Jump to content

లహిరు గమగే

వికీపీడియా నుండి
లహిరు గమగే
Lahiru Gamage, October 2017
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Panagamuwa Lahiru Sampath Gamage
పుట్టిన తేదీ (1988-04-05) 1988 ఏప్రిల్ 5 (వయసు 36)
మరదానా, శ్రీలంక
మారుపేరునాయా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 142)2017 అక్టోబరు 6 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2018 జూన్ 6 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 160)2014 నవంబరు 2 - ఇండియా తో
చివరి వన్‌డే2017 అక్టోబరు 20 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 5 9 111 97
చేసిన పరుగులు 6 4 977 194
బ్యాటింగు సగటు 1.50 2.00 10.17 5.10
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 3 3 49 18
వేసిన బంతులు 1,112 402 14,803 3,620
వికెట్లు 10 9 288 103
బౌలింగు సగటు 57.30 43.55 30.37 30.82
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 14 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 2/38 4/57 7/47 5/13
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 2/0 30/– 16/–
మూలం: ESPNcricinfo, 17 August 2022

పనగమువా లహిరు సంపత్ గమగే, శ్రీలంక క్రికెటర్. టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లలలో జాతీయ జట్టు కోసం ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఫాస్ట్-మీడియం పేస్ బౌలింగ్ చేశాడు.

జననం

[మార్చు]

పనగమువా లహిరు సంపత్ గమగే 1988, ఏప్రిల్ 5న శ్రీలంకలోని మరదానాలో జన్మించింది.

దేశీయ క్రికెట్

[మార్చు]

2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం దంబుల్లా జట్టులో ఎంపికయ్యాడు.[1][2] టోర్నమెంట్ సమయంలో దంబుల్లా తరఫున రెండు మ్యాచ్‌లలో పదిమందిని అవుట్‌ చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[3] తరువాతి నెలలో అతను 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం దంబుల్లా జట్టులో కూడా ఎంపికయ్యాడు.[4]

2018 ఆగస్టులో 2018 ఎస్ఎల్సీ టీ20 లీగ్‌లో లహిరు గమగే జట్టులో ఎంపికయ్యాడు.[5] 2021, ఆగస్టులో 2021 ఎస్ఎల్సీ ఇన్విటేషనల్ టీ20 లీగ్ టోర్నమెంట్ కోసం ఎస్ఎల్సీ గ్రీన్స్ జట్టులో ఎంపికయ్యాడు.[6] తొలి మ్యాచ్‌కు ముందు ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు.[7] 2021 నవంబరులో 2021 లంక ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ళ డ్రాఫ్ట్ తర్వాత కొలంబో స్టార్స్ కోసం ఆడటానికి ఎంపికయ్యాడు.[8]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2014 నవంబరు 2న భారత జట్టుతో జరిగిన మ్యాచ్ తో శ్రీలంక తరపున తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[9] 2015లో పాకిస్తాన్ వన్డే సిరీస్‌లో లసిత్ మలింగ పేలవ ప్రదర్శన తర్వాత, నువాన్ ప్రదీప్‌కు గాయం కావడంతో గమగే చివరి వన్డే కోసం జట్టులోకి తీసుకోబడ్డాడు.

2017 ఆగస్టులో భారత్‌తో జరిగిన మూడో మ్యాచ్‌కి ముందు శ్రీలంక టెస్టు జట్టులో చేర్చబడ్డాడు, కానీ ఆడలేదు.[10] 2017 అక్టోబరు 6న శ్రీలంక మొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక తరపున తన టెస్టు అరంగేట్రం చేశాడు. పాకిస్థాన్ ఓపెనర్ షాన్ మసూద్‌ను అవుట్ చేయడం ద్వారా అతను మొదటి ఇన్నింగ్స్‌లో తన మొదటి టెస్ట్ వికెట్‌ను తీసుకున్నాడు.[11]

2017 అక్టోబరులో పాకిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు శ్రీలంక ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు, కానీ అతను ఆడలేదు.[12]

2018 మేలో 2018–19 సీజన్‌కు ముందు శ్రీలంక క్రికెట్ ద్వారా జాతీయ కాంట్రాక్ట్‌ను పొందిన 33 మంది క్రికెటర్లలో అతను ఒకడు.[13][14]

మూలాలు

[మార్చు]
  1. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-21.
  2. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 27 March 2018. Retrieved 2023-08-21.
  3. "Sri Lanka Super Four Provincial Tournament, 2017/18, Dambulla: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2023-08-21.
  4. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-21.
  5. "SLC T20 League 2018 squads finalized". The Papare. Retrieved 2023-08-21.
  6. "Sri Lanka Cricket announce Invitational T20 squads and schedule". The Papare. Retrieved 9 August 2021.
  7. "Change of teams for Kamil, Himasha & Prabath in SLC T20 League". The Papare. Retrieved 2023-08-21.
  8. "Kusal Perera, Angelo Mathews miss out on LPL drafts". ESPN Cricinfo. Retrieved 2023-08-21.
  9. "Sri Lanka tour of India, 1st ODI: India v Sri Lanka at Cuttack, Nov 2, 2014". ESPNcricinfo. Retrieved 2023-08-21.
  10. "SL pick Chameera, Gamage for third India Test". ESPN Cricinfo. Retrieved 2023-08-21.
  11. "2nd Test (D/N), Sri Lanka tour of United Arab Emirates and Pakistan at Dubai, Oct 6-10 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-21.
  12. "Thisara Perera to captain Sri Lanka in Lahore". ESPN Cricinfo. Retrieved 2023-08-21.
  13. "Sri Lanka assign 33 national contracts with pay hike". International Cricket Council. Retrieved 22 May 2018.
  14. "Sri Lankan players to receive pay hike". ESPN Cricinfo. Retrieved 2023-08-21.

బాహ్య లింకులు

[మార్చు]