లలితాంబిక అంతర్జనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లలితాంబిక అంతర్జనం
దస్త్రం:Lalithambika Antherjanam.jpg
పుట్టిన తేదీ, స్థలం(1909-03-30)1909 మార్చి 30
Kottavattom,
మరణం1987 ఫిబ్రవరి 6(1987-02-06) (వయసు 77)
Njaliyakuzhi, కొట్టాయం జిల్లా, కేరళ , భారత దేశం
వృత్తిరచయిత్రి, సంఘ సంస్కర్త
భాషమలయాళం
గుర్తింపునిచ్చిన రచనలుAgnisakshi (నవల)
పురస్కారాలు
జీవిత భాగస్వామినారయన్ నంబూద్రి
సంతానంBhaskara Kumar, N. Mohanan, Leela, Shantha, Rajam, Mani, Rajendran
బంధువులు
 • Damodaran Namboothiri (father)
 • Aryadevi Antharjanam (mother)

లలితాంబిక అంతర్జనం (మార్చి 30, 1909 - ఫిబ్రవరి 6, 1987) మలయాళ భాషలో ఆమె సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ రచయిత్రి,, సంఘ సంస్కర్త. ఆమె భారత స్వాతంత్ర్యోద్యమం, (నంబూద్రి )సమాజంలోని సామాజిక సంస్కరణ ఉద్యమాలచే ప్రభావితమైంది, ఆమె రచన సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగా స్త్రీల పాత్ర పట్ల సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తుంది.[1] ఆమె ప్రచురించిన రచనలో చిన్న కథలు, కవితలు, బాలల సాహిత్యం, ఒక నవల,అగ్నిసాక్షి ఉన్నాయి. అగ్నిసాక్షి నవల కు 1977లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి.ఆమె ఆత్మకథ ఆత్మకథాయ్‌క్కు ఒరు ఆముఖం (ఆత్మకథకు ఒక పరిచయం) కూడా మలయాళ సాహిత్యంలో ఒక ముఖ్యమైన రచనగా పరిగణించబడుతుంది.

ఆమె ఇతర రచనలు

[మార్చు]

ఆమె ఇతర రచనలు ఆద్యతే కథలు (తొలి కథలు), తకర్ణ తలమురా (శిధిలమైన తరం), కిలివాటిలిలూడే (పావురం రంధ్రం ద్వారా), కొడుంకట్టిల్ నిన్ను (ఒక సుడిగాలి నుండి), మూడుపడతిల్ (వెయిల్ వెనుక), అగ్ని పుష్పంగళ్ (అగ్ని పువ్వులు), సీత ముతల్ సత్యవతి వారే ' (సీత నుండి సత్యవతి వరకు).

జీవిత చరిత్ర

[మార్చు]

లలితాంబిక అంతర్జనం పేరులో ఇంటి పేరు అంతర్జనం అంటే 'తన జీవితాన్ని లోపల గడిపే ఆమె'అని అర్థం.ఆమె మొదటి పేరు 'లలిత' అనగా సరళమైన,అని ,, 'అంబికా' అనగా ,దేవత పేరు.

పుట్టుక

[మార్చు]

మార్చి 30, 1909న, దక్షిణ భారతదేశంలోని కేరళలోని పునలూర్ కొల్లం జిల్లా సమీపంలోని కొట్టవట్టంలో, ఆమె జననం. కొట్టవట్టత్తు ఇల్లత్తు దామోదరన్ నంబూతిరి, చంగరప్పిల్లి మనయాక్కల్ ఆర్యదేవి అంతర్జనమ్ దంపతులు ఆమె తల్లిదండ్రులు ,వీరిది సంప్రదాయవాద కుటుంబం.[2]

విద్య

[మార్చు]

