Jump to content

లాకీ ఫెర్గూసన్

వికీపీడియా నుండి
లాకీ ఫెర్గూసన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లాచ్‌లాన్ హామండ్ ఫెర్గూసన్
పుట్టిన తేదీ (1991-06-13) 1991 జూన్ 13 (వయసు 33)
ఆక్లండ్, న్యూజీలాండ్
ఎత్తు6 అ. 1 అం. (185 cమీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 276)2019 డిసెంబరు 12 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 190)2016 డిసెంబరు 4 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2023 జనవరి 24 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.69 (formerly 87)
తొలి T20I (క్యాప్ 71)2017 జనవరి 3 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 1 - ఇంగ్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.69 (formerly 87)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013–presentఆక్లండ్
2017రైజింగ్ పూణే సూపర్‌జైంట్
2018డెర్బీషైర్
2019–2021;2023–presentకోల్‌కతా నైట్‌రైడర్స్
2021యార్క్‌షైర్
2021Manchester Originals
2022గుజరాత్ టైటాన్స్
2023వెల్ష్ ఫైర్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 53 33 46 91
చేసిన పరుగులు 97 23 505 215
బ్యాటింగు సగటు 6.92 4.60 13.64 6.93
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 19 14 41 24
వేసిన బంతులు 2,795 692 7,297 4,685
వికెట్లు 85 44 165 156
బౌలింగు సగటు 31.04 20.52 24.52 27.42
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 1 11 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 5/45 5/21 7/34 6/27
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 8/- 16/– 22/–
మూలం: Cricinfo, 1 September 2023

లాచ్లాన్ హమ్మండ్ ఫెర్గూసన్ (జననం 1991 జూన్ 13) న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూజిలాండ్ క్రికెటరు. ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. అతను 144 కిమీ/గం పైబడిన వేగంతో బౌలింగ్ చేయగలడు. అతని అత్యంత వేగం 157.3 కిమీ/గం. వేగవంతమైన పేస్‌కు, ప్రాణాంతక బౌన్సర్‌లకూ పేరుగాంచిన అతను, ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడు. [1] [2]

దేశీయ, T20 ఫ్రాంచైజీ కెరీర్

[మార్చు]

2017 ఫిబ్రవరిలో, 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. [3] 2018 డిసెంబరులో, 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్లేయర్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అతనిని కొనుగోలు చేసింది. [4] [5] 2019 నవంబరులో, 2019-20 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో, ఫెర్గూసన్ తన 150వ ఫస్ట్-క్లాస్ వికెట్ తీసుకున్నాడు. [6] 2021 మార్చిలో, ఇంగ్లండ్‌లో 2021 T20 బ్లాస్టు పోటీకి ముందు ఫెర్గూసన్ యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు సంతకం చేసాడు. [7]

2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో, ఫెర్గూసన్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. [8]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2016 నవంబరులో, అతను ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కోసం న్యూజిలాండ్ యొక్క వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టుకు ఎంపికయ్యాడు. [9] 2016 డిసెంబరు 4న ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ తరపున తన వన్‌డే రంగప్రవేశం చేసాడు [10]

2017 జనవరి 3న అతను బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ తరపున తన ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) రంగప్రవేశం చేసాడు. [11] మ్యాచ్‌లో అతను తన మొదటి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. అది సాధించిన రెండో ఆటగాడతడు. [12]

2017 నవంబరులో, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం న్యూజిలాండ్ యొక్క టెస్టు జట్టులో అతన్ని చేర్చారు, కానీ అతను ఆడలేదు. [13] 2018 మేలో, 2018–19 సీజన్‌కు కొత్త న్యూజిలాండ్ క్రికెట్ కాంట్రాక్ట్‌ను పొందిన ఇరవై మంది ఆటగాళ్లలో అతను ఒకడు. [14]

2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [15] [16] 2019 జూన్ 5న, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో, ఫెర్గూసన్ వన్‌డేలలో తన 50వ వికెట్‌ను తీసుకున్నాడు. [17] ప్రపంచ కప్ తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), ఫెర్గూసన్‌ను జట్టులో వర్ధమాన స్టార్‌గా పేర్కొంది. [18] అతను ICC చే టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌లో ఎంపికయ్యాడు. [19]


