల వరకు ఉంటాయి. సరస్సు దిగువ ప్రాంతం 750 హెక్టార్లు కలిగి, 37 ° C నుండి 50 ° C వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ప్రాంతం లో మే 15 నుండి అక్టోబర్ 15 వరకు వర్షపాతం ఉంటుంది.

ప్రత్యేకత

[మార్చు]

భారత ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ రుద్రసాగర్ సరస్సును జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలలో ఒకటిగా గుర్తించింది. రామ్‌సర్ కన్వెన్షన్ సెక్రటరీ జనరల్ రుద్రసాగర్ సరస్సును అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా ప్రకటించారు. ఈ ధృవీకరణ పత్రాన్ని పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, 29 ఫిబ్రవరి 2007 న విడుదల చేసింది.[5]

కాలుష్యం

[మార్చు]

ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాలు, ఇతర మొదలైన వ్యర్థ పదార్థాలు ఈ సరస్సులో కలపడం వంటి అనేక కాలుష్య కారకాల వల్ల ఈ సరస్సు కొన్ని కాలుష్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. నివాస స్థలాల విస్తరణ, అడవుల నరికివేత వంటి పనుల ద్వారా ఈ సరస్సు విస్తీర్ణం కూడా తగ్గుతూ ఉంది.[6].[7]

నీర్ మహల్

[మార్చు]

సరస్సు ఈశాన్య ఒడ్డున నీర్ మహల్ (వాటర్ ప్యాలెస్) అని పిలువబడే ఒక ప్యాలెస్ ఉంది. దీనిని అప్పటి త్రిపుర రాజు మహారాజా బిర్ బిక్రామ్ కిషోర్ మానిక్య బహదూర్ 1935 - 1938 మధ్య సమ్మర్ రిసార్ట్ గా నిర్మించారు.

మూలాలు

[మార్చు]
  1. The List of Wetlands of International Importance .2010. Convention on Wetlands (1971) Ramsar, Iran, Page-19
  2. "Rudrasagar Lake". Ramsar Sites Information Service. Retrieved 25 April 2018.
  3. Choudhury, A.U. (2008). Rudrasagar – a potential IBA in Tripura in north-east India. Mistnet 9 (2): 4-5.
  4. Choudhury, A.U. (2008). Rudrasagar – a potential IBA in Tripura in north-east India. Mistnet 9 (2): 4-5.
  5. Agenda note on Neermahal. 2007. Ministry of Forest, Fishery Dept., Govt. of Tripura Annual Report 2005-2006
  6. Deka S.2010,"Conservation, Restoration and Management of Rudrasagar Lake (Tripura)", Seminar Proceedings, North Eastern Symposium on Science and Technology, ICFAI Publication, Page:59-66
  7. Deka S.2010,"Conservation, Restoration and Management of Rudrasagar Lake (Tripura)", Seminar Proceedings, Department of Life Science, Dibrugarh University