ఆమెకు ప్రాధమిక సాంప్రదాయ విద్య మాత్రమే అభ్యసించినది . అయినప్పటికీ, ఆమె తండ్రి ఒక ప్రైవేట్ ట్యూటర్‌ని నియమించాడు,ఆ సమయంలో అది అసాధారణమైనది.[3] ఆమె కేరళలోని అత్యంత శక్తివంతమైన భూస్వామ్య బ్రాహ్మణ కులంలో భాగమైనప్పటికీ, లలితాంబిక యొక్క జీవిత-పని నంబూద్రి సమాజంలో స్త్రీపై పురుషులు ప్రవర్తించే కపటత్వం, హింస, అన్యాయాన్ని బహిర్గతం చేయడం, ఆ దుష్ట సంప్రదాయాన్నివిచ్ఛిన్నం చేయడం అయ్యింది. ఆమె పాఠశాలలో చదువుకోవడానికి అనుమతించబడలేదు, అప్పటి వర్తమాన వ్యవహారాల గురించి ఆమెకు ,అమె యందు దయ గల మగ బంధువుల ద్వారా మాత్రమే బయటి ప్రపంచం గురించి సమాచారాన్నితెలిసేది.ఆమెకు అప్పుడు దేశంలో కొనసాగుతున్న భారత స్వాతంత్య్ర ఉద్యమం గురించి కొంచెం సమాచారం తెలిసింది.భారత స్వాతంత్య్ర ఉద్యమం పాల్గొనాలనే కోరిక ఆమెలో ఏర్పడినది .

వివాహజీవితం

[మార్చు]

ఆమె రైతు నారాయణన్ నంబూద్రీ తో పెద్దలు నిశ్చయించిన,నిర్దేశించిన పద్ధతిలో వివాహం చేసుకుంది.[4]

వివాహనంతర జీవితం -రచనలు

[మార్చు]

ఒక రైతుభార్యగా, ఆమె ఇప్పుడు బయటి ప్రపంచంతో అన్ని సంబంధాలను కోల్పోయింది. ఆమె రో జువారి దినచర్య దినమంతా పొగతో నిండిన వంటగది,, తడిగా మూసివున్న ప్రాంగణాలలో కఠిన మైన శారీరక శ్రమ తో కూడి వుండేది.చిల్లర గృహ రాజకీయాలు, అదేవిధంగా ఖైదు చేయ బడిన ఇతర మహిళల భయాలు,, అసూయలతో కూడిన క్లాస్ట్రోఫోబిక్(పరిమిత చిన్న మూసి వున్న గదు ల్లో వుండటం మనుసుల్లో కలిగే భయం,చీకాకు)భావనతో ఉండేది.కానీ ఆమె తనతోటి ఇతర మహిళల ధైర్యం, వారి జీవితాల్లో అసహజ పరిస్థితులు ఉన్నప్పటికీ మనిషిగా ఉండాలనే వారి సంకల్పాన్ని కూడా చూసింది.ఈ లోకంలో ఆమెను ఉత్తేజంగా ఏకైక మార్గం,ఆమె రహస్యంగా చేసిన రచనలే.ఆమె తెల్ల వారు జామున ప్రారంభమయ్యే పని దినం,రాత్రి ముగిసే సమయానికి, ఆమె తన పిల్లలను నిద్రపుచ్చి, తలుపులు వేసి,చిన్న దీపం వెలుగులో వ్రాసేది.వంటిల్లులోని పొగకు నిరంతరం గురి కావడం, తగినంత వెలుతురు లేకపోవడంతో ఆమె కళ్ళదృష్టి ఇబ్బంది పెట్టేది,నొప్పి చాలా ఎక్కువ అయినప్పుడు, ఆమె కళ్ళు మూసుకుని వ్రాసేది.ఆమె కుల స్త్రీల /సోదరీమణులనిరాశ, అధోకరణంను,దుస్థితిని ,లలితాంబిక ఆమె ప్రసిద్ధ మలయాళ నవల 'అగ్నిసాక్షి లో బహిర్గతం చేసింది.[5] ఈ నవల తరువాత 1997లో అగ్నిసాక్షి (1998 చలనచిత్రం)చిత్రంగా అదే టైటిల్‌తో రూపొందించబడింది. నంబూద్రి కుల ఆచారంలో పెద్ద కొడుకును మాత్రమే అదే కులంలో వివాహం చేసుకోవడానికి అనుమతిస్తారు.మిగతా వారందరూ ఇతర కులాల స్త్రీలతో, సాధారణంగా మాతృవంశ నాయర్ లతో పెళ్ళిళ్ళు చేసుకుంటారు.