2019 నవంబరులో, ఫెర్గూసన్ న్యూజిలాండ్ టెస్టు స్క్వాడ్‌లో ఇంగ్లాండ్‌తో వారి స్వదేశీ సిరీస్‌కు, ఆస్ట్రేలియా పర్యటనకూ ఎంపికయ్యాడు. [20] మొదటి టెస్టుకు ముందు, ఫోర్డ్ ట్రోఫీలో పాల్గొనేందుకు న్యూజిలాండ్ జట్టు నుండి ఫెర్గూసన్ విడుదలయ్యాడు. [21] అయితే, సిరీస్‌లోని రెండవ మ్యాచ్ కోసం అతన్ని న్యూజిలాండ్ టెస్టు జట్టులోకి తిరిగి తీసుకున్నారు. [22] 2019 డిసెంబరు 12న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరపున టెస్టు రంగప్రవేశం చేశాడు [23]

2020 నవంబరు 27న, వెస్టిండీస్‌తో జరిగిన మొదటి T20I లో, T20I క్రికెట్‌లో ఫెర్గూసన్ తన మొదటి ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. [24] 2021 ఆగస్టులో, ఫెర్గూసన్ 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [25] అయితే, పిక్క నొప్పి కారణంగా టోర్నమెంటు నుండి తప్పుకున్నాడు. [26]

గౌరవాలు

[మార్చు]
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ 2022

మూలాలు

[మార్చు]
  1. "Lockie Ferguson". ESPN Cricinfo. Retrieved 29 October 2015.
  2. "'It would be a dream come true' – Lockie Ferguson eyes Test debut". International Cricket Council. Retrieved 20 September 2019.
  3. "List of players sold and unsold at IPL auction 2017". ESPN Cricinfo. Retrieved 20 February 2017.
  4. "IPL 2019 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 18 December 2018.
  5. "IPL 2019 Auction: Who got whom". The Times of India. Retrieved 18 December 2018.
  6. "Plunket Shield round-up: Lockie Ferguson and Neil Wagner let it rip". ESPN Cricinfo. Retrieved 12 November 2019.
  7. "Lockie Ferguson signs Yorkshire deal for 2021 T20 Blast". ESPN Cricinfo. Retrieved 4 March 2021.
  8. "IPL Auction 2022: From Mohammed Shami to Lockie Ferguson, full list of players bought by Gujarat Titans - Firstcricket News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 12 February 2022. Retrieved 12 February 2022.
  9. "Uncapped Ferguson in NZ squad for Chappell-Hadlee Trophy". ESPN Cricinfo. Retrieved 25 November 2016.
  10. "New Zealand tour of Australia, 1st ODI: Australia v New Zealand at Sydney, Dec 4, 2016". ESPN Cricinfo. Retrieved 4 December 2016.
  11. "Bangladesh tour of New Zealand, 1st T20I: New Zealand v Bangladesh at Napier, Jan 3, 2017". ESPN Cricinfo. Retrieved 3 January 2017.
  12. "Williamson, Ferguson thump Bangladesh". ESPNcricinfo. 3 January 2017. Retrieved 4 January 2017.
  13. "Blundell to make Test debut against WI; NZ call Ferguson as cover for Southee". ESPN Cricinfo. 26 November 2017. Retrieved 26 November 2017.
  14. "Todd Astle bags his first New Zealand contract". ESPN Cricinfo. Retrieved 15 May 2018.
  15. "Sodhi and Blundell named in New Zealand World Cup squad". ESPN Cricinfo. Retrieved 3 April 2019.
  16. "Uncapped Blundell named in New Zealand World Cup squad, Sodhi preferred to Astle". International Cricket Council. Retrieved 3 April 2019.
  17. "World Cup 2019: Ross Taylor, Matt Henry script New Zealand's 2-wicket win over Bangladesh". India Today. Retrieved 5 June 2019.
  18. "CWC19 report card: New Zealand". International Cricket Council. Retrieved 15 July 2019.
  19. "CWC19: Team of the Tournament". ICC. Retrieved 25 July 2019.
  20. "Lockie Ferguson set for New Zealand Test debut after maiden call-up". ESPN Cricinfo. Retrieved 14 November 2019.
  21. "New Zealand v England: Black Caps omit Lockie Ferguson, go with tried and true". Stuff. Retrieved 20 November 2019.
  22. "Boult, de Grandhomme ruled out of second Test with injuries". International Cricket Council. Retrieved 27 November 2019.
  23. "1st Test (D/N), ICC World Test Championship at Perth, Dec 12-16 2019". ESPN Cricinfo. Retrieved 12 December 2019.
  24. "Pollard fires as Windies set New Zealand tough target". Yahoo News. Archived from the original on 6 డిసెంబరు 2020. Retrieved 27 November 2020.
  25. "Black Caps announce Twenty20 World Cup squad, two debutants for leadup tours with stars absent". Stuff. Retrieved 9 August 2021.
  26. "Ferguson ruled out of T20 World Cup with calf tear". New Zealand Cricket. Archived from the original on 22 నవంబరు 2021. Retrieved 26 October 2021.