రోనీ గ్రీవ్‌సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోనీ గ్రీవ్‌సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోనాల్డ్ యుస్టేస్ గ్రీవ్‌సన్
పుట్టిన తేదీ(1909-08-24)1909 ఆగస్టు 24
జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
మరణించిన తేదీ1998 జూలై 24(1998-07-24) (వయసు 88)
జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1939 18 February - England తో
చివరి టెస్టు1939 3 March - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 2 30
చేసిన పరుగులు 114 1130
బ్యాటింగు సగటు 57.00 33.23
100లు/50లు 0/1 1/7
అత్యధిక స్కోరు 75 107*
క్యాచ్‌లు/స్టంపింగులు 7/3 25/11
మూలం: Cricinfo, 2022 15 November

రోనాల్డ్ యుస్టేస్ గ్రీవ్‌సన్ (1909, ఆగస్టు 24 – 1998, జూలై 24) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. 1938-39లో రెండు టెస్టులు ఆడాడు.[1]

జననం, విద్య

[మార్చు]

రోనాల్డ్ యుస్టేస్ గ్రీవ్‌సన్ 1909, ఆగస్టు 24న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించాడు. 1922లో పార్క్‌టౌన్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివాడు. ఆ తర్వాత 1923 నుండి 1926 వరకు జోహన్నెస్‌బర్గ్‌లోని సెయింట్ జాన్స్ కళాశాలలో చదివాడు, అక్కడ మెట్రిక్యులేట్ చేసాడు .

కెరీర్

[మార్చు]

క్రికెటర్‌గా, గ్రీవ్‌సన్ కుడిచేతి వాటం మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, వికెట్ కీపర్ గా ఆడాడు. అయితే ట్రాన్స్‌వాల్‌కి ఎల్లప్పుడూ వికెట్ కీపింగ్ చేయలేదు. గ్రీవ్‌సన్ 1929-30లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తర్వాతి డజను సీజన్లలో అడపాదడపా ట్రాన్స్‌వాల్ కోసం ఆడాడు. 1933-34లో గ్రిక్వాలాండ్ వెస్ట్‌పై అజేయంగా 107 పరుగులతో తన ఏకైక సెంచరీ చేశాడు.[2]

1938-39 సీజన్‌లో, ఇంగ్లాండ్ టూరింగ్ టీమ్ నాల్గవ టెస్టుకు వికెట్ కీపర్‌గా గ్రీవ్‌సన్ ఎంపికయ్యాడు.[3] [4] ఈ సిరీస్‌లోని ఐదవ (చివరి) టెస్టులో గ్రీవ్‌సన్ రెండు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లలో 75, 39 పరుగులు చేశాడు. ఆ 75 పరుగులు అనేవి ఒక టెస్ట్ మ్యాచ్‌లో అప్పటివరకు ఏ టెస్టు ఆడే దేశం నుండి వికెట్ కీపర్ చేసిన అత్యధిక అరంగేట్రం స్కోరుగా నిలిచింది. రెండు క్యాచ్‌లు, మూడు స్టంపింగ్‌లు చేసాడు. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 654 పరుగుల వద్ద కేవలం ఎనిమిది బైలు మాత్రమే ఇచ్చాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Ronnie Grieveson". www.cricketarchive.com. Retrieved 2012-01-17.
  2. "Scorecard: Transvaal v Griqualand West". www.cricketarchive.com. 1933-12-26. Retrieved 2012-01-23.
  3. "M. C. C. in South Africa, 1938-1939". Wisden Cricketers' Almanack (1940 ed.). Wisden. p. 738.
  4. "Scorecard: South Africa v England". www.cricketarchive.com. 1939-02-18. Retrieved 2012-01-23.
  5. "M. C. C. in South Africa, 1938-1939". Wisden Cricketers' Almanack (1940 ed.). Wisden. p. 741.

బాహ్య లింకులు

[మార్చు]