రెండవ ఆంగ్లో-సిక్ఖు యుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెండవ ఆంగ్లో-సిక్ఖు యుద్ధం

పంజాబ్ భౌగోళిక పటం
తేదీ18 ఏప్రిల్1848 – 30 మార్చి1849
ప్రదేశంపంజాబ్
ఫలితంబ్రిటీష్ నిర్ణయాత్మక విజయం ఈస్టిండియా కంపెనీ  సిక్ఖు సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది.
ప్రత్యర్థులు
ఈస్టిండియా కంపెనీ సిక్ఖు సామ్రాజ్యం

రెండవ ఆంగ్లో-సిక్ఖు యుద్ధం అన్నది సిక్ఖు సామ్రాజ్యం, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీల నడుమ 1848 నుంచి 1849 మధ్యలో సాగిన సాయుధ సంఘర్షణ. దీని ఫలితంగా సిక్ఖు సామ్రాజ్యం పతనమై, ఈస్టిండియా కంపెనీ వాయువ్య సరిహద్దు ప్రావిన్సులో పంజాబ్ భాగమైంది.దివాన్ ముల్‌రాజ్ నుంచి అధికారం స్వీకరించడానికి వచ్చిన బొంబాయి రెజిమెంటుకు చెందిన సివిల్ సర్వెంట్ వాన్స్ ఆగ్న్యూను 1848 ఏప్రిల్ 19న అక్కడ హత్యచేశారు, వెంటనే సిక్ఖు దళాలు, సర్దారులు బహిరంగంగా తిరుగుబాటుకు దిగారు.[[బ్రిటీష్ ఈస్టిండియా జనరల్ డల్‌హౌసీ అంగీకరించాడు. ఈ తిరుగుబాటు వ్యాపిస్తుందనీ, కేవలం ముల్తాన్‌నే కాక మొత్తం పంజాబ్ ప్రాంతం అధీనంలోకి తీసుకురావడానికి తగ్గ ఆవశ్యకతను అది కల్పిస్తుందనీ డల్‌హౌసీ ఊహించాడు. దాంతో నిర్ణయం ప్రకారమే ఎదురుదాడిని ఆలస్యం చేశాడు. నవంబరులో పంజాబ్‌లో యుద్ధ కార్యకలాపాల కోసం అవసరమైన బలమైన సైన్యాన్ని సమాయత్తం చేసి, దాని పాటు తాను కూడా పంజాబ్ దిశగా కదిలాడు. హెర్బెర్ట్ ఎడ్వార్డ్స్ మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధంలో అద్భుతమైన విజయం, నవంబరులో రామ్‌నగర్‌లో, డిసెంబరులో సాదులాపూర్‌లో, 1849 జనవరి 13న చిలియన్‌వాలా యుద్ధంలోనూ గౌ నిర్ణయాత్మకం కాని విజయాలను సాధించినా ముల్తాన్‌లో గట్టి ప్రతిఘటన ప్రభుత్వం వైపు నుంచి భారీ ఎత్తున వనరులు అందించాల్సిన అవసరం చూపించింది. ఒక్కపట్టున జనవరి 22 నాటికి ముల్తాన్ కోటను జనరల్ విష్ పట్టుకుని, గుజరాత్‌లో పోరాడుతున్న గౌతో కలిసేందుకు వీలు చిక్కించుకున్నాడు. ఈస్టిండియా కంపెనీ సైన్యాలు పూర్తిస్థాయి విజయం గుజరాత్ యుద్ధంలో ఫిబ్రవరి 21న పొందాయి, సిక్ఖు సైన్యం రావల్పిండి వద్ద లొంగిపోయింది, సిక్ఖుల ఆఫ్ఘాన్ మిత్రులను భారతదేశం సరిహద్దుల అవతలికి బ్రిటీష్ వారు తరిమి కొట్టారు.

1849లో గుజరాత్ వద్ద విజయం తర్వాత లార్డ్ డల్‌హౌసీ పంజాబ్‌ను ఈస్టిండియా కంపెనీ పాలనలో కలుపుకున్నాడు. ఈ సేవకు గాను డల్‌హౌసీ బ్రిటీష్ పార్లమెంటు కృతజ్ఞతలు అందుకోవడంతో పాటు బ్రిటీష్ ప్రభువర్గపు మార్క్వెస్ అన్న ఉన్నత స్థానాన్ని పొందాడు.