ఇది నంబూద్రి కుల కులకట్టు బాటు లేదా ఆచారం. ఇలా బయటి వారితోసంబంధం /పెళ్లి జరిగిన పిల్లలకు వారసత్వంగా పొందే హక్కు లేనందున, మగ పిల్లలకు మాత్రమే వారసత్వం ఎల్లప్పుడూ వివాదరహితంగా ఉండేలా ఈ ఆచారం వీలు కల్పిస్తున్నది.ఫలితంగా, చాలా మంది నంబూదిరి స్త్రీలు జీవితాంతం అవివాహితులుగా ఉండిపోయేవారు.సూర్యకిరణాలు వారి శరీరాలను తాకకూడని విధంగా గదుల్లో వారి జీవనం గడపడం,కఠిన కారాగార శిక్ష విధించినట్లు వారు భావించారు.ఎవ్వరైన ఈ ఆచారా న్ని దాటిన దాటినట్లు అనుమానం కల్గిన వారిని స్మార్తవిచారం అనే మగ పెద్దల న్యాయ స్థానాల ద్వారా విచారించి ,శిక్షవేసేవాళ్ళు. ఈ న్యాయస్థానాలు ఒక మహిళ యొక్క సామాజిక స్థితిని తొలగించి, ఆకలితో అలమటించే లా చేసేవి. కిటికీలోంచి బయటకు చూడడానికి కూడా అనుమతించని ఈ మహిళ లకు, అలాంటి జీవితం మానసికంగా, ఆర్థికంగా దుర్బర ంగా వుండేది. అంతర్జనములు కుటుంబానికి చెందిన స్త్రీలు, ఇంటి నుండి బయలుదేరిన అరుదైన సందర్భాలలో, వారు తమ శరీర మంతా ఒక మందపాటి కోటు వంటి ది కప్పుకొని , నడుము వరకు కప్పి వుంచే,మూసి వుంచే ఆకు గొడుగును ధరించాలి,తద్వారా వారు నడిచేటప్పుడు వారి స్వంత పాదాలను మాత్రమే చూసుకో గలి గే వారు. తమ కుల స్త్రీ పై విధించిన అగ్రవర్ణ కూలాచారంకు విరుద్ధంగా, ఉన్నత కులాల పురుషుల సమక్షంలో తక్కువ కులాల స్త్రీలు తమ రొమ్ములను కప్పి వుంచారదని ఆచారాన్ని అమలు చేసేవారు, ఎవ్వరైన తమ వక్షజాలను కప్పే టందుకు ప్రయత్నిస్తే, చేసినందుకు శిక్షించేవారు.

ఆవిధంగా నిమ్నజాతి అనబడే వారు తమ పైభాగాన్ని కప్పిపుచ్చకుండా వుండటం అలవాటుగా చేసు కుని వెళ్లేవారు.ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో కేరళలోని అనేక సంస్కరణవాద, మిషనరీ ఉద్యమాలు నిమ్న కులాల స్త్రీలకు పలుమార్లు బోధించి ,ఒప్పించి బలవంతంగా పై దుస్తులు ధరించ డమ్ అలవాటు చేసారు.1930ల నాటికి, చాలా మంది రాజ కుటుంబాలు (కులాల వారీగా బ్రాహ్మణులకు దిగువన ఉన్నవారు,) తమ స్త్రీలను బ్లౌజ్‌లు/రవికెలు ధరించడానికి అనుమతించారు, అయితే ఈ పద్ధతి దిగువ పేద కుటుంబాలకు లలో వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టింది, కారణాలలో బ్లౌజ్‌/రవికలు చాలా ఖరీదైనవి కావటం.ఆమె కథలో రివెంజ్ హర్సెల్ఫ్ (ఇంగ్లీషు అనువాదం ది ఇన్నర్ కోర్ట్ యార్డ్లో [3]) సంకలనం చేయబడింది.

