రోహింగ్యా ప్రజలు

వికీపీడియా నుండి
(రోహింగ్యా శరణార్థులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రోహింగ్యా ప్రజలు / Rohingya people
Ruáingga ရိုဟင်ဂျာ ﺭُﺍَࣺﻳﻨڠَ
Total population
1,547,778[1]–2,000,000+[2]
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
మయన్మార్ (రఖైన్ రాష్ట్రం), బంగ్లాదేశ్, భారతదేశం, ఇండోనేషియా, మలేషియా, నేపాల్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, థాయిలాండ్
 Myanmar1.0[3]–1.3 million[4][5][6]
 Bangladesh500,000[7] [8]
 Pakistan200,000[9][10][11]
 Thailand100,000[12]
 Malaysia40,070[13]
 India40,000[14][15]
 USA12,000+[16]
 Indonesia11,941[17]
 Nepal200[18]
భాషలు
రోహింగ్యా భాష
మతం
ఇస్లాం, హిందూ మతం

రోహింగ్యా ప్రజలు లేదా రోహింగ్యా శరణార్థులు లేదా రోహింగ్యా ముస్లింలు .(/ˈrɪnə/, /ˈrhɪnə/, /ˈrɪŋjə/, or /ˈrhɪŋjə/; లేదా అరకాన్ ఇండియన్స్ '[19] అనువారు మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన ప్రజలు. వీరికి ఏ దేశపు పౌరసత్వం లేదు.[20] కావున వీరిని శరణార్థులు గా పరిగణిస్తున్నారు.

నేపధ్యము

[మార్చు]

ముస్లింలలో ప్రత్యేక తెగకు చెందిన సుమారు 10లక్షలమంది రోహింగ్యాలు తరతరాలుగా మయన్మార్‌లో నివసిస్తున్నారు. కానీ, 1982లో మయన్మార్‌ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంలో 135 స్థానిక జాతులలో ఒకటిగా రోహింగ్యాలను గుర్తించలేదు.ఆ దేశం వారిని తమ పౌరులుగా గుర్తించలేదు. రోహింగ్యా బెంగాలీ పదమని, వారంతా బంగ్లాదేశ్‌ నుంచి తమ దేశానికి(అక్రమంగా) వచ్చారని మయన్మార్‌ వాదిస్తోంది. తమ దేశం నుంచి వెళ్లిపోయేలా ‘పొగ’ పెడుతోంది. హింసను భరించలేక రోహింగ్యాలు ప్రాణాలకు తెగించి మరీ వలస వెళుతున్నారు. సముద్రంలో నాటు పడవల్లో ప్రయాణిస్తూ బంగ్లాదేశ్‌తోపాటు థాయ్‌లాండ్‌, మలేసియా తదితర దేశాలకు చేరుకుంటున్నారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్‌ సూకీ పార్టీ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినా వారి పరిస్థితి మారకపోగా కష్టాలు మరింత పెరిగాయి. రోహింగ్యాల అణచివేత వార్తలు మీడియాలో రాకుండా ‘సెన్సార్‌’ మొదలైంది. బీబీసీ బర్మా చానల్‌ దీనిపై బహిరంగంగా నిరసన ప్రకటించింది.[21][22].మయన్మార్‌లో రోహింగ్యా పదాన్ని నిషిద్ధంగా భావిస్తారు.

హక్కుల కోసం పోరాటం

[మార్చు]

అరాకన్‌ రోహింగ్యాల విముక్తి సేన (అర్సా) పేరుతో 2016లో ఒక దళం ఏర్పడింది. రోహింగ్యాల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టింది. దీనిని తీవ్రవాద సంస్థగా పరిగణించిన మయన్మార్‌ ప్రభుత్వము రోహింగ్యాలపై అణచివేతను ముమ్మరం చేసింది. దాడులతో సైన్యం వారిపై విరుచుకుపడింది. ఈ క్రమంలో రఖైన్‌లో ఉండలేక బంగ్లాదేశ్‌లోకి, ఇతర దేశాలలోకి రోహింగ్యాల వలసలు భారీగా పెరిగిపోయాయి.

