ఖోవాయ్ జిల్లా
ఖోవాయ్ జిల్లా | |
---|---|
త్రిపుర జిల్లా | |
Coordinates (ఖోవాయ్): 23°53′51″N 91°38′14″E / 23.8974°N 91.6372°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
ఏర్పాటు | జనవరి 2012 |
ముఖ్య పట్టణం | ఖోవాయ్ |
తహసీల్ | 1. ఖోవాయ్ 2. తేలియామురా |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,377.28 కి.మీ2 (531.77 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 3,27,564 |
జనాభా | |
• అక్షరాస్యత | 87.78 |
• స్త్రీ పురుష నిష్పత్తి | 957 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Average annual precipitation | 2570 mm |
ఖోవాయ్ జిల్లా, త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. 2012, జనవరి నెలలో త్రిపురలో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త జిల్లాల్లో ఇది ఒకటి. ఖోవాయ్ పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది.[1] పశ్చిమ త్రిపుర జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది.[2] జిల్లాను ఖోవాయ్, తేలియామురా అనే రెండు ఉపవిభాగాలుగా విభజించారు.[3][4]
పద వివరణ
[మార్చు]ఖోవాయ్ నది నుండి ఈ జిల్లాకు ఖోవాయ్ అనే పేరు వచ్చింది. ఈ నది ఉత్తర-దక్షిణ దిశలో దాదాపు జిల్లా అంతటా ప్రవహిస్తోంది.[1]
భౌగోళికం
[మార్చు]ఖోవాయి జిల్లా తూర్పు వైపు దలై జిల్లాలోని కమల్‌పూర్ ఉపవిభాగం, పశ్చిమం వైపు పశ్చిమ త్రిపుర జిల్లాలోని సదర్ ఉపవిభాగం, దక్షిణం వైపు గోమతి జిల్లాలోని అమర్‌పూర్ ఉపవిభాగం, ఉత్తరం వైపు బంగ్లాదేశ్ దేశ సరిహద్దు ఉన్నాయి.
ఈ జిల్లా పరిధిలో 55 గ్రామ పంచాయితీలు, 2 మున్సిపాలిటీలు (ఖోవాయ్, తేలియామురా) ఉన్నాయి. 69 గ్రామ కమిటీలు ఏడీసీ పరిధిలోకి వస్తాయి.[5]
విభాగాలు
[మార్చు]ఈ జిల్లా ఖోవాయ్ ఉపవిభాగం, తేలియామురా ఉపవిభాగం అని రెండు ఉపవిభాగాలుగా విభజించబడింది.[3][4] జిల్లాను ఖోవయ్, పద్మబిల్, తులశిఖర్, కల్యాణ్‌పూర్, తేలియామురా, ముంగియాకుమి అనే 6 బ్లాక్‌లుగా విభజించారు.
రవాణా
[మార్చు]- రైలుమార్గం
ఈశాన్య సరిహద్దు రైల్వే ఆధ్వర్యంలోని లమ్డింగ్-సబ్రూమ్ మార్గం ఖోవాయ్ జిల్లా మీదుగా వెళుతోంది. జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషనైన తేలియామురా రైల్వే స్టేషను నుండి త్రిపుర రాజధాని అగర్తలా, అస్సాంలకు రైలు సౌకర్యం ఉంది.
పర్యాటక ప్రాంతాలు
[మార్చు]ఖోవాయ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు[5]:-
- బారామురా ఎకో పార్క్
- చక్మఘాట్ పార్క్, తేలియామురా
- బనబితి ఎకో పార్క్, పద్మాబిల్, ఖోవాయ్
- జంగల్ మహల్, ఖోవాయ్
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Districts of India - Khowai district : Tripura". Districts of India Portal -National Informatics Centre. Archived from the original on 24 జనవరి 2019. Retrieved 30 December 2020.
- ↑ "Four new districts for Tripura - Plan for six more subdivisions to decentralise administration". The Telegraph India online. 27 October 2011. Retrieved 30 December 2020.
- ↑ 3.0 3.1 "Khowai District Profile - 2016-2017" (PDF). Retrieved 30 December 2020.
- ↑ 4.0 4.1 "Tripura Gazette - Creation of New Khowai district" (PDF). Retrieved 30 December 2020.
- ↑ 5.0 5.1 "Khowai district website".
ఇతర లంకెలు
[మార్చు]- త్రిపురలోని ఖోవాయ్ జిల్లా అధికారిక వెబ్సైట్
- జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్ - పశ్చిమ త్రిపుర జిల్లా పార్ట్ ఎ (2011) - విభజనకు ముందు