రేష్మా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేష్మా
ఇతర పేర్లురేష్మన్
జననంc.1947
బికనీర్, రాజస్థాన్
మూలంకరాచీ, పాకిస్తాన్
మరణం3 నవంబరు 2013
లాహోర్, పాకిస్తాన్
సంగీత శైలిపంజాబీ జానపద సంగీతము
క్రియాశీల కాలంLate 1950s–2013

రేష్మా ఒక సుప్రసిద్ద పాకిస్తానీ జానపద గాయని.‘దమా దమ్ మస్త్ కలందర్’ వంటి పాటలతో శ్రోతలను ఉర్రూతలూగించిన విలక్షణ పాకిస్థాన్ జానపద గాయని .

నేపధ్యము[మార్చు]

రేష్మా 1947లో రాజస్థాన్‌లోని బికనీర్‌లో బంజారాల కుటుంబంలో జన్మించారు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం పాక్‌లోని కరాచీకి వలస వెళ్లింది. రేష్మా 12 ఏళ్ల వయసులో ‘షాబాజ్ కలందర్’ ప్రార్థనాస్థలం వద్ద పాడిన ‘లాల్ మేరీ’ పాట పెద్ద హిట్ అవడంతో జానపద గాయనిగా గుర్తింపు పొందారు. తర్వాత పాక్, భారత సినిమాల్లో పాటలు పాడారు. సుభాష్ ఘాయ్ నిర్మించిన హీరో సినిమాలో ఆమె పాడిన ‘లంబీ జుదాయీ’ గొప్ప హిట్లలో ఒకటిగా నిలిచింది. ‘దమా దమ్ మస్త్ కలందర్’పాటతో ఆమె తనదైన ముద్ర వేశారు. అప్పట్లో ఇందిరాగాంధీ కూడా రేష్మాను కలవడానికి ఆహ్వానం పంపారు. సరిహద్దులతో సంబంధం లేకుండా ఆమె జానపద గానమాధుర్యాన్ని ఉపఖండమంతా ఆస్వాదించారు. దీనిపై ఒకసారి ఆమె మాట్లాడుతూ.. భారత్‌లో తనపై ఆప్యాయత కురిపిస్తారని, పాక్‌లో తనను గౌరవిస్తారని కళాకారులకు సరిహద్దులతో సంబంధం లేదని చెప్పారు. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అప్పట్లో రేష్మాకు రూ. 10 లక్షల బ్యాంకు రుణం చెల్లింపునకు సహాయం చేయడమే కాకుండా.. నెలనెలా రూ.10 వేలు అందేలా చూశారు.

మరణం[మార్చు]

కొన్నేళ్ల నుంచి గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె 2013 నవంబరు 3ఆదివారం లాహోర్‌లో కన్నుమూశారు. నెల రోజులుగా కోమాలో ఉన్నారు. ఆమెకు కుమారుడు ఉమైర్, కుమార్తె ఖదీజా ఉన్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=రేష్మా&oldid=3930921" నుండి వెలికితీశారు