ఐక్యరాజ్యసమితి ఖండన

[మార్చు]

మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడిని జాతుల శుద్దీకరణగా ఐక్యరాజ్య సమితి 2017 సెప్టెంబరు 12 న జరిగిన సర్వసభ్య సమావేశంలో అభిప్రాయ పడింది. రోహింగ్యాలపై మయన్మార్‌లో జరుగుతును దాడులపై ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఒక జాతిపై కక్ష్యగట్టినట్టు జరుగుతున్న దాడులకు అందరూ సిగ్గుపడాలని సమితి మానవ హక్కుక ముఖ్య అధికారి జైదీ ఆల్‌ హసన్‌ అన్నారు. మయన్మార్‌లో యధేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన అన్నారు.[23] [24]

మూలాలు

[మార్చు]
  1. Mahmood; Wroe; Fuller; Leaning (2016). "The Rohingya people of Myanmar: health, human rights, and identity" (fee required). Lancet: 1–10. doi:10.1016/S0140-6736(16)00646-2. PMID 27916235.
  2. David Mathieson (2009). Perilous Plight: Burma's Rohingya Take to the Seas. Human Rights Watch. p. 3. ISBN 9781564324856.
  3. Kevin Ponniah (5 December 2016). "Who will help Myanmar's Rohingya?". BBC.
  4. "Will anyone help the Rohingya people?". BBC News.
  5. Dapice, David (June 2015). "Fatal Distraction from Federalism: Religious Conflict in Rakhine" (PDF). Harvard Ash Center.
  6. "Who Are the Rohingya?". About Education. 2014. Archived from the original on 18 November 2012. Retrieved 8 March 2015.
  7. "Japan gives $2 million in emergency aid for Myanmar refugees in Bangladesh - bdnews24.com". bdnews24.com.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-01. Retrieved 2017-09-05.
  9. "Homeless In Karachi | Owais Tohid, Arshad Mahmud". Outlookindia.com. 29 November 1995. Retrieved 18 October 2013.
  10. "Box 5925 Annapolis, MD 21403 info@srintl". Burmalibrary.org. Archived from the original on 11 సెప్టెంబరు 2011. Retrieved 18 October 2013.
  11. Derek Henry Flood (31 December 1969). "From South to South: Refugees as Migrants: The Rohingya in Pakistan". Huffington Post. Retrieved 11 February 2015.
  12. Husain, Irfan (30 July 2012). "Karma and killings in Myanmar". Dawn (newspaper). Retrieved 10 August 2012.
  13. "Figure At A Glance". Malaysia and the United Nations. 2014. Archived from the original on 30 డిసెంబరు 2014. Retrieved 5 సెప్టెంబరు 2017.
  14. "India in talks with Myanmar, Bangladesh to deport 40,000 Rohingya". Reuters. 2017. Retrieved 17 August 2017.
  15. "India plans to deport thousands of Rohingya refugees". www.aljazeera.com. Retrieved 17 August 2017.
  16. Timothy Mclaughlin (20 September 2016). "Myanmar refugees, including Muslim Rohingya, outpace Syrian arrivals in U.S." Reuters. Retrieved 3 September 2017.{{cite web}}: CS1 maint: url-status (link)
  17. Jalimin (19 May 2015). "Jumlah Pengungsi Rohingya di Indonesia Capai 11.941 Orang" (in Indonesian). Aceh Tribun News. Archived from the original on 11 అక్టోబరు 2015. Retrieved 5 సెప్టెంబరు 2017.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  18. "200 Rohingya Refugees are not being accepted as Refugees and the Nepali Government considers them illegal migrants". Archived from the original on 4 జూన్ 2016. Retrieved 5 సెప్టెంబరు 2017. An estimated 36,000 Rohingya Refugess living in India
  19. Colin Clarke; Ceri Peach; Steven Vertovec (26 October 1990). South Asians Overseas: Migration and Ethnicity. Cambridge University Press. p. 46. ISBN 978-0-521-37543-6.
  20. "Will anyone help the Rohingya people?". 10 June 2015 – via www.bbc.com.
  21. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-04. Retrieved 2017-09-05.
  22. http://www.thedailystar.net/backpage/rohingya-censorship-bbc-burma-pulls-out-myanmar-tv-deal-1457749
  23. https://www.theguardian.com/world/2017/sep/11/un-myanmars-treatment-of-rohingya-textbook-example-of-ethnic-cleansing
  24. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-11. Retrieved 2017-09-11.

బయటి లంకెలు

[మార్చు]