రోషెల్ రావ్
:
రోషెల్ రావ్ | |
---|---|
జననం | రోషెల్ రావ్ 1988 నవంబరు 25[1] చెన్నై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి |
|
పూర్వ విద్యార్థి | ఎమ్.ఒ.పి. వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్[2] |
ఎత్తు | 5 అ. 5 అం. (1.65 మీ.)[3] |
భార్య/భర్త | |
బంధువులు | పలోమా రావ్ (సోదరి) |
రోషెల్ రావ్ (ఆంగ్లం: Rochelle Rao; జననం 1988 నవంబరు 25) ఒక భారతీయ నటి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె 2012లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని పొందింది. మిస్ ఇంటర్నేషనల్ 2012లో భారతదేశానికి ఆమె ప్రాతినిధ్యం వహించింది. ఆమె రియాలిటీ షోలలో ఝలక్ దిఖ్లా జా 6, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 5, బిగ్ బాస్ 9, నాచ్ బలియే 9లలో పోటీదారు. కపిల్ శర్మ షోలో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించింది.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]రోషెల్ రావ్ 1988 నవంబరు 25న చెన్నైలో జన్మించింది. తెలుగు-జర్మన్ వంశానికి చెందిన ఆమె తండ్రి నికోలస్ వి రావు ప్రకృతి శాస్త్రవేత్త అయితే ఆమె తల్లి వెండీ రావ్ ఆంగ్లో-ఇండియన్.[4] ఆమె సోదరి పలోమా రావ్ కూడా నటి.
ఆమె చెన్నైలోని ఎం.ఒ.పి. వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి ఎలక్ట్రానిక్ మీడియాలో బీఎస్సీ పట్టా పుచ్చుకుంది.
ఫెమినా మిస్ ఇండియా
[మార్చు]రోషెల్ రావ్ జనవరి 2012లో ఐదవ పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా సౌత్ పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఆమె టైటిల్‌ను శమత అంచన్‌తో కోల్పోయింది.[5] ఆమె తరువాత ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొంది. ఆమె ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2012 విజేతగా నిలిచింది. ఆమె "మిస్ గ్లామరస్ దివా", "మిస్ ర్యాంప్ వాక్", "మిస్ బాడీ బ్యూటిఫుల్" ఇలా ఆమె మూడు ఉపశీర్షికలను కూడా గెలుచుకుంది. ఆమె అక్టోబరు 2012లో జపాన్ లోని ఒకినావాలో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2012 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, అక్కడ ఆమె 68 దేశాలలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.[6]
సంవత్సరం | టైటిల్ | పాత్ర | ఫలితం |
---|---|---|---|
2012 | మిస్ ఇండియా సౌత్ | పోటీదారు | 1వ రన్నరప్ |
ఫెమినా మిస్ ఇండియా | విజేత | ||
మిస్ ఇంటర్నేషనల్ 2012 | టాప్ 15 సెమీ ఫైనలిస్ట్ |
కెరీర్
[మార్చు]ఆమె ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2012 కిరీటాన్ని గెలుచుకుంది.[7] దీనికి ముందు ఆమె చెన్నైలో మోడల్, టెలివిజన్ యాంకర్. అవుట్‌గోయింగ్ టైటిల్‌హోల్డర్ అంకితా షోరే ఆమెకి కిరీటాన్ని అందించింది.
ఆ తర్వాత ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరో సీజన్‌కు హోస్ట్‌గా మారింది.[8] ముంబైలో నివసిస్తున్న ఆమె వివిధ ఈవెంట్‌లు, టీవీ షోలకు యాంకరింగ్ చేసింది. ఆమె అనేక పురుషుల మ్యాగజైన్‌లలో కూడా కనిపించింది.[9][10]
ఆమె కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌లోని ఫిబ్రవరి 2014 పేజీలో ప్రదర్శించబడింది.[11]
ఆగస్టు 2013లో, ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కలర్స్‌లో ప్రసారమైన ఝలక్ దిఖ్లా జా సీజన్ 6లో కనిపించింది. ఆమె 2014లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ షో సీజన్ 5లో కూడా పోటీపడింది. రోహిత్ శెట్టి హోస్ట్ చేసిన షో నుండి ఎలిమినేట్ అయిన రెండవ పోటీదారు ఆమె. 2014 చివరలో ఆమె ఫాక్స్ లైఫ్‌లో లైఫ్ మే ఏక్ బార్ అనే సాహసోపేతమైన ట్రావెల్ షోలో ఎవలిన్ శర్మ, పియా త్రివేది, మహేక్ చాహల్‌లతో కలిసి పాల్గొన్నది.[12]
2015లో, రోషెల్ రావ్ బాయ్‌ఫ్రెండ్ కీత్ సెక్వేరాతో కలిసి భారతీయ రియాలిటీ టీవీ సిరీస్, బిగ్ బాస్ 9లో పోటీదారుగా మారారు. ఆమె ప్రిన్స్ నరులాతో జతకట్టింది కానీ తర్వాత రిమీ సేన్‌తో మారింది.[13][14][15]
ఆమె ఆగస్టు 2022 ఇండియాస్ లాఫ్టర్ ఛాంపియన్ షోను విజయవంతంగా నిర్వహించింది.[16]
ఆమె సోనీ టీవీలో ఏప్రిల్ 2016లో ప్రారంభమైన కామెడీ షో ది కపిల్ శర్మ షోలో వివిధ పాత్రలు పోషించింది.[17]
ఆమె చివరిగా 1962: ది వార్ ఇన్ ది హిల్స్‌లో రింపగా కనిపించింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]టెలివిజన్
