రేగు తాండ్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేగు (జిజిఫస్ మారిషియాన) వర్షాభావ, పాక్షిక వర్షాభావ పరిస్థితులలో సాగు చేసే తక్కువగా ఉపయోగించబడే ముఖ్యమైన పండ్ల పంట. రేగు మంచి పోషకాలు ఉన్న పండు, దీనిలో విటమిన్ లైన బి ( తైమిన్, రైబోఫ్లావిన్, నియాసిన్), సీ, బేటా కేరోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఖనిజ లవణాలైన భాస్వరం, ఇనుము,కాల్షియమ్ లు కూడా ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. రేగు పండు నుంచి వచ్చే పదార్ధాలు ఎక్కువ మన్నిక, ధర కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో ఒక పదార్థం రేగు తాండ్ర.[1]

రేగు తాండ్ర తయారుచేయుట[మార్చు]

ఆరోగ్యమైన రేగు పండ్లను నీటితో పండ్ల చర్మం పైన ఉన్న మురికిని కడగాలి. రేగు కాయలకు ఉన్న కాండాన్ని చేతితో తీసివేయాలి. పదునైన కత్తితో తోలును ఒలిచివేయాలి. ఈ పద్ధతులు అన్ని జరిగేటప్పుడు పరిశుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. పండులో తినదగిన భాగాన్ని ముక్కలుగా కోసి, గింజలను తీసివేయాలి. రేగు పండ్ల ముక్కలను 0.2 % కే. ఎమ్. ఎస్ తో ప్రకాశవంతంగా, మంచి రంగు వచ్చేటట్లు తెలుపు చేయాలి. అవసరమైనంత పంచదార తీసికొని నీటిలో బాగా కలిపి పంచదార ద్రావణం (30,40,50,60 ౦ బీ) తయారు చేయాలి. పంచదార నీటిలో కరుగుటకు ద్రావణాన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడిఛేయాలి. ద్రావణం పరిశుభ్రత కొరకు వేడి చేసేటప్పుడు సిట్రిక్ ఆసిడ్ (0.2%) కలపాలి. తయారైన ద్రావణాన్ని మస్లిన్ గుడ్డతో వడపోసి గది ఉష్ణోగ్రత వద్ద చల్లబర్చాలి. ఒక వంతు రేగు పండ్ల ముక్కలు, రెండు వంతుల పంచదార ద్రావణం ఒక పాత్రలో కలిపి 48 గంటలు అనుకూల పరిస్థితులలో ఉంచాలి. 48 గంటల తరువాత ద్రావణాన్ని తీసివేసి రేగు ముక్కలను ఒకటొకటిగా ట్రేలో క్రమ పద్ధతిలో పెట్టాలి. తరువాత ట్రే డ్రైయర్ లో 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 5 నుంచి 6 గంటలు ఆరబెట్టాలి. ఆరిన పండు ముక్కలను ప్యాకింగ్ కు ముందు చల్లబరచాలి. రేగు తాండ్రలో పోషకాల మిశ్రమము తేమ, టీ. ఎస్. ఎస్, అస్కార్బిక్ ఆసిడ్, ఆమ్లత్వం, టోటల్ సుగర్, రెడ్యూసింగ్ సుగర్ లు 10.08%, 48 ౦ బీ, 95.97 ఎమ్. జీ. /100 గ్రాములు, ౦.225%, 21.65%, 9.67%. వరుసగా ఉంటాయి. తయారుచేసిన రేగు తాండ్ర పుష్టికరమైన తీపి పదార్థము. తాండాలలో రేగు తాండ్ర మంచి కృత్రిమమైన వాసన, సారం కలిగినది. ఇది పిల్లలకు, పెద్దలకు అరోగ్యకారమైన, మంచి పోష్‌కాలు ఇచ్చే ఒక తినుబండారం వంటిది.

వనరులు[మార్చు]

  1. జాలగూడు[permanent dead link]