లక్ష్మీ సెహగల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మీ సెహగల్
లక్ష్మీ సెహగల్
జననం(1914-10-24)1914 అక్టోబరు 24
మరణం2012 జూలై 23(2012-07-23) (వయసు 97)
ఇతర పేర్లుకెప్టెన్ లక్ష్మీ సెహగల్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్రోద్యమం
జీవిత భాగస్వామిపికెఎన్ రావ్ ( - 1940)
ప్రేమ్ సెహగల్ (1947-చనిపోయేవరకు)
పిల్లలుసుభాషిణి ఆలీ

కెప్టెన్ లక్ష్మీ సెహగల్ (జ: అక్టోబర్ 24, 1914) ప్రముఖ సంఘసేవకురాలు, రాజ్యసభ సభ్యురాలు. ఈమె భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తొలి మహిళ.ఈమె తండ్రి స్వామినాథన్ మద్రాసులో ప్రముఖ న్యాయవాది. తల్లి ఎ.వి.అమ్ము కుట్టి సామాజిక సేవా కార్యకర్త. చిన్నతనంలోనే సెహగల్ విదేశీ వస్తు బహిష్కరణ, మధ్యనిషేధం వంటి జాతీయ పోరాటాలలో పాల్గొన్నారు.1938 లో మద్రాసు వైద్య కళాశాలలో ఎం.బి., బి.ఎస్. గైనకాలజీ పూర్తయిన తరువాత 1940లో సింగపూర్ వెళ్ళి, అక్కడ భారతీయ నిరుపేదల వాడలో వైద్యశాల స్థాపించి, స్థానికంగా ఉన్న భారతీయ కార్మికులకు సేవలందించారు. అక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్ర్యోద్యమంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ ’ మహిళాదళాల్లో చేరి, క్యాప్టెన్ హోదా పొంది, డాక్టర్‌గా వైద్యసేవలు కూడా అందచేశారు.ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆధ్వర్యంలోని ఝాన్సీ రెజిమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు.లక్ష్మీ సెహగల్ 1947లో లాహోర్ కు చెందిన కర్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ ను లాహోర్‌లో వివాహం చేసుకొని కాన్పూర్ లో స్థిరపడి కాన్పూర్ ప్రజలకు వైద్యసేవలందించారు.స్వాతంత్ర్యానంతరం ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోషియేషన్ (ఐద్వా) ఉపాధ్యక్షురాలిగా వివిధ స్థాయిలలో సమాజ సేవకు అంకితమయ్యారు.1971లో, సీపీఎం తరఫున లక్ష్మీ సెహ్‌గల్ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1998లో ఈమెకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేయబడింది.2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె వామపక్షాల మద్దతుతో బరిలోకి దిగారు. (ఆ ఎన్నికల్లో అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.) 97 సంవత్సరాల వయసులో లక్ష్మీ సెహ్‌గల్ 2012, జూలై 23న కాన్పూర్‌లో మరణించారు.

బయటి లింకులు[మార్చు]