సిపాహీజాల జిల్లా
సిపాహీజాల జిల్లా | |
---|---|
త్రిపుర రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
ఏర్పాటు | జనవరి 2012 |
ముఖ్య పట్టణం | బిశ్రామ్‌గంజ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,043.04 కి.మీ2 (402.72 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 5,42,731 |
జనాభా | |
• అక్షరాస్యత | 98% |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
సిపాహీజాల జిల్లా, త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. 2012, జనవరి నెలలో త్రిపురలో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త జిల్లాల్లో ఇది ఒకటి. జిల్లాలో కొంత భాగం పశ్చిమ త్రిపుర జిల్లా నుండి ఏర్పడింది. ఈ జిల్లాలో బిషాల్‌గర్, బిశ్రామ్‌గంజ్, మేలఘర్, సోనమురా మొదలైనవి ప్రధాన పట్టణాలు.
విభాగాలు
[మార్చు]ఈ జిల్లాలో బిషాల్‌గర్ ఉపవిభాగం, సోనమురా ఉపవిభాగం, జంపూయిజాలా ఉపవిభాగం అనే 3 ఉపవిభాగాలు ఉన్నాయి. ఈ జిల్లా పరిధిలో బిషాల్‌గర్, చరిలం, నల్చార్, మోహన్‌భోగ్, బాక్సానగర్, కాథాలియా, జంపూయిజాలా అనే 7 బ్లాక్‌లు ఉన్నాయి.[1]
భౌగోళికం, జనాభా
[మార్చు]ఈ జిల్లా 1,043.04 కి.మీ2 (402.72 చ. మై) విస్తీర్ణంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 5,42,731 జనాభా ఉన్నారు. అక్షరాస్యత 98% ఉంది.
రవాణా
[మార్చు]రోడ్డుమార్గం
[మార్చు]అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ నుండి త్రిపురలోని సబ్రూమ్ వరకు ఉన్న 8వ జాతీయ రహదారి ఈ జిల్లా మీదుగా వెళుతోంది.[2]
రైల్వేమార్గం
[మార్చు]ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలోని లమ్డింగ్-సబ్రూమ్ మార్గం ఈ జిల్లా మీదుగా వెళుతోంది. ఈ జిల్లాలో బిశ్రామ్‌గంజ్ రైల్వే స్టేషను, బిషాల్‌గర్ రైల్వే స్టేషను అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటినుండి త్రిపుర రాజధాని అగర్తలా, అస్సాం, ధర్మనగర్, ఉదయ్‌పూర్, బెలోనియా మొదలైన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం ఉంది.[3][4]
పర్యాటక ప్రాంతాలు
[మార్చు]ఈ జిల్లాలో మూడు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి[5]:-
- నీర్‌మహల్
- సిపాహీజాల వన్యప్రాణుల అభయారణ్యం
- కమల్ సాగర్ కాళి ఆలయం
మూలాలు
[మార్చు]- ↑ "District Sepahijala, GOVERNMENT OF TRIPURA". Retrieved 31 December 2020.
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 31 December 2020.
- ↑ "Indian Rail Info".
- ↑ "COVID-19 Reserved Specials - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 31 December 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Tourism | District Sepahijala, GOVERNMENT OF TRIPURA | India". Retrieved 31 December 2020.