ఆంగ్లో-సిక్ఖు యుద్ధాలు రెండు పక్షాల్లోనూ ఎదుటి పక్షపు పోరాట శక్తి పట్ల గౌరవం కలిగించాయి. 1947లో భారత స్వాతంత్రం వరకూ సిక్ఖులు 1857 సిపాయిల తిరుగుబాటులోనూ, అనేక ఇతర యుద్ధాల్లోనూ ఈస్టిండియా కంపెనీ, బ్రిటీష్ ప్రభుత్వం పక్షాన నమ్మకస్తులుగా పోరాడారు.

యుద్ధ నేపథ్యం[మార్చు]

19వ శతాబ్దపు తొలి నాళ్లలో భారత ఉపఖండపు వాయువ్యభాగంలో మహారాజా రంజిత్ సింగ్ సిక్ఖు సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ, స్థిరపరుస్తూ ఉన్నకాలానికల్లా తూర్పు భారతం (ప్లాసీ, బక్సర్ యుద్ధాలు), దక్షిణ భారతం (ఆంగ్లో-మైసూరు యుద్ధాలు), మధ్యభారతం (ఆంగ్లో-మరాఠా యుద్ధాలు)పై ఆధిపత్యాన్ని సాధించి పంజాబ్ సరిహద్దుల దాకా తమ పాలనను విస్తరించారు. రంజిత్ సింగ్ జాగ్రత్తతో కూడిన స్నేహాన్ని ఈస్టిండియా కంపెనీతో పాటించాడు. సట్లెజ్ నదికి దక్షిణాన ఉన్న కొన్ని ప్రాంతాలను బ్రిటీష్ వారికి ఇచ్చివేస్తూనే, బ్రిటీష్ వారి దురాక్రమణ ధోరణిని అడ్డుకునేందుకు, ఆఫ్ఘాన్లపై యుద్ధం ప్రారంభించేందుకు కూడా ఉపయోగపడేలా సైనిక శక్తిని నిర్మించడం ప్రారంభించాడు. అమెరికన్, యూరోపియన్ సైనికులను జీతాలకు పెట్టుకుని తమ సైన్యాన్ని ఫిరంగుల వాడకానికి శిక్షణ ఇప్పించుకునేవాడు, అంతేకాక హిందువులు, ముస్లిములను సైన్యభాగాల్లో చేర్చుకున్నాడు.

ఆఫ్ఘాన్లలోని అనైక్యతను ఆధారంగా చేసుకుని సిక్ఖులు పెషావర్, ముల్తాన్ ప్రావిన్సులు, పలు ఆఫ్ఘాన్ నగరాలను గెలిచి తమ పాలనలోని జమ్ము, కాశ్మీర్ రాజ్యాల్లో విలీనం చేశారు.

1839లో రంజిత్ సింగ్ మరణించాకా సిక్ఖు సామ్రాజ్యం అవ్యవస్థలోకి జారిపోసాగింది. కేంద్ర దర్బారులోకి పాలకులుగా ఒక్కొక్కరు రావడం పోవడం సాగుతూ వచ్చింది, దర్బారుకీ, సైన్యానికి మధ్య ఉద్రిక్తతలు పెరగసాగాయి. ఈస్టిండియా కంపెనీ తన సైనిక బలగాన్ని పంజాబ్ సరిహద్దుల్లో పెంచుతూపోసాగింది. ఈ క్రమంలో, బలహీనులైన, ద్రోహులుగా అనుమానించదగ్గ నాయకుల నడుమ ఉన్న సిక్ఖు సైన్యాన్ని ఉద్రిక్తతలు బ్రిటీష్ భూభాగం మీదికి దండెత్తేలా ప్రోత్సహించాయి.[1] చాలా గట్టి ప్రతిఘటనతో సమ‌వుజ్జీల నడము సాగిన యుద్ధంలా జరిగిన మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధంలో సిక్ఖు సైన్యం ఓటమి చెందింది.

మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధం తర్వాతి ఘటనలు[మార్చు]

యుద్ధానంతరం సిక్ఖు సామ్రాజ్యం కొన్ని విలువైన భూభాగాలు (జలంధర్ దోఅబ్) ఈస్టిండియా కంపెనీకి అప్పగించాల్సి రాగా, సిక్ఖు సామ్రాజ్యం నుంచి మొత్తం జమ్ము కాశ్మీర్‌ను జమ్ము పాలకుడు గులాబ్‌సింగ్ ఈస్టిండియా కంపెనీకి భారీ మొత్తాన్ని చెల్లించి స్వాధీనం చేసుకోవడానికి అంగీకరించాల్సివచ్చింది. గులాబ్ సింగ్ కోసం కాశ్మీరు రాష్ట్రపాలకుడి (గవర్నరు)ని తొలగించడానికి కాశ్మీరు ప్రయాణించేందుకు సిక్ఖు సైన్యంలోని కొంత భాగాన్ని నిర్బంధించారు.[2]

