రౌతు సూర్యప్రకాశ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రౌతు సూర్యప్రకాశరావు
రౌతు సూర్యప్రకాశ రావు


శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2014
నియోజకవర్గం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 18 జూన్ 1958
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రౌతు తాతాలు, పార్వతమ్మ
జీవిత భాగస్వామి సౌభాగ్యలక్ష్మి
సంతానం వరుణ్‌బాబు, సౌజన్య

రౌతు సూర్యప్రకాశ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004 నుండి 2014 వరకు రాజమండ్రి ఎమ్మెల్యేగా పని చేశాడు.[1]


జననం, విద్యాభాస్యం[మార్చు]

రౌతు సూర్యప్రకాశ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలో 18 జూన్ 1958లో రౌతు తాతాలు, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన రాజమండ్రి లోని జి.ఎస్.కె.ఎం లా కళాశాల నుండి న్యాయవిద్య పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

రౌతు సూర్యప్రకాశ రావు విధ్యర్హి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి స్డూడెంట్స్‌ యూనియన్‌ లీడర్‌గా, ఆంధ్రకేసరి యువజన సమితిలో పలు పదవులు నిర్వర్తించి, కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2004 - 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేశాడు. సూర్యప్రకాశ రావు 11 మార్చి 2014లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] ఆయన 2019లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయాడు.

రౌతు సూర్యప్రకాశ రావు రాజకీయాల్లో ఉంటూనే చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా, కోస్తా జిల్లాల వర్తక సంఘం అధ్యక్షుడిగా 1989 నుండి 1999 వరకు, ఎపెక్స్‌ క్లబ్‌ ఛైర్మన్‌గా 1987 నుండి 1988 వరకు, జిల్లా ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా 1990 నుండి 2004 వరకు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా 2011 నుండి 2012 వరకు, స్టేట్‌ ఎస్యూరెన్స్‌ కమిటీ చైర్మన్‌ ( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌), గోదావరి స్విమ్మర్స్‌ క్లబ్‌ గౌరవాధ్యక్షుడిగా పని చేశాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  2. Sakshi (12 March 2014). "వైఎస్సార్ సీపీలో చేరిన ఎమ్మెల్యే రౌతు". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.