లావో షీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lao She
Portrait photo of the writer Lao She
పుట్టిన తేదీ, స్థలంShu Qingchun
(1899-02-03)1899 ఫిబ్రవరి 3
Beijing, Qing Empire
మరణం1966 ఆగస్టు 24(1966-08-24) (వయసు 67)
Beijing
సమాధి స్థానంBabaoshan Revolutionary Cemetery, Beijing
కలం పేరుLao She
వృత్తిNovelist, dramatist
భాషChinese
పూర్వవిద్యార్థిBeijing Normal University
గుర్తింపునిచ్చిన రచనలుRickshaw Boy
Teahouse
జీవిత భాగస్వామిHu Jieqing
సంతానం4
Chinese name
చైనీస్
Shu Qingchun
సంప్రదాయ చైనీస్
సరళీకరించిన చైనీస్
Shu Sheyu
చైనీస్

షు కింగ్‌చున్ (1899 ఫిబ్రవరి 3  – 1966 ఆగస్టు 24) లావోషీ కలం పేరుతో సుపరిచితుడు. అతను చైనీస్ నవలా రచయిత, నాటక రచయిత. అతను 20వ శతాబ్దపు చైనీస్ సాహిత్యంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకడు[1]. అతను మంచు జాతికి చెందినవాడు. 1913లో అతను బీజింగ్ నార్మల్ థర్డ్ హైస్కూల్‌లో (ప్రస్తుతం బీజింగ్ థర్డ్ హైస్కూల్) చేరాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ పాఠశాలను విడిచిపెట్టాల్సి వచ్చింది. అదే సంవత్సరంలో అతను బీజింగ్ నార్మల్ యూనివర్సిటీలో చేరి 1918లో పట్టభద్రుడయ్యాడు. అతను 1919లో జరిగిన మే ఫోర్త్ ఉద్యమానికి ప్రభావితమయ్యాడు. అతను ఇలా అన్నాడు "మే ఫోర్త్ ఉద్యమం నాకు కొత్త స్ఫూర్తిని, కొత్త సాహిత్య భాషను ఇచ్చింది . మే ఫోర్త్ ఉద్యమం నన్ను రచయితగా మార్చినందుకు నేను కృతజ్ఞుడను." అతని నవల రిక్షా బాయ్,టీహౌస్ నాటకాలు ప్రసిద్ధి చెందనవి. అతని రచనలు ముఖ్యంగా  బీజింగ్ మాండలికం లో ప్రసిద్ధి చెందాయి. చైనాలో హాస్యరస భరితమైన నవలకు అధిక్షేప రచనలకు కథానికలకు పేరుగాంచాడు. చైనా- జపాన్ యుద్ధారంభం తరువాత ఈయన దేశభక్తిని పురికొల్పే రచనలను ఎక్కువగా చేశాడు.   లావో షే  తన 17వ ఏట ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా చేరి  జిల్లా అధికారి అయ్యాడు. 1924లో ఇంగ్లాండ్ వెళ్లి జీవన భృతికి చైనీస్ భాషను బోధిస్తూ మింగ్‌ రాజవంశాన్ని గూర్చిన నవల చిన్‌ పీంగ్‌ మే (Chin ping mei) ను అనువదించాడు.  ఇంగ్లాండ్ లో ఉండగా డికెన్స్‌ వల్ల  ప్రభావితుడై మూడు నవలలు వ్రాసాడు.  ధీమంతుడు శక్తిమంతుడు అయిన వ్యక్తే అప్పటి చైనాను పీడిస్తున్న అవినీతి, ఆర్థిక మాంద్యంతో కూడిన క్లిష్ట పరిస్థితి నుండి విముక్తి చేయగలడని ఇతివృత్తాన్ని ఈ నవలలో లావో షే చిత్రించాడు[2].

ఇంగ్లాండు నుంచి 1931లో చైనా తిరిగి వచ్చేసరికి హాస్య నవలాకారుడుగా  పేరు గాంచినట్లు గ్రహించి, ఈయన సంచలనాత్మకాలు, హాస్య రసభరితాలు  అయినా నవలలు వ్రాయడం కొనసాగించాడు.  చైనా కు తిరిగి వచ్చిన తర్వాత వ్రాసిన నియూ టియెంట్స్ (The life of Niu Tientz’u1934), లోటో సీయంగ్స్‌ట్సు(Lo-to Hsiang tzu,1936) అనే రెండు నవలల్లోనూ ఈయన ధోరణి లో మార్పు కనిపిస్తుంది.  వీనిలో ఈయన సాంఘిక వాతావరణం యొక్క ప్రాముఖ్యం దానికి వ్యతిరేకంగా వ్యక్తిగత పోరాటపు వైఫల్యం ప్రతిపాదించాడు.  చైనా జపాన్ యుద్ధ సమయంలో ఈయన దేశభక్తి ప్రబోధకాలైనా  జపాన్ కు వ్యతిరేకమైన  రచనలు చేశాడు.  రచనలు తక్కువ స్థాయిలోని వని చెప్పాలి.  1946- 47 లో  లావో షే  అమెరికాలో పర్యటించి సాంస్కృతిక ఉపన్యాసాలు చేసి తన నవలల అనువాదాన్ని పర్యవేక్షిస్తూ గడిపాడు.  వీనిలో ది యెల్లో స్టార్మ్‌, (The yellow Storm,1951) అతని ఆఖరు నవల ద డ్రమ్‌ సింగర్స్‌(The Drum Singers,1952)కూడా ఉన్నాయి.  ఇవి చైనీస్ భాషలో అసలు ప్రచురింపబడలేదు. చైనా కు తిరిగి వచ్చిన తరువాత లావో షే  వివిధ సాంస్కృతిక సాహిత్య ఉద్యమాలలో పాల్గొంటూ ఇంతకు ముందు లాగే నాటకాలు వ్రాయడం కొనసాగించాడు. వీనిలో  పేర్కొనదగ్గవి. లుంగ్‌-సూ-కౌ(Dragan Beard ditch,1951)చౌ-క్వాన్‌(The tea house,1957)   వీనిలోబీజింగ్ ప్రాంతపు  చైనీస్ మాండలిక భాష కౌశలాన్ని చక్కగా ప్రదర్శించాడు.  లావో షే 1966  అక్టోబర్ లో చనిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. "Lao She | Chinese author | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2021-12-11.
  2. విశ్వసాహతి-5. హైదరాబాద్‌: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. 1994. p. 830. ISBN 81-86073-09-4.
"https://te.wikipedia.org/w/index.php?title=లావో_షీ&oldid=3849986" నుండి వెలికితీశారు