పసితనంలో ఉన్న మహారాజు దులీప్ సింగ్‌ సిక్ఖు సామ్రాజ్యపు సింహాసనంలో కొనసాగేందుకు బ్రిటీష్ వారు అంగీకరించారు కానీ ఒక బ్రిటీష్ రెసిడెంటు సర్ హెన్రీ లారెన్సు దర్బారు విధానాలను నియంత్రించేలా ఏర్పాటుచేశారు. దులీప్ సింగ్ తల్లి మహారాణీ జింద్ కౌర్ రాజ్యప్రతినిధిగా తనకున్న పూర్వపు అధికారంలో కొంత తిరిగి సాధించేందుకు అవిచ్ఛిన్నమైన ప్రయత్నాలు చేస్తూనే ఉండడంతో, లారెన్స్ ఆమెను ప్రవాసంలోకి పంపేశాడు. కొందరు సిక్ఖు సైన్యాధ్యక్షులు, ఆస్థానికులు ఆమెను రాజధాని నుంచి పంపేయడాన్ని స్వాగతించగా, ఇతరులు లారెన్సు పనికి ఆగ్రహించారు.[3]

సిక్ఖు సామ్రాజ్యంలోని ముస్లిం సంఖ్యాధిక్య ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన దోస్త్ మొహమ్మద్ ఖాన్‌తో సహకరించడం లేక అవ్యవస్థలోకి జారిపోయే ప్రమాదాలు పొంచివుండడంతో ఈ ప్రాంతంలో సిక్ఖు సైన్యంలోని కొంత భాగం ఉంచాల్సివచ్చేది. కేవలం సైన్యపు అస్తిత్వం మాత్రమే ఈ ప్రాంతాన్ని అణచివుంచగలిగేది. ఈ పనిలో భారీ సంఖ్యలో బ్రిటీష్ సైన్యం కానీ, బెంగాల్ సైన్యం కానీ ఉంచడం కోసం ఆర్థిక, మానవ వనరుల వినియోగించడానికి బ్రిటీష్ వారు అయిష్టత వ్యక్తం చేశారు. పైగా ఇందుకు విరుద్ధంగా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విన్సెంట్ హార్డింగ్ బెంగాల్ సైన్యాన్ని 50వేల మంది సైనికుల మేర తగ్గించి యుద్ధానంతరం ఆర్థికంగా పొదుపు చేయాలని చూశాడు. సిక్ఖు సైన్యంలోని సర్దార్లు సహజంగానే వారికన్నా జూనియర్లైన బ్రిటీష్ అధికారులు, పరిపాలకుల ఆజ్ఞల కింద పనిచేయడానికి అవమానంగా తలిచాడు.

1848 తొలినాళ్ళలో సర్ హెన్రీ లారెన్సు అనారోగ్య కారణాలతో సెలవుపై ఇంగ్లాండుకు వెళ్ళాడు. హెన్రీ లారెన్సు స్థానంలో అతని తమ్ముడు జాన్ లారెన్సును నియమిస్తారని అందరూ భావించినా, లార్డ్ డల్హౌసీ (తర్వాత లార్డ్ హార్డింగ్‌ గవర్నరు జనరల్ పదవి స్వీకరించాడు) ఫ్రెడిరిక్ కర్రీని నియమించాడు. కర్రీ కలకత్తా కేంద్రంగా పనిచేసిన లీగలిస్టు, పంజాబ్‌లోని సైనిక వ్యవహారాలు తెలియనివాడు.[4] While the Lawrences were comparatively informal and familiar with the junior officers who were Residents and Agents in the various districts of the Punjab, Currie was stiffer in manner and was inclined to treat his subordinates' reports with caution. In particular, he refused to act on reports from James Abbott, the Political Agent in Hazara, who was convinced that Sardar Chattar Singh Attariwalla, the Sikh Governor of Hazara, was actively plotting a rebellion with other Sirdars.

Notes[మార్చు]

  1. Hasrat, B. J. "ANGLO-SIKH WAR I (1845-46)". Punjabi University Patiala.
  2. Hernon 2002, p.575
  3. Hernon 2002, p.576
  4. Allen 2000, pp. 145–146