రెడ్డి హాస్టల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రెడ్డి హాస్టల్‌గా పేరుపొందిన హైదరాబాద్ రెడ్డి విద్యార్థి వసతిగృహం నిజాం పరిపాలనకాలం నాటి తెలంగాణలో విద్యారంగం, సాంస్కృతికరంగాలకు విలువైన సేవ చేసిన సంస్థ. హైదరాబాద్ నగర కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి రెడ్డిహాస్టల్‌ను తన వితరణతో ఏర్పాటుచేశారు.[1] ఈ సంస్థలో వసతిపొంది విద్యాభ్యాసం చేసిన పలువురు విద్యార్థులు తదనంతర కాలంలో రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, సంగీతాది రంగాల్లో సుప్రసిద్ధులైనారు. కులప్రాతిపదికన కేవలం రెడ్డి కులస్తులైన విద్యార్థులకే ఈ సంస్థ ద్వారా వసతి పొందే వీలుండేది. రెడ్డి హాస్టల్ సాంస్కృతిక కళాకేంద్రంగా కూడా విలసిల్లింది. రెడ్డి హాస్టల్లోనే పలు సాంస్కృతిక సంస్థలు ఊపిరిపోసుకున్నాయి.

చరిత్ర[మార్చు]

హైదరాబాద్ నగరానికి కొత్వాల్ (నేటి నగర పోలీస్ కమీషనర్ స్థాయి పదవి) గా పనిచేసిన రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి గొప్ప దాతగా, ప్రజాసంక్షేమానికి పాటుపడ్డ వ్యక్తిగా ప్రతిష్ఠ పొందారు.[2] తెలంగాణలోని రెడ్డి కులస్తులైన విద్యార్థులు చదువుకునేందుకు సహకారంగా ఉండాలని, ఆనాటి నైజాం రాష్ట్రంలో విద్యావికాసానికి ఉపకరిస్తుందని భూరివిరాళం ఇచ్చి రెడ్డి హాస్టల్‌ను ఏర్పాటుచేశారు.[1]

1917లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడిన మరుసటి సంవత్సరం (1918) రెడ్డి హాస్టల్ కు బీజం పడింది.

కార్యకలాపాలు[మార్చు]

రెడ్డిహాస్టల్లో పలు కార్యకలాపాలు చోటుచేసుకునేవి. సాంస్కృతిక సభలు, నాటకాలు, సంతాపసభలు, అభినందన సభలు వంటివి ఎన్నో నిర్వహించేవారు.

సాంస్కృతిక కార్యక్రమాలు[మార్చు]

పూర్వవిద్యార్థుల్లో ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 గుమ్మన్నగారి, బాలశ్రీనివాసమూర్తి (జూన్ 2014). ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ. హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. ISBN 978-9383652051.
  2. తెలుగు యువర్ స్టోరి. "శతవసంతాల చదువులమ్మ చెట్టునీడ రెడ్డి హాస్టల్". telugu.yourstory.com. TEAM YS TELUGU. Retrieved 9 March 2018.[permanent dead link]