ఆమె "పతనమైన స్త్రీ" తాత్రి కథ ద్వారా లోపలి ఇంట్లో ఏకాంతంగా ఉన్న అగ్రవర్ణ నంబూదిరి స్త్రీలు ఎదుర్కొనే నైతిక, లైంగిక ఎంపికలను హైలైట్ చేసింది. నాయర్ స్త్రీలు తమ మాతృస్వామ్య సంస్కృతిలో సాపేక్షంగా స్వేచ్ఛా లైంగిక జీవితాన్ని గడిపే కేరళలో,నంబూద్రి స్త్రీల దుస్థితి కడు దయానీయమైనది గా వుండేది అప్పట్లో. ఆమె కథ మూలపాలింటే మనంలో సమాజంలో కేంద్ర సంఘటిత శక్తిగా స్త్రీ పాత్రను హైలైట్ చేసింది, ఆమె కృత్రిమ కుటుంబ నియంత్రణకు మద్దతు ఇచ్చింది కృత్రిమ జన నియంత్రణ ప్రాథమిక స్త్రీ లక్షణాలకుఇబ్బంది లేనంత వరకు లేనంత అ నుసరణీయమని ఆమె నమ్మింది.[6]

సంతానం వివరాలు

[మార్చు]

ఆమెకు ముగ్గురు కుమారులు, భాస్కర కుమార్,ఎన్. మోహనన్ , రాజేంద్రన్, నలుగురు కుమార్తెలు, లీల, శాంత, రాజం, మణి.ఎన్. మోహనన్ ప్రముఖ రచయిత, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడా.[7]

అవార్డులు, గౌరవాలు

[మార్చు]
 • 1965: Kerala Sahitya Akademi Award for Children's Literature– Gosayi Paranja Katha[8]
 • 1973: Kerala Sahitya Akademi Award for Literary Criticism– Sita Mutal Satyavati Vare[9]
 • 1977: List of Sahitya Akademi Award winners for Malayalam|Sahitya Akademi Award – Agnisakshi[10]
 • 1977:Kerala Sahitya Akademi Award for Novel – Agnisakshi[7]
 • 1977: Vayalar AwardAgnisakshi[11]
 • 1981: Kerala Sahitya Akademi Fellowship[12]

ఇవికూడా చదవండి

[మార్చు]

1.ప్రియా జింగన్

2.వీణా మజుందార్

3.సంపత్ పాల్ దేవి

4.షర్మిలా రేగే

5.శశి దేశ్‌పాండే

6.షాజెహాన్ ఆపా

మూలాలు

[మార్చు]
 1. Devi, Gayatri (2019-03-29). "Lalithambika Antharjanam : The Writer Who Helped Shape Kerala's Feminist Literature". Feminism In India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-03-30.
 2. "Biography on Kerala Sahitya Akademi portal". Kerala Sahitya Akademi portal. 2019-03-30. Retrieved 2019-03-30.
 3. 3.0 3.1 Lakshmi Holmström, ed. (1991). The Inner Courtyard. Rupa & Co.Contains the translation "Revenge Herself", tr. Vasanti Sankaranarayan
 4. "Profile of Malayalam Story Writer Lalithambika Antharjanam". malayalasangeetham.info. 2019-03-30. Retrieved 2019-03-30.
 5. "Agnisakshi by Lalithambika Antharjanam - Book Review". www.keralaculture.org (in ఇంగ్లీష్). Retrieved 2019-03-30.
 6. J. Devika, Family planning as liberation: the ambiguities of "emancipation from biology" in Kerala Archived 8 ఆగస్టు 2017 at the Wayback Machine(Working paper version),Inter-Asia Cultural StudiesVolume 7, Issue 1 March 2006 , pages 43–61
 7. 7.0 7.1 "Kerala Sahitya Akademi Award for Novel". Kerala Sahitya Akademi. 2019-03-30. Archived from the original on 9 November 2013. Retrieved 2019-03-30.
 8. "Kerala Sahitya Akademi Award for Children's Literature" (in మలయాళం). Kerala Sahitya Akademi. Archived from the original on 27 March 2019. Retrieved 16 February 2023.
 9. "Kerala Sahitya Akademi Award for Literary Criticism". Kerala Sahitya Akademi. Archived from the original on 9 November 2013. Retrieved 16 February 2023.
 10. "Literary Awards". 2007-05-24. Archived from the original on 2007-05-24. Retrieved 2019-03-30.
 11. "വയലാര്‍ അവാര്‍ഡ്" (in మలయాళం). Kerala Sahitya Akademi. Archived from the original on 2011-07-17. Retrieved 6 February 2023.
 12. "Kerala Sahitya Akademi Fellowship". Kerala Sahitya Akademi. 2019-03-30. Retrieved 2019-03-30.