[మార్చు]Year | Title | Role | Notes | Ref. |
---|---|---|---|---|
2001 | ఝలక్ దిఖ్లా జా 6 | పోటీదారు | ఎంపిక కాలేదు | |
లైఫ్ మే ఏక్ బార్ | ||||
2014 | ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 5 | 16వ స్థానం (3వ వారంలో తొలగించబడింది) | ||
2015–2016 | బిగ్ బాస్ 9 | 3వ రన్నరప్ | [18] | |
2016–ప్రస్తుతం | ది కపిల్ శర్మ షో | నర్స్ లాటరీ | సీజన్ 1 | |
చింగారి | సీజన్ 2 | [19] | ||
మిస్టర్ దామోదర్ అసిస్టెంట్ | సీజన్ 3 | |||
2019 | నాచ్ బలియే 9 | పోటీదారు | 14వ స్థానం | |
2022 | ఇండియాస్ లాఫర్ ఛాంపియన్ | హోస్ట్ | సీజన్ 1 |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | టైటిల్ | పాత్ర |
---|---|---|
2021 | 1962: ది వార్ ఇన్ ది హిల్స్ | రింప |
మూలాలు
[మార్చు]- ↑ Team Rochelle Rao on Twitter: "@RochelleRaoFC 25 th november.. I'm a Sagittarius and this year is special as I turned 25 on the 25th!". Twitter.com (22 March 2014). Retrieved on 2015-10-23.
- ↑ "Rochelle Maria Rao: Lesser known facts ". The Times of India. 22 January 2016. Archived from the original on 18 ఏప్రిల్ 2019. Retrieved 13 June 2016.
- ↑ Rochelle Maria Rao – Profile Archived 2014-02-25 at the Wayback Machine. Beautypageants.indiatimes.com (10 February 2012). Retrieved on 2015-10-23.
- ↑ @rochellemrao (April 20, 2013). "Dad-german\Telegu Mom-Anglo Indian!born&lived in Chennai&moved2Mumbai last year post winnin Miss India International" (Tweet) – via Twitter.
- ↑ B'lore girl Shamata is Femina Miss India South – The Times of India. Articles.timesofindia.indiatimes.com (23 December 2011). Retrieved on 2015-10-23.
- ↑ "All eyes on Rochelle Maria Rao". Archived from the original on 4 April 2013. Retrieved 1 October 2012.
- ↑ Miss India – Miss Diva – World Pageants – Indiatimes.com Archived 15 మే 2013 at the Wayback Machine. Feminamissindia.indiatimes.com. Retrieved on 23 October 2015.
- ↑ "Miss India International Rochelle Maria Rao and Bigg Boss 6 hottie Karishma Kotak to glam up IPL 6". Retrieved 29 March 2013.
- ↑ Men's magazine 1 Archived 30 ఏప్రిల్ 2015 at the Wayback Machine. Gqindia.com (22 February 1999). Retrieved on 2015-10-23.
- ↑ Men's magazine 2 Archived 26 అక్టోబరు 2015 at the Wayback Machine. Gqindia.com (22 February 1999). Retrieved on 2015-10-23.
- ↑ "Rochelle Rao - Kingfisher Calendar Girl". Archived from the original on 4 March 2016. Retrieved 12 October 2015.
- ↑ "Rochelle Maria Rao eliminated from Khatron Ke Khiladi". The Times of India.
- ↑ "Bigg Boss 9 Contestant No 9: Rochelle Maria Rao, beauty with brains, to set BB on fire!". 11 October 2015. Retrieved 12 October 2015.
- ↑ "Want to connect with Hindi audience with 'Bigg Boss': Rochelle Rao". 13 October 2015. Retrieved 13 October 2015.
- ↑ "Rishabh deserved to win, he never stopped entertaining us: Rochelle Rao". Retrieved 27 January 2016.
- ↑ India's Laughter Champion
- ↑ "After Bigg Boss 9, Rochelle Rao turns comedian with The Kapil Sharma Show?". Retrieved 1 April 2016.
- ↑ "Bigg Boss 9 Contestant No 9: Rochelle Maria Rao, beauty with brains, to set BB on fire!". 11 October 2015. Retrieved 12 October 2015.
- ↑ Farzeen, Sana (29 December 2018). "Rochelle Rao on The Kapil Sharma Show: The audience expects a lot from us". The Indian Express.
- 1988 జననాలు
- బిగ్ బాస్ హిందీ టీవీ సిరీస్ పోటీదారులు
- భారత గేమ్ షోలలో పోటీదారులు
- భారతీయ రియాలిటీ టెలివిజన్ సిరీస్‌లో పాల్గొనేవారు
- ఫెమినా మిస్ ఇండియా విజేతలు
- మిస్ ఇంటర్నేషనల్ 2012 ప్రతినిధులు
- జర్మన్ సంతతికి చెందిన భారతీయ ప్రజలు
- భారతదేశం నుండి అందాల పోటీ పోటీదారులు
- ఆంగ్లో-ఇండియన్ ప్రజలు
- భారతీయ సినిమా నటీమణులు
- భారతీయ టెలివిజన్ నటీమణులు